Trends

అతను బౌల్డ్ చేస్తే బీసీసీఐకి 60 లక్షలు నష్టం

ఐపీఎల్‌లో ఒక బౌలర్ వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీశాడు. ఆ రెండూ బౌల్డ్‌లే. ఐతే అతను బౌల్డ్ చేసినందుకు బీసీసీఐ రూ.60 లక్షలు నష్టపోవడం గమనార్హం. ఇదేం లాజిక్? ఇందులో బెట్టింగ్, ఫిక్సింగ్ వ్యవహారం ఏమైనా ఉందా? అని ఆశ్చర్యం కలుగుతోందా? అలాంటిదేమీ లేదు.

ఆ బౌలర్ బౌల్డ్ చేసిన రెండు సందర్భాల్లోనూ మిడిల్ స్టంప్ రెండుగా విరిగిపోవడం విశేషం. ఆ విరిగిన స్టంప్ ఆషామాషీది కాదు. ఒక్కో స్టంప్ ఏకంగా రూ.30 లక్షలు ఖరీదు చేసేది. రెండు స్టంప్‌లు విరగడంతో బీసీసీఐకి రూ.60 లక్షల నష్టం తప్పలేదు. ఇది జరిగింది శనివారం రాత్రి ముంబయి-పంజాబ్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో. పరుగుల వర్షం కురిసిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్.. ఏకంగా 214 పరుగుల స్కోరు చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబయి కూడా దీటుగానే స్పందించింది. కానీ చివరికి 6 వికెట్లకు 201 పరుగులే చేసి ఓటమి పాలైంది.

గెలుపు బాటలో సాగుతున్న ముంబయికి కళ్లెం వేసింది పంజాబీ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్. చివరి ఓవర్లో ముంబయి విజయానికి 16 పరుగులు అవసరమైన స్థితిలో అతను కేవలం 2 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఈ ఓవర్లో 3, 4 బంతులకు తిలక్ వర్మ, వధేరాల వికెట్లు తీశాడతను. అర్ష్‌దీప్ ధాటికి రెండు సార్లూ మిడిల్ స్టంప్ ఎగిరిపోయింది. అతడి బంతుల వేగం ఏ స్థాయిలో ఉందంటే.. రెండుసార్లూ స్టంప్ రెండుగా విరిగిపోయింది. ఇవి ఆషామాషీ స్టంప్స్ కావు.

మైక్, కెమెరాతో పాటు ఎల్‌ఈడీ లైటింగ్ కూడా ఉన్న అధునాతన టెక్నాలజీతో తయారు చేసినవి. ఒక్కో స్టంప్ ధర ఏకంగా రూ.30 లక్షలట. అర్ష్‌దీప్ వల్ల రెండు స్టంప్‌లు పాడైపోవడంతో బీసీసీఐకి రూ.60 లక్షల నష్టం వచ్చింది. నిన్న రాత్రి నుంచి ఈ విషయంలో ట్రెండింగ్‌లో ఉంది. అర్ష్‌దీప్ బౌల్డ్ చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత కొన్నేళ్లలో ఐపీఎల్ ద్వారా వెలుుగలోకి వచ్చిన ఆణిముత్యాల్లో అర్ష్‌దీప్ ఒకడు. అతను ఇండియన్ టీంకు కూడా ఆడుతున్న సంగతి తెలిసిందే.

This post was last modified on April 23, 2023 2:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘పుష్ప-2’ ఈవెంట్లో రభస రభస

‘పుష్ప-2’ ట్రైలర్ లాంచ్ నార్త్ ఇండియాలో చేస్తున్నారంటే ఢిల్లీ, ముంబయి లాంటి సిటీల్లో ప్రెస్‌ను పిలిచి సింపుల్‌గా చేసేస్తారని అనుకున్నారంతా.…

2 mins ago

మీనాక్షి.. హీరోల గురించి ఒక్క మాటలో

ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ఈ ఏడాది ఆమె నుంచి వరుసగా క్రేజీ…

31 mins ago

ఆర్జీవీకి హైకోర్టు షాక్!

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు,…

33 mins ago

ద‌ర్శ‌కుడైతే ఎవరికెక్కువ..

వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ‌పై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ద‌ర్శ‌కుడైనంత మాత్రాన చ‌ట్టాలు పాటించ‌రా? అని…

40 mins ago

వైసీపీకి షాక్‌.. ఒకే రోజు వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీపై కేసులు

ఏపీ ప్ర‌తిప‌క్ష పార్టీ వైసీపీకి సోమ‌వారం ఒకే స‌మ‌యంలో ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీపై సోమ‌వారం…

41 mins ago

విరాట్ కోహ్లీ చివరి సిరీస్ ఇదేనా?

భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీకి ఇప్పుడు బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ప్రత్యేకమైన సిరీస్‌గా నిలవనుంది. ఐదు టెస్టుల ఈ సిరీస్‌లో…

2 hours ago