మిగతా ప్రపంచమంతా తమకు వ్యతిరేకంగా మారినా ఉక్రెయిన్ మీద యుద్ధం ఆపట్లేదు రష్యా. కొన్ని నెలల నుంచి ఆ దేశం మీద ఉక్కుపాదం మోపుతూ తన అధీనంలోకి తెచ్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ప్రదాన నగరాలు ఒక్కోదాన్ని చేజిక్కించుకుంటూ ఉక్రెయిన్ మీద పట్టు సాధించేందుకు చేయాల్సిందంతా చేస్తోంది.
ఈ క్రమంలో రష్యా సైనికులు పాల్పడుతున్న అకృత్యాల గురించి అంతర్జాతీయ మీడియాలో కథలు కథలుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా రష్యా అకృత్యాల్లో మరో వికృత కోణం బయటికి వచ్చింది. ఉక్రెయిన్ మీద సాగిస్తున్న దండయాత్రలో భాగంగా రష్యా సైనికులు లైంగిక దాడులను ఆయుధంగా వాడుతున్నారని ఉక్రెయిన్ ప్రథమ మహిళ ఒలెనా జెలెన్‌స్కా ఆవేదన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ మహిళలను రేప్ చేయాలని రష్యా సైనికులను వారి భార్యలే ఉసిగొల్పుతున్నట్లు ఆమె వెల్లడించడం విస్మయం గొలుపుతోంది.
‘‘యుద్ధాల సమయంలో ప్రత్యర్థి దేశాల మహిళల లైంగిక దాడుల ద్వారా దెబ్బ కొట్టాలనుకోవడం ఒక మార్గం. యుద్ధాల సమయంలో ఇలాంటివి జరిగినా బాధితులు భయంతో ఈ విషయాలు బయట పెట్టలేరు. ఒకరిపై ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి లైంగిక దాడులు చేయడం అత్యంత క్రూరమైన మార్గం. రష్యా సైనికులు ఇప్పుడు అదే చేస్తున్నారు. మా దేశంపై వారు ప్రయోగిస్తున్న మరో ప్రమాదకర ఆయుధం లైంగిక దాడులే. దీన్ని ఒక పద్ధతి ప్రకారం, బహిరంగంగానే చేస్తున్నారు.
తాము ఉక్రెయిన్ మహిళల మీద లైంగిక దాడులకు పాల్పడుతున్న విషయాన్ని రష్యన్ సైనికులు తమ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెబుతున్నారు. మరో కఠిన వాస్తవం ఏంటంటే.. ఈ దాడులను వారి భార్యలు ప్రోత్సహిస్తుండడం. ఉక్రెయిన్ మహిళల మీద అత్యాచారాలు చేయాలని వారే సైనికులు చెబుతున్నారు’’ అంటూ లండన్ వేదికగా జరిగిన ఓ సదస్సులో ఒలెనా ఆవేదన వ్యక్తం చేసింది.
This post was last modified on November 30, 2022 10:44 pm
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…