దేశంలో2016లో కొత్తగా వచ్చిన 2000 రూపాయలనోట్లను రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా రద్దు చేసింది. ఈ నోట్లను ఇక చెల్లవని ప్రకటించింది. వీటిని చలామణి నుంచి ఉపసంహరిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చింది. ఈ మేరకు నోట్ల జారీని తక్షణమే నిలిపివేయాలంటూ దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది.
లావాదేవీలకు గడువు!
2000 నోటు రద్దు చేసినా.. సెప్టెంబర్ 30, 2023 వరకు ఈ నోటు చట్టబద్ధంగానే చెల్లుబాటు అవుతుంది. ఇప్పటికే ఎవరి వద్దయినా నోట్లు ఉంటే సెప్టెంబర్ 30 లోగా బ్యాంకుల వద్ద మార్చుకోవచ్చు. ఒక్కో విడతలో రూ.20 వేల విలువైన నోట్లను ఎక్స్చేంజ్ చేసుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది. వినియోగదారులు తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లన అకౌంట్‌లో జమ చేసుకోవచ్చు లేదా ఇతర నోట్లతో మార్చుకునేందుకు వెసులుబాటు కల్పించింది.
‘క్లీన్ నోట్ పాలసీ’లో భాగంగా రూ.2 వేల నోటును చెలామణీ నుంచి ఉపసంహరించుకోవాలని నిర్ణయించి నట్టు ఆర్బీఐ వెల్లడించింది. ఇదిలావుంటే, రూ.2000 నోట్లు నవంబర్ 2016లో ఆర్బీఐ చట్టం 1934లోని సెక్షన్ 24(1) కింద చెలామణిలోకి తీసుకొచ్చారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దు తర్వాత ఈ నోటును ఆర్బీఐ ప్రవేశపెట్టింది. అయితే 2018-19 నుంచి ప్రింటింగ్ నిలిపివేసినట్టు ఆర్బీఐ ప్రకటించింది. మొత్తంగా తాజాగా తీసుకున్న నిర్ణయ మాత్రం సంచలనంగా నే మారింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు తీసుకున్న ఈ నిర్ణయంవెనుక రాజకీయాలు కారణాలు ఉన్నాయా? అనే చర్చ కూడా జరుగుతుండడం గమనార్హం.
This post was last modified on %s = human-readable time difference 9:58 am
నవంబర్ నెల తొలి శుక్రవారం బోలెడు సినిమాలు మోసుకొస్తోంది కానీ మూవీ లవర్స్ లో ఏమంత ఆసక్తి కనిపించకపోవడం బాక్సాఫీస్…
2024 ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైర్లు రెండూ ఒకేసారి ఊడిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన…
ఏపీలో శాంతి భద్రతలపై, హోం మంత్రి వంగలపూడి అనితపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి…
కెరీర్ ఆరంభం నుంచి పెద్ద బడ్జెట్లలో స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ.. పెద్ద పెద్ద హీరోయిన్లతో జట్టు కడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే…
పిఠాపురంలో జరిగిన సభలో ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, ఏపీ హోం శాఖా మంత్రి అనిత రివ్యూ…
2024 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. నిర్మాణ…