Trends

అత్తారింటికి దారేది సీన్ రిపీట్ చేసిన షాలిని

అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అత్తాంటికి దారేది మూవీ గుర్తుందా? షాపింగ్ కు వెళ్లిన తన అత్త కూతురిని ఎవరో కిడ్నాప్ చేసినట్లుగా భావించిన హీరో.. భారీ రిస్క్ చేసి ఆమెను కాపాడటం.. తర్వాతి సీన్ లో ఆమె సూసైడ్ కు ప్రయత్నం చేస్తుంటే కాపాడే సీన్ గుర్తుందా? ఆ సందర్భంగా కిడ్నాప్ చేసినోడు తన లవ్వర్ అని.. తన తల్లిదండ్రులు ఒప్పుకోరన్న ఉద్దేశంతో పారిపోతుంటే పట్టుకున్నట్లుగా చెప్పి.. ఎవరి చేయి ఎవరి చేతుల్లో ఉందన్న మాటతో.. హీరోకు ఛేజింగ్ సీన్ గుర్తుకు రావటం గుర్తుందా? దాదాపు ఇంచుమించు అలాంటి సీనే చోటు చేసుకుంది సిరిసిల్ల జిల్లాలో.

సిరిసిల్ల జిల్లాకు చెందిన షాలినీ.. జానీ ప్రేమించుకోవటం.. వారిద్దరి లవ్ ను ఇంట్లో వాళ్లు వద్దన్నారు. దీంతో.. ఏడాది క్రితం ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో షాలినీ మైనర్ కావటంతో ఆమె వివాహం చెల్లలేదు. దీనికి తోడు మైనార్టీ చెల్లకుండా పెళ్లి చేసుకున్నందుకు పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి జానీని జైలుకు పంపారు.దీంతో మైనార్టీ తీరిన తర్వాత పెళ్లి చేసుకుంటామని షాలినీతో చెప్పాడు.

షాలిని గుడికి వెళుతుందన్న విషయం జానీకి ముందే తెలుసు. అయితే.. ముకానికి అడ్డుగా కర్చీఫ్ ఉండటంతో ఎవరో అనుకొని ఆమె భయపడి కేకలు వేయటం.. దీంతో చుట్టుపక్కల వారు ఆమె కిడ్నాప్ అయినట్లుగా భావించటం.. మంత్రి కేటీఆర్ సైతం స్పందించటంతో మీడియాలో ఈ ఉదంతం సంచలనంగా మారింది. ఈ మధ్యనే ఎంగేజ్ మెంట్ జరుగుతున్న వేళ.. కిడ్నాప్ ఉదంతం నేపథ్యంలో దీనికి ప్రాధాన్యత లభించింది. అయితే.. జరుగుతున్న విషయాల్ని గుర్తించిన షాలినీ వెంటనే మీడియా ముందుకు వచ్చి.. క్లారిటీ ఇచ్చేసింది. తనను తీసుకెళుతున్నది ప్రియుడే అన్న విషయం తెలిసిన వెంటనే.. అతనితో వెళ్లి పెళ్లి చేసుకోవటం తెలిసిందే.

తాను ఇష్టప్రకారమే పెళ్లి చేసుకున్నట్లు చెప్పిన షాలిని.. తన తల్లిదండ్రుల నుంచి ప్రాణభయం ఉందని.. రక్షణ కల్పించాలని కోరారు. పెళ్లి అనంతరం జిల్లా ఎస్పీని కలిసి రక్షణ కోరారు. ఇరు కుటుంబాలను పిలిచి కౌన్సెలింగ్ ఇవ్వనున్నట్లుగా హామీ ఇచ్చారు. కిడ్నాప్ ఎపిసోడ్ గురించి షాలిని మాటలు విన్నప్పుడు అత్తారింటికి దారేది సీన్ గుర్తుకు రావటం ఖాయం.

ఇదిలా ఉంటే.. తమ కుమార్తెను బలవంతంగా తీసుకెళ్లాడని.. ముందు తమ బిడ్డను తమ ముందుకు తీసుకురావాలని షాలిని తల్లిదండ్రులు చెబుతున్నారు. చంపుతానని బెదిరించి తమ కుమార్తెను పెళ్లి చేసుకుంటారని వాదిస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే.. అంతో ఇంతో భయం ముఖంలో కనిపించేది కదా? అన్న మాట వినిపిస్తోంది.

Share

Recent Posts

విలక్షణ నటుడి విశ్వరూపం.. నేరుగా థియేటర్లోనే

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…

1 hour ago

వైష్ణవి చైతన్య బాధ వర్ణనాతీతం

యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసుకునే అమ్మాయి వంద కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలో భాగం కావడం..…

2 hours ago

మండాడి ఊపులో దేవర ఊసులు

తెలుగులో సముద్రం నేపథ్యంతో వచ్చిన సినిమాలు తక్కువే. తీరప్రాంతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ పూర్తిగా ఈ బ్యాక్ డ్రాప్ లో…

3 hours ago

మహాశక్తి దర్శనం… ఏఐ దీవెనలు

ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…

5 hours ago

బీజేపీ ఎమ్మెల్యే అక్ర‌మాల‌పై నేరుగా మోడీకే ఫిర్యాదు చేసిన ఫ్రెండ్‌!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ బీజేపీ అగ్ర‌నేత‌. ఇక‌, ఆయ‌న సొంత రాష్ట్రం గుజ‌రాత్‌. తాజాగా మోడీ చిన్న‌నాటి స్నేహితుడు,…

6 hours ago

రామాయణ సంగీతానికి తెర లేచింది

విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…

6 hours ago