Trends

విరాళాల సేకరణలో తానా సరికొత్త రికార్డు

తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) 23వ మహాసభల సన్నాహక కార్యక్రమ విందులో పెద్ద ఎత్తున తెలుగు ప్రజలు పాల్గొని చారిత్రాత్మిక స్థాయిలో విరాళాలు  ప్రకటించారు. తానా 45 సంవత్సరాల చరిత్రలో మహాసభల విరాళాల సేకరణలో సరికొత్త రికార్డు సృష్టించింది.

కోవిడ్ మహమ్మారి తీవ్రతతో 2021 లో నిర్వహించాల్సిన మహాసభలు వాయిదాపడి దాదాపు నాలుగేళ్ళ తర్వాత ఫిలడెల్ఫియా నగరంలో 2023 జులై 7 నుండి 9 వరకు జరగబోతున్న తానా మహాసభల సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా శనివారం నవంబర్ 5నాడు పెన్సిల్వేనియా రాష్ట్రంలోని వార్మిన్స్టర్ నగరంలోని ఫ్యూజ్ బ్యాంక్వెట్ హాల్ లో జరిగిన విరాళాల సేకరణ కార్యక్రమానికి అంచనాలకి మించిన స్పందన లభించింది.

తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, కన్వీనర్ పొట్లూరి రవి ఆధ్వర్యంలో నిర్వహించిన విరాళాల సేకరణ విందులో ఎనిమిది వందల మందికి పైగా ప్రవాసులు పాల్గొని గతంలో జరిగిన అన్ని విరాళాల సేకరణని మించిపోయేలా దాదాపు నలభై ఎనిమిది కోట్ల రూపాయల (ఆరు మిలియన్ల డాలర్లు) విరాళాలు ప్రకటించారు.

తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి హాజరైన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, EC, BOD మరియు ఫౌండేషన్ సభ్యులను మరియు మాజీ అధ్యక్షులను, ఇతర కమిటీ సభ్యులను పరిచయం చేసి సమాజానికి వారు చేసిన సేవలను కొనియాడారు. తానా సభ్యులు, వాలంటీర్లు, దాతలు సంఘం అభివృద్ధికి వారు చేసిన కృషిని,సమాజానికి చేసిన సేవలను అభినందించారు. 23వ తానా మహాసభల ప్రాముఖ్యతను చాలా వివరంగా వివరించారు. ప్రతి ఒక్క దాతను పరిచయం చేసి మరియు గుర్తించడానికి సమయాన్ని వెచ్చించి ఆనందోత్సాహాలు, కరతాళధ్వనులు మధ్య నిధుల సేకరణ కార్యక్రమం ఆసక్తికరంగా సాగింది.

ప్రతిష్టాత్మక తానా మహాసభలు దాదాపు నాలుగేళ్ళ తర్వాత నిర్వహిస్తుండటంతో పాటు అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు నేతృత్వంలోని తానా కార్యవర్గం గత పదహారు నెలలుగా చేసిన సేవలు, చేపట్టిన వినూత్నమైన కార్యక్రమాలు ప్రవాస భారతీయుల్లో 23వ తానా మహాసభల పట్ల ఆసక్తిని పెంచి విరాళాల సేకరణ కార్యక్రమానికి ఊహించని స్పందన లభించినట్లు మహాసభల కన్వీనర్ పొట్లూరి రవి తెలిపారు.

విరాళాల కార్యక్రమ నిర్వహణకు సహకరించిన పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్, డెక్కన్ స్పైస్ గోవర్ధన్ బోబ్బా, జగదీశ్ యలమంచిలి మరియు వాలంటీర్లకు కృతఙ్ఞతలు తెలియజేశారు.

ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

This post was last modified on November 8, 2022 7:56 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రోజాను నేనేమీ అనలేదు-హైపర్ ఆది

ఒకప్పుడు ‘జబర్దస్త్’ కామెడీ షోలో భాగమైన వాళ్లందరూ ఒక కుటుంబంలా ఉండేవారు. కానీ ఇప్పుడు జబర్దస్త్ నామమాత్రంగా నడుస్తోంది. ఆ…

1 hour ago

గెలుపు కోసం అసలైన అస్త్రంతో రాహుల్

ఈసారి మహారాష్ట్ర గడ్డపై కాంగ్రెస్ జెండా స్థిరంగా ఉండేలా చేయాలని కాంగ్రెస్ దిగ్గజం రాహుల్ గాంధి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.…

1 hour ago

చేతులు కాలాక కత్తెర పట్టుకున్న ‘కంగువ’

ఈ ఏడాది సౌత్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ‘కంగువ’ ఒకటి. కోలీవుడ్ బాహుబలిగా ఈ సినిమాను…

2 hours ago

దేవరకు ఇవ్వలేదు.. పుష్ప 2కి ఇస్తారా?

పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్న టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ పుష్ప 2: ది రూల్. అల్లు అర్జున్…

3 hours ago

హైదరాబాద్ రెండో మెట్రో.. ఇది అసలు సంగతి!

హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ నిర్మాణంపై చాలా కాలంగా అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే ఆలస్యం ఎందుకనేది…

4 hours ago