కాస్మొపాలిటన్ నగరాలు లేని రాష్ట్రం దేశంలో కొత్త కేసుల్లో వరుసగా రెండోరోజు నెం.1 స్థానంలో నిలిచింది. అది కూడా అత్యధిక టెస్టులు చేస్తూ వస్తున్నా వ్యాప్తి కంట్రోల్ కాకపోగా పెరుగుతూనే ఉంటూ సరికొత్త రికార్డులు నమోదు చేస్తూనే ఉంది.
తాజాగా ఏపీ సర్కారు కోవిడ్ కమాండ్ కంట్రోల్ రూం విడుదల చేసిన లెక్కల ప్రకారం…రాష్ట్రంలో కొత్తగా గడిచిన 24 గంటల్లో 10093 కేసులు నమోదయ్యాయి. నిన్నటి నివేదిక ప్రకారం… సుమారు 8వేల కేసులతో దేశంలో కేసులలో ఒక్కరోజు సంఖ్యలో నెం.1గా నిలిచిన ఏపీ వరుసగా రెండో రోజు పదివేల కేసులతో నెం.1 గా నిలిచింది.
ఇదిలా ఉండగా… కేసులే కాదు పరీక్షలు కూడా అధికంగానే జరిగాయి. తాజాగా ఏపీలో 70,584 శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇందులో 37,199 ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు కాగా మిగతావి ఆర్టీపీసీఆర్ టెస్టులు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 18,20,009 కరోనా పరీక్షలు చేసినట్లు ఏపీ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 1,17,495 పాజిటివ్ కేసు లకు గాను ఇప్పటివరకు 52,529 మంది డిశ్చార్జ్ కాగా, 1,213 మంది మరణించారు. ప్రస్తుతం 63,753 చికిత్స పొందుతున్నారు. కేసులు భారీగా నమోదు కాగా… ఈరోజు డిశ్చార్జి అయిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. కేవలం 2,784 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈరోజు నమోదైన మరణాలు 65.
అత్యధికంగా తూర్పు గోదావరిలో 1676, అనంతపురంలో 1371, కర్నూలులో 1091 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో అధికంగా కేసులు నమోదవుతున్న జిల్లాలివే.
This post was last modified on July 29, 2020 6:28 pm
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…