తెలంగాణలో లీకు వీరులు సృష్టించిన తుఫాను.. మరిన్ని దిశలుగా పయనిస్తోంది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాలకు సంబంధించి పేపర్లు లీక్ అయిన వ్యవహారం.. అన్నివైపుల నుంచి విస్మయానికి గురి చేస్తోంది. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకోవడం తెలిసిందే. అయితే.. తోడుతున్న కొద్దీ.. నీరు ఊరినట్టు.. ఈ కేసులో విచారణ చేస్తున్న కొద్దీ విస్మయం కలిగించే విషయం వెలుగు చూస్తున్నాయి.
పేపర్ లీకు కుంభకోణంలో ఖమ్మం ప్రాంతానికి చెందిన దంపతులు సాయిలౌకిక్, సుస్మితల నుంచి ల్యాప్‌టాప్, ప్రశ్నపత్రం స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి రాబట్టిన సమాచారం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఖమ్మం ప్రాంతానికి చెందిన పాతకార్ల వ్యాపారి సాయిలౌకిక్ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్(డీఏవో) ప్రశ్నపత్రం కొనుగోలు చేసేందుకు ప్రధాన నిందితుడు ప్రవీణ్‌తో రూ.10 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు.
దానికోసం సాయిలౌకిక్ కారును అమ్మేశాడు. ఇలా అమ్మేయగా వచ్చిన 6లక్షల సొమ్మును నిందితుడు ప్రవీణ్ బ్యాంకు ఖాతాలో వేశారు. మిగిలిన మరో 4 లక్షల రూపాయలను పరీక్ష రాశాక ఇస్తానంటూ సాయి లౌకిక్ ఫిబ్రవరి 23న డీఏఓ ప్రశ్నపత్రం తీసుకున్నాడు. అదే నెల 26న డీఏఓ పరీక్ష రాశారు. ఆ తర్వాత మార్చి 11న టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ విషయం బయటపడడం తెలిసిందే.
విచారణకు సహకరించడంతో..
ఈ లీకుల బాగోతంలో కొసమెరుపు ఏంటంటే.. సాయిలౌకిక్, సుస్మిత దంపతులు పోలీసుల విచారణకు సహకరించడమే. దీంతో కేసు దాదాపు ఒక కొలిక్కి వచ్చిందని ఆఫ్ ది రికార్డుగా పోలీసులు చెబుతున్నారు. లీకేజీ దర్యాప్తులో భాగంగా ప్రధాన నిందితుడు అయిన ప్రవీణ్ బ్యాంకు ఖాతాలను పరిశోధించినప్పుడు సాయిలౌకిక్ ద్వారా రూ.6 లక్షలు వచ్చినట్లు వెల్లడవడంతో డీఏఓ ప్రశ్నపత్రం కూడా విక్రయించినట్టు సిట్ పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇదే విషయంపై కస్టడీ సమయంలో ఆ దంపతులు తామే ప్రశ్నపత్రం కొనుగోలు చేసినట్టు అంగీకరించారు. మొత్తానికి లీకుల వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందోనని పోలీసులు చెబుతున్నారు.
This post was last modified on April 17, 2023 2:20 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…