Trends

సైనికుడి శ‌రీరంలో లైవ్ బాంబ్‌.. త‌ర్వాత ఏం జ‌రిగిందంటే

ర‌ష్యా-ఉక్రెయిన్ దేశాల మ‌ధ్య యుద్ధం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ యుద్ధంలో ర‌ష్యాను బ‌లంగా నిలువ‌రిస్తున్న ఉక్రెయిన్ సైనికులు ప్రాణ‌త్యాగాల‌కు కూడా వెరువ‌కుండా పోరాటం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఒక ఉక్రెయిన్ సైనికుడు చాలా ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితిని ఎదుర్కొన్నాడు. ర‌ష్యావిసిరిన బాంబు.. ఆయ‌న శ‌రీరంలో ఎలా చేరిందో తెలియ‌దు కానీ.. గ్రెనేడ్ లాంచ‌ర్ నుంచి విసిరిన బాంబు పేల‌కుండా.. గురి త‌ప్పి.. ఉక్రెయిన్ సైనికుడి ప‌క్క‌టెముకల్లోకి చేరింది.

అయితే.. అది పేలుడు ప‌దార్థం కావ‌డంతో ఏ క్ష‌ణంలో అయినా.. పేలే అవ‌కాశం ఉంద‌ని గుర్తించిన ఉక్రెయిన్ సైన్యం స‌ద‌రు సైనికుడిని హుటాహుటిన ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ వైద్యులు అత్యంత జాగ్ర‌త్త‌గా ఆప‌రేష‌న్ చేసి.. లైవ్ బాంబును ప‌క్క టెముల నుంచి తొల‌గించి సైనికుడి ప్రాణాల‌ను ర‌క్షించారు.

ర‌ష్యా దాడిలో రైఫిల్‌కు అనుసంధానించబడిన గ్రెనేడ్ లాంచర్ నుంచి గురిత‌ప్పిన‌ పేలని గ్రెనేడ్ ఉక్రేనియన్ సైనికుడి మొండెంలో చేరిపోయింంది. ఆ వ్యక్తి శరీరం నుంచి లైవ్ బాంబును సర్జన్ తొలగించారు. పేలుడు పదార్థం ఏ సమయంలోనైనా పేలిపోయే ప్రమాదం ఉంది. అయితే, డాక్టర్లు చేసిన ఆపరేషన్ తర్వాత ఉక్రెయిన్ సైనికుడు అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు అని ఉక్రెయిన్ అధికారులు ప్ర‌క‌టించారు.

బ‌ఖ్‌ముట్ ప్రాంతంలో జ‌రుగుతున్న దాడుల్లో ఈ బాంబు సైనికుడి శ‌రీరంలో చేరింద‌ని వివ‌రించారు. ఆప‌రేష‌న్ చేసే స‌మ‌యంలో మ‌రో ఇద్ద‌రు సైనికులు అక్క‌డే ఉండి.. బాంబు పేలకుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ట్టు ఉక్రెయిన్ తెలిపింది . అదేస‌మ‌యంలో బాంబు ఎక్స్‌ప్లోజివ్ టీం కూడా ఆసుప‌త్రి వ‌ద్దే ఉన్న‌ట్టు తెలిపింది.
 
ఉక్రేనియన్ సర్జన్ మేజర్ జనరల్ ఆండ్రీ వెర్బా ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఆప‌రేష‌న్‌లో ప‌లువురు వైద్యులు పాలు పంచుకున్నారు. అయితే.. వీరు కూడా ప్రాణాల‌కు తెగించే ఈ ఆప‌రేష‌న్ చేసిన‌ట్టు సైన్యం పేర్కొంది. “మా సైనిక వైద్యులు సైనికుడి శరీరం నుండి పేలని VOG గ్రెనేడ్‌ను తొలగించడానికి ఆపరేషన్ చేసారు” అని ప్రాంతీయ గవర్నర్ సెర్హీ బోర్జోవ్ ధృవీకరించారు.

పేలుడు ముప్పు ఉండడంతో మరో ఇద్దరు సైనికులతో కలిసి సర్జరీ చేశారని తెలిపారు. రక్తస్రావం నియంత్రించడానికి, అసాధారణ కణజాలాన్ని నాశనం చేయడానికి వేడిని ఉపయోగించే శస్త్రచికిత్స – నిర్వహించలేద‌ని, గ్రెనేడ్‌ను ఇది ప్రేరేపించవచ్చున‌ని పేర్కొన్నారు. అయితే, మ‌రో మార్గంలో ఆప‌రేష‌న్ చేసిన‌ డాక్టర్ వెర్బా విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించి గ్రెనేడ్‌ను తొలగించగలిగారని బోర్జోవ్ తెలిపారు.

This post was last modified on January 11, 2023 2:39 pm

Share

Recent Posts

‘ఆదర్శ కుటుంబం’లో తుపాకుల కలకలం

టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…

15 minutes ago

గ్రీన్‌కార్డ్ ఎఫెక్ట్ వల్ల భారత్‌కు లాభమా?

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…

1 hour ago

‘డీసీ’కి ప్రాణం పోసిన ఆమెకు లేదా గిఫ్ట్?

పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…

2 hours ago

విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…

2 hours ago

చూసుకుందాం అంటున్న స్పిరిట్ నిర్మాత‌

సందీప్ రెడ్డి వంగ‌నే కాదు.. ఆయ‌న సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాద‌ని.. ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవెల్…

3 hours ago

ఎన్నికల ఫలితాలపై AI ప్రభావం

AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…

3 hours ago