భ‌ర్త‌ను చంపి.. అనాథ‌ని న‌మ్మించి అంత్యక్రియ‌లు.. !!

కేవ‌లం సెక్స్ సుఖం కోసం.. భ‌ర్త‌ను వదులుకుంటున్న భార్య‌లు పెరిగిపోతున్నారు. మ‌రికొంద‌రు.. భ‌ర్త‌లను అడ్డు త‌ప్పించుకునేందుకు కూడా ఏమాత్రం వెర‌వ‌డం లేదు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలోనూ ఇలాంటి ఘ‌ట‌నే చోటు చేసుకుంది. త‌న ప్రియుడితో సెక్స్ సుఖం కోసం.. ఏకంగా భ‌ర్త‌కు అన్నంలో విషం క‌లిపి.. హ‌త్య చేసింది ఓ భార్య‌. ప్రియుడితో కలిసి భర్తను చంప‌డ‌మే కాకుండా ఆయ‌న అదృశ్యమయ్యాడంటూ అందరినీ నమ్మించబోయింది.

విష‌యం ఏంటంటే..
విశాఖ‌ప‌ట్నంలోని ఎంవీపీ కాలనీకి స‌మీపంలో ఉన్న‌ వాసవానిపాలేనికి చెందిన జ్యోతి(25)కి, భీమిలి ప్రాంతానికి చెందిన పైడిరాజు (28)తో ఆరేళ్ల కిందట పెళ్లయింది. పైడిరాజు టైల్స్‌ పనులు చేస్తుంటాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే.. జ్యోతికి.. పొరుగింట్లో ఉండే నూకరాజుతో ప్రేమ ప్రారంభ‌మైంది. ఇది కాస్తా సెక్స్‌కు దారితీసింది.

అంతే ఇంకేముంది.. జ్యోతి తెలివిగా.. వ్య‌వ‌హ‌రించింది. పైడిరాజుది ఉమ్మడి కుటుంబం కావడంతో ఇక్కడ కలుసుకోవడం కుదరదని వారిద్దరూ వేరే ప్రాంతంలో రూం రెంట్‌కు తీసుకుని.. అక్క‌డ క‌లుసుకోవ‌డం ప్రారంభించారు. మ‌రి ఇంట్లో భ‌ర్త‌కు ఏం చెప్పిందంటే.. త‌న‌కు సీబీఐ ఆఫీస్‌లో హౌస్‌ కీపింగ్‌ పని దొరికింద‌ని.. ఉద‌యం 9 కి వెళ్లి సాయంత్రం 6 గంట‌ల‌కు వ‌స్తాన‌ని చెప్పింది.

ఇలా.. ఆరు నెలల పాటు ప్రతిరోజూ నూక‌రాజు, జ్యోతిలు ఆ రూంకు వెళ్లి ఎంజాయ్ చేశారు. అయితే.. ప్రియుడిపై మోజు పెర‌గ‌డంతో భర్తను ఎలాగైనా వదిలించుకోవాలని జ్యోతి పథకం వేసింది. ఓ ఫైన్ డే.. అన్నంలో నిద్ర మాత్రలు కలిపి.. భ‌ర్త పైడిరాజుకు పెట్టింది. రాత్రి ఒంటిగంట సమయంలో ప్రియుడు నూకరాజుకు ఫోన్‌ చేసింది. అత‌ను వ‌చ్చాక ఇద్దరూ కలిసి నిద్రలో ఉన్న పైడిరాజు మెడకు తీగ బిగించి హతమార్చారు.

స్టోరీ యూట‌ర్న్‌

చ‌చ్చిపోయిన భ‌ర్త పైడిరాజు మృత దేహ‌న్ని బైక్‌పై పెట్టుకుని జ్యోతి, ప్రియుడు నూక‌రాజులు.. వారు ఉంటున్న రూంకు తీసుకువ‌చ్చారు. ఈ క్ర‌మంలో ఎవ‌రికీ అనుమానం రాకుండా.. అంబులెన్స్‌న‌ను పిలిచారు. సిబ్బంది వచ్చి చూసి పైడిరాజు చనిపోయాడని చెప్పడంతో ఆయ‌న‌కు ఎవ‌రూ లేరని చెప్పి.. అదే వాహనంలో మృతదేహాన్ని స్థానిక శ్మశానవాటికకు తరలించి తెల‌తెల‌వారుతుండ‌గానే గుట్టుగా దహనం చేసి, బూడిదను సముద్రంలో కలిపేశారు.

తెల్ల‌వారిన‌ త‌ర్వాత జ్యోతి తన భర్త కనిపించడంలేదంటూ భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్‌ కాల్స్‌ ఆధారంగా విచారించి ప్రియుడిని, ప్రియురాలిని అరెస్టు చేశారు.