విశాఖపట్నంలో దారుణ హత్య జరిగింది. తాను పరిచయం చేసిన స్నేహితుడితో చనువుగా ఉంటుందన్న కోపంతో చంపేసిన ఈ ఉదంతం సంచలనంగా మారింది. అసలేమైందంటే.. అనకాపల్లి జిల్లా పరవాడకు చెందిన గోపాల్ పెయింటర్. పెయింటింగ్ పనులు చేస్తూ ఉంటాడు.
అతనికి తమ ప్రాంతానికే చెందిన 28 ఏళ్ల వివాహిత అయిన శ్రావణితో పరిచయం ఏర్పడింది. భర్తతో విభేదాల కారణంగా దూరంగా ఉంటోంది. ఆమె జగదాంబ కూడలిలోని ఒక షాపులో పని చేస్తోంది. వీరి స్నేహం తర్వాతి లెవెల్ కు వెళ్లింది. దీంతో.. వారిద్దరూ ఒక ఇంటిని అద్దెకు తీసుకొని ఆర్నెల్లుగా కలిసి ఉంటున్నారు.
ఈ క్రమంలో తన స్నేహితుడైన వెంకటేశ్ ను ఆమెకు పరిచయం చేశాడు. కొంతకాలంగా శ్రావణి.. తన స్నేహితుడు వెంకటేశ్ తో ఎక్కువగా ఫోన్లో మాట్లాడటం మొదలైంది. దీంతో.. వారిద్దరి మధ్య గొడవలు అవుతున్నాయి. ఈ వ్యవహారంపై మాట్లాడుకుందామంటూ శ్రావణికి.. వెంకటేశ్ లకు ఫోన్ చేసి చెప్పాడు గోపాల్. అనంతరం.. వారు ముగ్గురు కలిసి ఒకే వాహనం మీద ఆర్కే బీచ్ కు వెళ్లారు. అక్కడ వారు మాట్లాడుతుండగా.. పోలీసులు అక్కడకు వచ్చి వెళ్లిపోవాలని చెప్పటంతో వారు తిరిగి బయలుదేరారు.
ఆ క్రమంలో ఆర్కే బీచ్ కు సమీపంలో నిర్మాణం జరుగుతున్న ఒక ఇంటి వద్దకు వెళ్లారు. శ్రావణితో తాను ఒంటరిగా మాట్లాడాలని గోపాల్ చెప్పటంతో వెంకటేశ్ కాస్తంత దూరంగా ఉండిపోయాడు. ఈ క్రమంలో వెంకటేశ్ తో శ్రావణి చనువుగా ఉంటున్న విషయం వారి మధ్య చర్చకు రావటం.. అది కాస్తా వాగ్వాదం వరకు వెళ్లింది. ఈ క్రమంలో తీవ్ర కోపానికి గురైన గోపాల్.. శ్రావణి గొంతు నులిమాడు.
దీంతో.. ఆమె అక్కడికక్కడే మరణించింది. విగతజీవిగా ఉన్న శ్రావణిని అక్కడే విడిచి పెట్టిన గోపాల్.. తానిప్పుడే వస్తానంటూ బయటకు వెళ్లి.. నేరుగా గాజావాక పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. తాను చేసిన పని చెప్పి లొంగిపోయాడు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.
This post was last modified on May 21, 2023 12:40 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…