వర్సిటీ కాల్పుల్ని మరవక ముందే మాల్ లో.. అమెరికా గన్ కల్చర్ కు మరొకరు బలి
గన్ కల్చర్ దెబ్బకు అగ్రరాజ్యం అమెరికాలో వరుస విషాదాంతాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీలోని ప్రధాన క్యాంపస్ లోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తి విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు గాయపడ్డారు. ఈ ఉదంతం షాకింగ్ గా మారింది. అమెరికాలోని అతి పెద్ద వర్సిటీల్లో ఒకటైన మిచిగాన్ వర్సిటీలో చోటు చేసుకున్న కాల్పులు సంచలనంగా మారాయి.
దీనికి సంబంధించిన భయాందోళనలు ఇంకా ఒక కొలిక్కి రాక ముందే.. తాజాగా టెక్సాస్ లోని ఒక షాపింగ్ మాల్ లోకి ప్రవేశించిన దుండగులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఇందులో ఒకరు మరణించగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. స్థానిక మీడియా కథనాల ఆధారంగా చూస్తే.. టెక్సాస్ లోని ఎప్ పాసో ప్రాంతంలోని ఒక షాపింగ్ మాల్ లోకి ప్రవేశించిన ఒక ఆగంతుకుడు వెనుకా ముందు చూసుకోకుండా కాల్పులు జరిపారు. అమెరికా కాలమాన ప్రకారం బుధవారం సాయంత్రం ఈ ఉదంతం చోటు చేసుకుంది.
కాల్పుల సమాచారాన్ని అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఘటనా స్థలానికి చేరుకొని సహాయక కార్యక్రమాల్ని చేపట్టారు. షాపింగ్ మాల్ లో గన్ పేలిన శబ్ధం విన్నంతనే ఎక్కడి వారు అక్కడి నుంచి బయటకు పరుగులు తీసినట్లుగా తెలుస్తోంది. అయితే.. ఈ కాల్పులకు సంబంధించిన కారణం ఏమిటన్నది బయటకు రాలేదు. కాల్పుల ఘటన చోటు చేసుకున్న తర్వాత కొద్ది గంటల వ్యవధిలోనే ఒక అనుమానితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా చెబుతున్నారు. పోలీసులు మాత్రం అరెస్టుకు సంబంధించిన వివరాల్ని వెల్లడించలేదు. ఇటీవల కాలంలో కాల్పుల ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి.
This post was last modified on February 16, 2023 10:56 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…