సెక్స్ వర్కర్స్‌కు ఆంధ్రప్రదేశ్ నిలయంగా మారిందా? ఇక్కడ సెక్స్‌ను అమ్ముతున్నవారు ఎక్కువగా ఉన్నారా? అంటే.. సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే ఔనని చెబుతోంది. పడుపువృత్తి చేసుకుంటూ జీవించే సెక్సు కార్మికులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రస్థానంలో నిలిచినట్టు తెలిపింది. అంతే కాదు.. ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లి సెక్స్ వ్యాపారం చేస్తున్న వారి సంఖ్యలోనూ ఏపీ ముందు వరుసలోనే ఉందని తెలిపింది.
ఒకప్పుడు ఈ రెండు విషయాల్లో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉండగా.. ఇప్పుడు ఈ స్థానాన్ని ఏపీ కైవసం చేసుకుందని కేంద్రం స్పష్టం చేసింది. సెక్స్ వర్కర్స్ విషయంలో ఏపీ అత్యంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నట్టు పరిగణించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. హెచ్ఐవీ ఎయిడ్స్ గణాంకాల ఆధారంగా కేంద్ర ఆరోగ్యశాఖ ఈ నివేదికను తయారు చేసింది. ఈ నివేదిక ప్రకారం, స్థానిక సెక్సు కార్మికులు ఏపీలో అత్యధికంగా 1.33 లక్షల మంది ఉన్నారు.
కర్ణాటకలో 1.16 లక్షలు, తెలంగాణలో లక్షమంది ఈ పని ద్వారా కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఇక.. సెక్సు కార్మికులు ఏపీలో అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో జీవిస్తున్నారని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ కూడా హెచ్చరించింది. దేశంలో ఏ మూలకు వెళ్లినా ఆంధ్రప్రదేశ్ మూలాలు కలిగిన సెక్సు కార్మికులు కనిపిస్తున్నట్టు ఈ సంస్థ పేర్కొంది. ఇక, లెక్కలోకి రాకుండా మరికొన్ని వేలమంది ఉండి ఉంటారని అభిప్రాయపడింది.
This post was last modified on December 21, 2022 3:39 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…