అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లి చదువుకోవాలని.. అక్కడ ఉద్యోగం చేయాలి.. కారణం ఏదైనా కల మాత్రం అమెరికాకు ప్రయాణమే అన్న వారందరికీ అగ్ర రాజ్యం తీపికబురు చెప్పింది. ఈ ఏడాది భారతీయులకు రికార్డు స్థాయిలో వీసాలు ఇచ్చేయనున్నట్లు చెప్పింది. ఈ ఏడాది 10 లక్షలు (మిలియన్) వీసాలు ఇవ్వనున్నట్లుగా అమెరికా విదేశాంగ శాఖలో సహాయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న డొనాల్ట్ వెల్లడించారు.
ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభానికే భారతీయ విద్యార్థులందరికీ స్టూడెంట్ వీసాల ఆమోద ప్రక్రియను పూర్తి చేస్తామని చెబుతున్నారు. అమెరికాలో చదువుకోవటం కోసం వెళుతున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులు రెండో స్థానంలో ఉన్నారు. అంతేకాదు.. మనోళ్లు అధికంగా కోరుకునే హెచ్ 1బీ, ఎల్ వర్కు వీసాల జారీకి ప్రాధాన్యతను ఇవ్వనున్నారు. కీలకమైన వర్కు వీసాల జారీకి భారత్ లోని కొన్ని కాన్సులేట్ లలో అరవై రోజుల కంటే తక్కువ సమయమే పడుతుందని చెప్పారు.
హెచ్ 1బీ వీసాలు ఉన్నప్పటికీ జాబ్స్ పోయిన ఐటీ నిపుణులు తమ హోదాను పునరుద్ధరించుకోవటానికి ఏమేం చేయాలో పేర్కొంటూ అమెరికన్ హోంల్యాండ్ సెక్యూరిటీ విధివిధానాలను విడుదల చేసినట్లుగా డొనాల్ట్ వెల్లడించారు. గడిచిన కొన్నాళ్లుగా భారత్ – అమెరికాల మధ్య ప్రయాణిస్తున్న వారి సంఖ్య ఏడాదికి పదిలక్షల వరకు చేరుకుంది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. భారతీయులు పెద్దఎత్తున అమెరికాలో నివసిస్తూ స్థిరపడుతుంటే.. భారత్ లోనూ నివసించే అమెరికన్ల సంఖ్య ఎక్కువ అవుతోంది. తాజాగా అమెరికా విదేశాంగ అంచనా ప్రకారం భారత్ లో లక్ష మంది వరకు అమెరికాన్లు నివసిస్తున్నట్లుగా చెబుతున్నారు.
This post was last modified on April 23, 2023 11:10 am
ఫౌజీ విడుదల వాయిదా గురించి అసలైన మైత్రి మూవీ మేకర్స్ ఇంకా చెప్పలేదు కానీ మిగిలిన సినిమాలు అలెర్ట్ అయిపోయి…
షాప్‌లో యూపీఐ పేమెంట్ చేయాలంటే ప్రస్తుతం ఫోన్‌లో యాప్ ఓపెన్ చేసి, కెమెరాతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాం. ఇక…
ఎవరు ఏమన్నా, ఎన్ని కామెంట్లు చేసినా దర్శకుడు అనిల్ రావిపూడి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలైతే చాలా ఉన్నాయి. మొదటిది కమిట్…
మూడు వారాలు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ రేంజ్ లో వీరబాదుడు బాదిన ఇరుముడి కలెక్షన్లు క్లైమాక్స్ కు వచ్చాయేమోనని అనుకుంటే…
కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలు ఈ రోజు మరింత బలపడిపోయాయి. ప్రభాస్ కొత్త సినిమా ‘ఫౌజి’ మరోసారి వాయిదా పడబోతోందని…
అమరావతి సౌండ్ లడఖ్ వరకు వినిపిస్తోందా..? ఇక్కడి విపక్షానికి మాత్రం అది వినిపించడం లేదా..? అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన…