Trends

40 నిమిషాలు.. 2 ల‌క్ష‌ల టికెట్లు.. 6 కోట్ల క‌లెక్ష‌న్‌!!

కేవ‌లం 40 అంటే.. 40 నిమిషాలు.. ఇంత త‌క్కువ స‌మ‌యంలో ఎంత ఎక్కువ‌గా టికెట్లు అమ్మాల‌న్నా.. ల‌క్షల్లో అయితే సాధ్యం కాదు. మెగాస్టార్ నుంచి రాజ‌మౌళి వ‌ర‌కు.. ఎవ‌రి సినిమా అయినా.. ఇంకా చెప్పాలంటే.. ప్ర‌పంచాన్ని దుమ్ము దులిపేస్తున్న ఆర్ ఆర్ ఆర్ వంటి మూవీలైనా.. ల‌క్ష‌ల్లో ఇంత త‌క్కువ స‌మ‌యంలో టికెట్లు అమ్మిన ప‌రిస్థితి లేదు. కానీ, తాజాగా రికార్డు కొట్టేసింది.. టీటీడీ!

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి భక్తుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. వైకుంఠ ద్వార దర్శనానికి 10 రోజులకు సంబంధించి 2 లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను శనివారం టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. అయితే.. ఇవి ఇలా విడుద‌ల‌య్యాయోలేదో.. వెంట‌నే కేవ‌లం 40 నిమిషాలలోనే టిక్కెట్ల విక్రయాలు పూర్తి అయ్యాయి.

మొత్తంగా ఈ టికెట్ల విక్ర‌యం ద్వారా టీటీడీ 6 కోట్ల రూపాయ‌ల‌ను 40 నిమిషాల్లో సొంత చేసుకుంది. ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. టిక్కెట్లు అయిపోయాయ్యన్న విషయం తెలియక ఇంకా వెబ్‌సైట్‌లో టిక్కెట్ల కోసం భక్తులు వెతుకుతున్న పరిస్థితి క‌నిపించింది. దీంతో టీటీడీ ఆన్ లైన్‌లోనే ప్ర‌క‌ట‌న చేసింది.

మరోవైపు సర్వ దర్శనం భక్తులకు జనవరి 1న ఆఫ్‌లైన్ విధానంలో తిరుపతిలో టీటీడీ టోకెన్లను కేటాయించనుంది. తిరుపతిలోని 9 కేంద్రాలు ద్వారా రోజుకు 50 వేల చొప్పున 5 లక్షల టిక్కెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఇదీ.. సంగతి! అఖిలాండ‌కోటి బ్ర‌హ్మాండ నాయ‌కుడి ద‌ర్శ‌న భాగ్యం అంత డిమాండ్ గా మారిపోయింద‌న్న మాట‌.

This post was last modified on December 24, 2022 5:19 pm

Share

Recent Posts

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

2 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

4 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

4 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

5 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

13 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

15 hours ago