Trends

ఇది ఒక ‘గుడ్డు‘ స్టోరీ !

అనూహ్యంగా చోటు చేసుకునే కొన్ని ఘటనలు ఎలాంటి పరిణామాలకు తెర తీస్తాయనటానికి నిదర్శనంగా తాజా ఉదంతాన్ని చెప్పొచ్చు. ఇండోర్ కు చెందిన ఆ బాలకార్మికుడి ఏడుపు అతన్ని సెలబ్రిటీగా మార్చటమే కాదు.. అతని జీవితాన్ని మారిపోయేలా చేసింది. ఇంతకీ ఏం జరిగిందన్న విషయంలోకి వెళితే..
ఆ పిల్లాడి పేరు పరాస్. వయసు పదమూడేళ్లు.

పేదరికంతో తల్లడిల్లే అతడి కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు తనకు తోచిన వ్యాపారాన్ని చేస్తుంటాడు. ఇందులో భాగంగా తోపుడు బండి మీద కోడిగుడ్లు అమ్ముతంటాడు. అలా ఆ పిల్లాడి జీవితం సాగుతున్న వేళ.. తాజాగా అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సుమారు రూ.7వేలు విలువైన కోడిగుడ్లు ఉన్న ట్రేను తోపుడు బండి మీద పెట్టుకొని రోడ్డు మీద వెళుతూ.. రోడ్డు పక్కన తన బండిని నిలిపి పక్కకు వెళ్లాడు.

అంతలో అక్కడకు వచ్చిన మున్సిపల్ కార్మికులు ఆ బాలుడ్ని పిలిచి ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.100 ఫైన్ వేశారు. అంతలోనే.. కోపంతో ఆ బండిని గిరాటేశారు. దీంతో బండి తలకిందులై.. కోడిగుడ్లు మొత్తం కిందపడి పగిలిపోయాయి. కళ్ల ముందు చోటు చేసుకున్న ఈ పరిణామంతో షాక్ కు గురైన ఆ పిల్లాడు.. పెద్ద ఎత్తున రోదించసాగాడు. అతడి ఏడుపు రోడ్డు మీద వెళ్లే వారిని ఆపేలా చేయటమే కాదు.. ఈ మొత్తం ఉదంతాన్ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

ఇది కాస్తా వైరల్ గా మారింది. మున్సిపల్ సిబ్బంది దాష్ఠీకాన్ని పలువురు తప్పు పట్టారు. భారీగా నష్టపోయిన ఆ పిల్లాడి పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నగా మారింది. ఆ పిల్లాడి మీద పెద్ద ఎత్తున సానుభూతి వ్యక్తమైంది. పలువురు ఆ పిల్లాడికి భారీగా సాయం చేస్తామని ముందుకు వచ్చారు. అలాంటివారిలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆ పిల్లాడికి రూ.10వేలు పంపారు. అంతేకాదు..ఆ పిల్లాడి చదువుకు అయ్యే మొత్తాన్ని తాను భరిస్తానని చెప్పారు.

దీనిపై ఇండోర్ 2 బీజేపీ ఎమ్మెల్యే స్పందించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఆ బాలుడికి ఒక ఇంటిని ఇప్పిస్తానని వరాన్నిఇచ్చేశారు. అతడి చదువుకు అయ్యే ఖర్చును భరిస్తానని చెప్పటమే కాదు.. రూ.2500 మొత్తాన్ని.. బట్టల్ని.. ఒక సైకిల్ ను పంపారు. ఒకరి తర్వాత ఒకరు స్పందించటంతో.. ఒక విధమైన రాజకీయం మొదలైంది.

ఒకరిమీద ఒకరు పోటీతో సాయాన్ని ప్రకటించటం.. ఇంటికి వచ్చి పరామర్శించటంతో ఆ పిల్లాడు ఇప్పుడు చిన్నసైజు సెలబ్రిటీలా మారాడు. ఇంతకాలం బాలకార్మికుడిగా బతుకు బండి లాగిన ఆ కుర్రాడు ఇప్పుడు ఏకంగా స్కూలుకు వెళ్లే అవకాశం లభించింది. మొత్తానికి దీనంగా ఏడ్చిన ఏడుపు ఆ పిల్లాడి ఫ్యూచర్ మారేలా చేసిందని చెప్పక తప్పదు.

This post was last modified on July 27, 2020 3:15 pm

Share
Show comments
Published by
Satya
Tags: BoyTrends

Recent Posts

నాని సినిమా.. సెన్సేషనల్ బ్యాక్‌డ్రాప్

నేచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం మాంచి ఊపుమీదున్నాడు. ద‌స‌రా, హాయ్ నాన్న‌, స‌రిపోదా శ‌నివారం చిత్రాల‌తో హ్యాట్రిక్ హిట్లు కొట్టిన…

24 mins ago

లడ్డు గొడవ.. వైసీపీని ఎందుకు నమ్మట్లేదు?

గ‌త ఐదేళ్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండ‌గా తిరుమ‌ల ల‌డ్డు నాణ్య‌త ప‌డిపోయింద‌ని.. ల‌డ్డు త‌యారీలో వాడిన నెయ్య‌లో…

28 mins ago

వంద రోజుల ఉత్సాహం.. త‌మ్ముళ్ల‌ ‘దాహం తీరన‌ట్టే’ !

కూట‌మి స‌ర్కారుకు వంద రోజులు పూర్త‌య్యాయి. సంతృప్తి విష‌యంలో కూట‌మి పార్టీల నాయకులు త‌ల కోమాట మాట్లాడుతున్నారు. ఇదేంటి? అంటున్నారా?…

3 hours ago

జాన్వీ భవిష్యత్తుపై తారక్ నమ్మకం

దేవరతో టాలీవుడ్ కు పరిచయం కాబోతున్న జాన్వీ కపూర్ డెబ్యూలో ఎలాంటి పెర్ఫార్మన్స్ ఇస్తుందోననే ఆసక్తి ప్రేక్షకుల్లోనే కాదు ఇండస్ట్రీ…

10 hours ago

100 రోజుల పాల‌న.. బీజేపీ గ్రాఫ్ ఏంటి

ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీజేపీ త‌ర‌పున 8 మంది ఎమ్మెల్యేలు విజ‌యం ద‌క్కించుకున్నారు. వీరిలో కొంద‌రు ఫైర్‌బ్రాండ్లు కూడా…

11 hours ago

హీరో కమ్ డైరెక్టర్.. ఇడ్లి కొట్టు

తమిళ హీరో ధనుష్ కేవలం ప్రతిభావంతుడైన నటుడు మాత్రమే.. తనలో మంచి అభిరుచి ఉన్న దర్శకుడు, కథా రచయిత, లిరిసిస్ట్,…

13 hours ago