ప్రియుడితో పెళ్లికి ఒప్పుకోనందుకు తల్లిదండ్రుల నుంచి వెళ్లిపోయి పెళ్లిచేసుకున్న ఘటనలు తెలిసిందే. పోనీ.. ఇకొంచెం ఘాటైన ప్రేమ అయితే, ప్రియుడి కోసం కన్న తల్లిదండ్రులపైనే కేసులు పెట్టిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇక, భర్త ఉండగా ప్రియుడితో కలిసి సహజీవనం చేసిన ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి. అయితే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అసలు పెళ్లీలేదు.. పిల్లలు లేదు.. అనుకున్న ఓ టీవీ నటి, తనకు నచ్చిన వ్యక్తితో సహజీవనం చేసింది. దీనికి వారు ముద్దుగా ప్రేమ అని పేరు పెట్టుకున్నారు.
అయితే, నాలుగేళ్లు గడిచిన తర్వాత వీరి మధ్య వివాదాలు చోటు చేసుకున్నాయి. తర్వాత ఏం జరుగుతుంది? సహజంగా అయితే, సదరు ప్రియుడికి దూరంగా ఉంటూ తన పనితాను చేసుకుంటుంది. లేదా మరెవరినైనా పెళ్లి చేసుకుని జీవితంలో ఒకదారిదొరికిందని హ్యాపీగా ఉంటుంది. కానీ, తాజా కేసులో మాత్రం టీవీ సీరియల్ నటి ఒకామె ఖతర్నాక్ పనిచేసింది. తనకు అడ్డుగా ఉన్నాడని మాజీ ప్రియుడిని ప్రస్తుత ప్రియుడితో కలిసి హత్య చేసింది. అది చేతికి మట్టి అంటకుండానే. ఇది ఎక్కడో జరగలేదు. హైదరాబాద్‌లోనే జరిగింది.
ఆద్యంతం అనేక మలుపులు తిరిగిన ఈ ఘటన ఆసక్తిగా మారింది. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన ఓ యువతి సినిమాలపై ఆశతో చిత్రరంగ ప్రవేశం చేసింది. అయితే,అక్కడ ఆఫర్లు రాలేదు. దీంతో టీవీల్లో వచ్చిన అవకాశాలతో కొన్ని టీవీ సీరియళ్లలో నటిస్తోంది. కృష్ణానగర్‌లో ఓ ఫ్లాట్‌ను రెంట్‌కు తీసుకుని ఒంటరిగా ఉంటోంది. అయితే, ఇదే ఫ్లాట్‌లో శ్రీకాకుళానికి చెందిన సత్యనారాయణ కూడా ఉంటున్నారు. ఈయన కూడా సినిమాల పై మోజుతోనే హైదరాబాద్‌కు వచ్చారు. సేమ్ టు సేమ్ పొజిషన్ ఛాన్స్‌లు దక్కలేదు.
దీంతో జూనియర్ ఆర్టిస్ట్‌గా నటిస్తున్నారు. అయితే, వీరి మధ్య ఎక్కడో లింకు కుదిరి.. నాలుగేళ్ల పాటు సహజీవనం సాగించారు. అయితే, పెళ్లి చేసుకుందామని సత్యనారాయణ కోరగా ఆమె వద్దంది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఫలితంగా నాలుగు నెలల క్రితం విడిపోయారు. ఇదే సమయంలో సత్యనారాయణ ఉంటున్న ఫ్లాట్‌కు పైన ఉండే శ్రీనివాస్ రెడ్డితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఈ విషయమై సత్యనారాయణ వీరితో గొడవ పడేవాడు.
పోలీసులకు ఫిర్యాదు వరకూ వెళ్లింది. ఈ క్రమంలో ఇది మరింత పెరిగి ఓ ఫైన్ మార్నింగ్.. సత్యనారాయణ మరోసారి గొడవ పడ్డాడు. దీంతో శ్రీనివాస్‌డ్డి, నటి పథకం ప్రకారం సత్యనారాయణను భవనం రెండో అంతస్తు నుంచి కిందకు తోసేశారు. కేబుల్ వైర్లకు కాసేపు వేలాడి సత్యనారాయణ కింద పడ్డారు. తీవ్రంగా గాయపడిన అతడ్ని స్నేహితులు ఆస్పత్రికి తరలించారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ కేసులో ఆమె చెబుతోంది ఏంటంటే తమకు సంబంధం లేదని, అసలు అతనెవరో కూడా తనకు తెలియదని! కానీ, సత్యనారాయణ స్నేహితులు మాత్రం ఆమె, అతను కలిసి తీసుకున్న పొటోలను బయటపెట్టారు. దీంతో పోలీసులు ఖతర్నాక్ ప్రేమికురాలిని అరెస్టు చేసేందుకు రెడీ అయ్యారు.
This post was last modified on November 2, 2022 6:09 pm
సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…
పార్లమెంటు శీతాకాల సమావేశాలు శుక్రవారం(రేపు)తో ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో చివరి రెండో రోజైన గురువారం రాజకీయ వేడి లోక్‌సభను కుదిపేసింది.…
రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో…
పై అధికారులకు ఆ కలెక్టర్ ఎందుకో నచ్చలేదు.. నీ మీద ఇటువంటి అభిప్రాయం ఉందని స్వయంగా సీఎం ఆ కలెక్టర్…