కరోనా చుట్టూ ఎప్పుడై నెగెటివ్ న్యూసే చూస్తున్నాం. కానీ ఈ మహమ్మారి వల్ల కొన్ని మంచి విషయాలు కూడా జరుగుతున్నాయి. కాలుష్యం తగ్గడం.. మనుషుల మధ్య దూరం తగ్గి, బంధాలు బలపడటం లాంటి సానుకూల పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఈ కోవలోనే ఇప్పుడు కోవిడ్ కారణంగా ఇద్దరి మనసులు కలిసి.. పెళ్లి బంధంతో ఒక్కటి కావడం విశేషం. ఇది జరిగింది మన తెలుగు గడ్డ మీదే కావడం విశేషం. దీనికి సంబంధిని వార్తా కథనాలు ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఈ కరోనా ప్రేమకథ విశేషాలేంటో చూద్దాం పదండి.
ఆ అబ్బాయిది ప్రకాశం జిల్లా పర్చూరు.. అమ్మాయిది గుంటూరు జిల్లా చిలకలూరి పేట. అబ్బాయి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజనీర్. అమ్మాయి కూడా ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉంది. వీళ్లిద్దరూ ఈ మధ్యే కరోనా బారిన పడ్డారు. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం పడింది.
ఇద్దరూ గుంటూరు జిల్లాలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు. పక్క పక్క బెడ్లలో ఉండటంతో ఇద్దరి మధ్య మాటలు కలిశాయి. కరోనా తీవ్రత అంతగా లేకపోవడంతో ఆసుపత్రిలో సరదాగానే గడిపారు. ముచ్చట్లలో మునిగిపోయారు. ఈ క్రమంలోనే ఒకరి గురించి ఒకరికి బాగా తెలిసింది. అభిరుచులు కలిశాయి.
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే ముందు ఫోన్ నంబర్లతో పాటు మనసులు ఇచ్చి పుచ్చేసుకున్నారు. ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గం కూడా కావడంతో ఇరు వైపులా పెద్దలకూ పెళ్లి చేసేందుకు అభ్యంతరం లేకపోయింది.
ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం లేకపోవడంతో ఆలస్యం చేయకుండా.. హడావుడి లేకుండా ఇటీవలే పొన్నూరులోని ఓ దేవాలయంలో పెద్దల సమక్షంలో వారి పెళ్లి చేసేశారు. పరిచయం నుంచి పెళ్లి వరకు మొత్తం వ్యవహారం కేవలం నెల రోజుల లోపే అయిపోవడం విశేషం. కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
This post was last modified on July 29, 2020 10:46 am
పుష్ప 2 ది రూల్ మరో అరుదైన రికార్డుని సొంతం చేసుకుంది. కేవలం రెండు వారాలకే 1500 కోట్ల గ్రాస్…
2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఆతిథ్యంపై నెలకొన్న అనుమానాలు ఎట్టకేలకు నివృత్తి అయ్యాయి. ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లోనే…
మెగా పవర్ స్టార్ అభిమానులకు దిల్ రాజు శుభవార్త చెప్పేశారు. గేమ్ ఛేంజర్ కు పక్కా ప్లానింగ్ తో ప్రీమియర్స్…
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వ్యక్తిగత జీవితం గురించి విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో, ఈ రూమర్స్‌పై మరోసారి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే అతి తక్కువ స్థాయికి చేరింది. తొలిసారి రూపాయి విలువ రూ. 85.0650కి పడిపోవడం…