ఎవరైనా అమ్మ నాన్నలను చూసేందుకు విదేశాల నుండి రావాలంటే సాధారణంగా విమానంలో వస్తారు. అయితే ముంబైకి చెందిన మేధా రాయ్ మాత్రం ఏకంగా 24 వేల కిలోమీటర్లు బైక్ పైన ప్రయాణించి జర్మనీ నుండి ముంబైకు చేరుకుంది. దాదాపు 156 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆమె తన తల్లిదండ్రులను చేరుకుంది.
వివరాల్లోకి వెళితే జర్మనీకి చెందిన హాక్ విక్టర్ 2013లో ముంబై కు వచ్చాడు. అక్కడ మేధా తో అతనికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. లాక్ డౌన్ సమయంలో వారు జర్మనీలో గత ఏడాది వివాహం చేసుకున్నార. అయితే ఆంక్షల కారణంగా ఆ పెళ్ళికి మేధా కుటుంబ సభ్యులు హాజరు కాలేకపోయారు.
దీంతో పెళ్లి తర్వాత ఆమె తన తల్లిదండ్రులు కలుసుకోవాలని అనుకుంది. అందుకోసం ద్విచక్ర వాహనంపై ముంబైకి రావాలని నిర్ణయించుకుంది. బైక్ వెనుక కూర్చొని అంత దూరం ప్రయాణిస్తే వెన్ను నొప్పి సమస్యలు వస్తాయి కనుక ఆమె ఇందుకోసమే బైక్ డ్రైవింగ్ నేర్చుకొని తన భర్తతో కలిసి చెరొక బైక్ లో ముంబై కు వచ్చేసారు. ఏదో గిన్నిస్ రికార్డు కోసమో సాహస యాత్ర కోసమో కాకుండా కేవలం తన తల్లిదండ్రులు పై ఉన్న ప్రేమతో ఆమె ఇంతటి సాహసం చేయడం అనేది నిజంగా అభినందించదగ్గ విషయమే..!
This post was last modified on December 11, 2022 1:00 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…