కరోనా వ్యాక్సిన్.. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత డిమాండ్ ఉన్న వస్తువు ఇదే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వందకు పైగా దేశాలు వైరస్ బారిన పడి అల్లాడుతున్నాయి. దేశాల ఆర్థిక పునాదులే కదులుతున్నాయి. ప్రాణ నష్టం సహా ఎన్నో రకాల నష్టాలు చూస్తున్నారు జనాలు.
ప్రపంచమంతా ఒకరకమైన స్తబ్దత నెలకొందిప్పుడు. అదంతా పోవాలంటే కరోనా వ్యాక్సిన్ రావాల్సిందే. అన్ని అనుమతులూ పొంది కరోనాకు చక్కగా పని చేసే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే దానికుండే డిమాండ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది దీని మీద.
భారత్ విషయానికి వస్తే ఇక్కడ భారత్ బయోటెక్‌తో పాటు మరో సంస్థ వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమై ఉన్నాయి. మరోవైపు ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ అయిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ వ్యాక్సిన్ తయారీలో అత్యంత చురుగ్గా ఉన్న సంస్థలు ఐదింటితో ఒప్పందాలు చేసుకుని.. వాటితో కలిసి పని చేస్తోంది. ఏకంగా 450 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టిందీ సంస్థ.
దీని అధినేత అదర్ పూనవాలా ముందు నుంచి ఇండియాలోకి కరోనా వ్యాక్సిన్ తీసుకొచ్చే విషయంలో పాజిటివ్ న్యూస్‌లే చెబుతున్నారు. అత్యంత తక్కువ ధరతో, అత్యధిక మందికి వ్యాక్సిన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఒకేసారి ఐదు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నామని.. ఏది ముందు అందుబాటులోకి వస్తే దాన్ని మార్కెట్లోకి తెస్తామని అంటున్నారు.
ఆక్స్‌ఫర్ట్ యూనివర్శిటీ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ చివరి దశలో ఉండగా.. దానికి విదేశాల్లో, భారత్‌లో అనుమతులు రాకముందే ఇక్కడ పెద్ద ఎత్తున సీరమ్ సంస్థ ఉత్పత్తి చేస్తుండటం విశేషం. బహుశా ఈ వ్యాక్సిన్ ఫెయిలయ్యే ఛాన్సే లేదన్న కాన్ఫిడెన్స్ ఆ సంస్థది కావచ్చు.
This post was last modified on August 5, 2020 4:11 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…