డాలర్ డ్రీమ్ అన్నది చాలామందికి ఉండే కోరిక. దాన్ని తీర్చుకున్నంతనే తర్వాతి కల.. గ్రీన్ కార్డును సొంతం చేసుకోవటం. మొదటి అడుగ్గా అమెరికాకు వెళ్లటమైతే.. తదుపరి అడుగు అమెరికాలో శాశ్విత నివాస అర్హతకు చిహ్నమైన గ్రీన్ కార్డును సొంతం చేసుకోవటం. దీని కోసం లక్షలాది మంది భారతీయులు వేచి చూస్తుంటారు. భారతీయులతో పాటు.. చైనా.. మైక్సికో.. ఫిలిప్సీన్స్ దేశాలకు చెందిన వారు ఏళ్లకు ఏళ్లుగా ఎదురుచూస్తుంటారు.
కానీ.. వారికి మాత్రం ఆ అవకాశం అంతకంతకూ ఆలస్యం కావటమే తప్పించి.. తీరదు ఇంతకూ ఎందుకింత ఆలస్యమవుతుంది? అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చారు అమెరికాకు చెందిన సీనియర్ అధికారి ఒకరు. దేశాల వారీగా ఇచ్చే కోటాకు అనుగుణంగా.. పాత విధానాల్నే అమెరికా ఫాలో అవుతోంది. గతంతో పోలిస్తే.. భారత్, చైనా ఇతర దేశాల నుంచి వెళ్లే వారి సంఖ్య భారీగా పెరిగింది. కానీ.. గ్రీన్ కార్డుకు జారీ చేసే సంఖ్య మాత్రం గతంలో మాదిరిగానే ఉంచేశారు. దీంతో.. గ్రీన్ కార్డు కోసం ఏళ్లకు ఏళ్లు వేచి చూడాల్సి వస్తోందని పేర్కొన్నారు.
మొత్తం దరఖాస్తుల్లో ఒక్కో దేశానికి కేవలం ఏడు శాతం మాత్రమే గ్రీన్ కార్డులు జారీ చేయాలన్నది ప్రస్తుత విధానమని చెబుతున్నారు. ఇప్పుడున్న విధానాన్ని మార్చాలంటే దానికి అమెరికా కాంగ్రెస్ మాత్రమే నిర్ణయం తీసుకోగలదు. అమెరికా పౌరసత్వ.. వలస సేవల సంస్థ డైరెక్టర్ కు సీనియర్ సలహాదారుగా వ్యవహరిస్తున్న డాగ్లస్ రాండ్ మాట్లాడుతూ.. ఇమ్మిగ్రేషన్ చట్టాల ప్రకారం అమెరికా ప్రతి ఏడాది 2.26 లక్షల ఫ్యామిలీ ప్రిఫరెన్స్.. 1.4లక్షల గ్రీన్ కార్డులను జారీ చేసే వీలుంది.
ఇందులో ఒక్కో దేశానికి ఏడు శాతమంటే.. 25,620 గ్రీన్ కార్డుల్ని జారీ చేస్తారు. యూరోపియన్ దేశాల నుంచి ఉండే డిమాండ్ తక్కువగా ఉండటం వల్ల వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వస్తోంది. కానీ.. భారతీయులు.. చైనా.. మెక్సికో.. పిలిఫ్పీన్ దేశస్తుల నుంచి భారీ డిమాండ్ ఉంది. దీంతో.. వారి డిమాండ్ తగ్గట్లుగా వీసా జారీ లేకపోవటం వల్ల సరిపోవటం లేదన్నారు. ప్రతి ఏటా గ్రీన్ కార్డు కోసం లక్షల మంది అప్లై చేసుకుంటున్నట్లు చెబుతున్నారు.
తాజాగా అధికార డెమొక్రటిక్ పార్టీ ఇటీవల అమెరికా కాంగ్రెస్ లో ఒక బిల్లును ప్రవేశ పెట్టింది. 2023 పౌరసత్వ బిల్లులో పేర్కొన్న అంశాల ప్రకారం.. గ్రీన్ కార్డుల జారీకి దేశాల వారీగా కోటాను ఎత్తేసి.. హెచ్ 1బీ వీసాల్లో ముఖ్యమైన మార్పు చేయాలని ఈ బిల్లు చెబుతోంది. దేశాల వారీ కోటాలతో గత సంవత్సరాల్లో ఎవరికి కేటాయించకుండా మిగిలిన గ్రీన్ కార్డుల్ని వలసదారుల సంతానానికీ.. వారి భార్యలు.. భర్తలకు మంజూరు చేయాలని.. దీని ద్వారా వారి కుటుంబాల్ని ఏకం చేయాలని పేర్కొంది. ఈ బిల్లు కానీ ఆమోదం చెందితే.. భారతీయులతోపాటు.. చైనీయులు.. మెక్సికన్లకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని చెబుతున్నారు.
This post was last modified on May 19, 2023 7:28 pm
ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి తన మార్క్ నిర్ణయాలతో ప్రశంసలు అందుకుంటోన్న సంగతి తెలిసిందే.…
జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన…
తెలుగులో నితిన్ లై చిత్రంతో మేఘ ఆకాష్ హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది. రజనీకాంత్ పేట మూవీ తో తమిళ్…
ప్రముఖ ప్రవచన కర్త.. ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం `నైతిక విలువల` సలహాదారుగా నియమించిన విషయం తెలిసిందే.…
మహానటితో గొప్ప పెర్ఫార్మర్ గా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చాలా చేసింది…
ప్రస్తుతం దేశమంతా ‘పుష్ప’ కార్చిచ్చు వ్యాపిస్తోన్న సంగతి తెలిసిందే. క్రికెటర్లు మొదలు పొలిటిషియన్ల వరకు ‘పుష్ప’గాడి ఫైర్ కు ఫిదా…