సగటు రైతు ఓ వెయ్యి రూపాయిలు బకాయి పడితే… ఇంటికి ఏజెంటును పంపి మరీ.. పీడించే బ్యాంకులు.. సాధారణ వినియోగదారుడు.. తన అకౌంట్‌లో కనీస మొత్తం ఉంచకపోతే.. జరిమానాలు విధించి మరీ వసూలు చేసే బ్యాంకులు.. బడా నేరగాళ్లకు వేల కోట్ల రూపాయలను మాఫీ చేయడం.. విశేషం. అంతేకాదు.. ఒక్కొక్క బ్యాంకు.. వేల కోట్లను మాఫీ చేయడమే కాదు.. ఐదేళ్ల తర్వాత.. వారికి మళ్లీ అప్పులు ఇచ్చే పాలసీ కూడా ఒకటి ఉందట! చిత్రంగా ఉన్నప్పటికీ.. ఇదినిజం.
ఈ ఏడాది మార్చి నాటికి దేశంలో కేవలం 50 మంది బ్యాంకులకు బకాయిపడ్డ సొమ్ము రూ.92,570 కోట్లుగా ఉందని కేంద్రం పార్లమెంటుకు తెలిపింది. వీరిలో వజ్రాల వ్యాపారి మెహుల్ చౌక్సీ రూ.7.848 కోట్లతో అతి పెద్ద ఎగవేతదారుగా ఉన్నాడు. ఎరా ఇన్ఫ్రా ఇంజనీరింగ్ రూ.5,879 కోట్లు, రీ ఆగ్రో రూ.4,803 కోట్లు, కంకాస్ట్ స్టీల్ అండ్ పవర్ రూ.4,596 కోట్లు, ఏబీజీ షిప్ యార్డ్ రూ.3,708 కోట్లు, ప్రాస్ట్ ఇంటర్నేషనల్ రూ.3,311 కోట్లు, విన్ సమ్ డైమండ్స్ అండ్ జ్యుయలరీ రూ.2.931 కోట్లు, రొటోమాక్ గ్లోబల్ రూ.2,893 కోట్లు. కోస్టల్ ప్రాజెక్ట్స్ రూ.2.311 కోట్లు, జూమ్ డెవలపర్స్ రూ.2.147 కోట్లు ఉన్నారని కేంద్రం తెలిపింది.
వీరంతా ఈ రుణాలను చెల్లించే స్థితిలో ఉన్నప్పటికీ.. ఉద్దేశ పూర్వకంగా ఎగ్గొడుతున్నారని కేంద్రం చెప్పడం విశేషం. ఈ ఎగవేతదారులపై ఆర్బీఐ ఐదేళ్ల పాటు నిషేధం విధించిందని, ఆ కాలానికి వీరు కొత్తరుణాలు తీసుకోలేరు. ఐదేళ్ల తర్వాత మాత్రం కొత్త రుణాలకు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంది.
2021-22లో ఏయే బ్యాంకు ఎంత మాఫీ చేశాయంటే
ఎస్బీఐ రూ.19,666 కోట్లు, యూనియన్ బ్యాంకు రూ.19,484 కోట్లు, పంజాబ్ నేషనల్ రూ.18,312 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.17,967 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా 10,443 కోట్లు, యాక్సిస్ బ్యాంక్ రూ. 9,128 కోట్లు, ఇండియన్ బ్యాంక్ రూ.8,347 కోట్లు, కెనరా బ్యాంక్ రూ.8,210 కోట్లు.. ఇది మన బ్యాంకుల సంగతి!!
This post was last modified on December 21, 2022 6:25 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…