దేశంలో అమానవీయ ఘటనలు, అత్యాచారాలు ఘోరంగా పెరిగిపోతున్నాయి. గతంలో ఏ నెలకో.. లేదా.. 15 రోజులకో అత్యాచారాలు, ఘోరాలు, నేరాలపై వార్తలు వినిపించేవి. కనిపించేవి. కానీ, ఇప్పుడు దేశంలో గంటకో దారుణం జరుగుతోంది. తాజాగా జరిగిన ఘటన మరింత దారుణమని పోలీసులు చెబుతున్నారు. ఐదేళ్ల చిన్నారిపై ఒక కామాంధుడైన యువకుడు డిజిటల్ రేప్ కు పాల్పడ్డాడు. పక్కింటి వాడే అని నమ్మిన ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తనకు ఏం జరిగిందో తెలియక.. పని నుంచి వచ్చిన తల్లికి ఆ చిన్నారి చెప్పిన మాటలు విని నోట మాట రాలేదు.
ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని పొరుగింటి వ్యక్తి ఆ పాపపై ‘డిజిటల్ రేప్’కు పాల్పడ్డాడు. తనకేం జరిగిందో అర్థం కాక ఇంటికి వచ్చిన తల్లికి ఆ పాప తన మాటల్లో జరిగిందంతా వివరించింది. దీంతో ఏం చేయాలో తోచని స్థితికి ఆ తల్లి చేరింది. ఇంతటి అమానవీయ ఘటన ఢిల్లీలోని ఇందిరాపు రంలో జరిగింది.
ఘాజియాబాద్ ఇందిరాపురానికి చెందిన ఓ మహిళ అదే ప్రాంతంలోని ఓ ఆస్పత్రిలో నర్స్గా పని చేస్తోంది. ఈ క్రమంలో ఆమె తన కుమార్తెను ఇంట్లో వదిలి డ్యూటీకి వెళ్లింది. ఎవరూ లేరని తెలుసుకున్న ఇంటి పక్కనున్న ఓ వ్యక్తి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అక్కడ నుంచి పరారయ్యాడు. ఈఘటనలో చిన్నారి జననాంగం నుంచి రక్తం కారింది. దీంతో చిన్నారి గుక్కపట్టి ఏడ్వడడం ప్రారంభించింది. అయితే, ఎవరూ పట్టించుకోలేదు. కొద్దిసేపటికి ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన తల్లి.. ఏడుస్తున్న చిన్నారిని దగ్గరకు తీసుకుని ఏంజరిగిందని అడగడంతోపాటు.. రక్తమోడుతున్న బట్టలను తడిమి చూసింది.
ఘోరం తెలుసుకుని షాక్కు గురైన తల్లి పోలీసులను ఇంటికి పిలిచింది. ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పాపను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. చిన్నారిపై నిందితుడు డిజిటల్ రేప్ కు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. దీంతో ఆ మాతృమూర్తి అవాక్కయింది. ప్రస్తుతం చిన్నారికి వైద్యం అందిస్తున్నారు.
డిజిటల్ రేప్ అంటే ఏమిటి?:
డిజిటల్ రేప్ అంటే.. ఒక పదం కాదు… రెండూ వేర్వేరు పదాలు. డిజిటల్, రేప్ రెండు వేర్వేరు. డిజిట్ అంటే ఆంగ్లంలో అంకె అని అర్థం. ఇంగ్లిష్ డిక్షనరీలో శరీర భాగాలకు కూడా నంబర్లు ఉంటాయి. అందుకే డిజిట్, రేప్ కలిపి డిజిటల్ రేప్ అని పేరు పెట్టారు. డిజిటల్ రేప్ అంటే.. బాధితురాలి జననాంగంలోకి నిందితుడు చేతి వేళ్లు, కాలి వేళ్లు లేక వస్తువులను చొప్పించడం. తద్వారా లైంగికంగా వేధించడం అన్నమాట. విదేశాల్లో మాదిరిగానే డిజిటల్ రేప్పై మన దేశంలోనూ ఓ చట్టం ఉంది. దీనికి కూడా పోక్సో చట్టమే వర్తిస్తుంది.
ఈ ఘటనలో ఏం జరిగిందంటే.. ఐదేళ్ల చిన్నారి జననాంగంలోకి సదరు శాడిస్ట్ యువకుడు.. తన వేళ్లు, పెన్ను.. స్కేలు, చిన్నారి ఆడుకుంటున్న ఒక టాయ్‌ను సైతం చొప్పించి.. కర్కశంగా వ్యవహరించాడు.
This post was last modified on November 2, 2022 7:40 am
తిరుపతిలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. అదేవిధంగా 38 మంది గాయపడ్డారు. వీరిలో మరో…
ఏం జరిగినా.. ఎంత జరుగుతున్నా.. కొన్ని కఠిన నిర్ణయాల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరించే తీరు.. ఆయన్ను అమితంగా…
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం విశాఖ వేదికగా మౌన దీక్షకు దిగారు. పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్…
ఇండియాలోనే మొదటిసారి ఇన్ఫ్రారెడ్ కెమెరాతో షూట్ చేసిన సాంగ్ గా నానా హైరానా గురించి దర్శకుడు శంకర్ ఎంత గొప్పగా…
తెలంగాణలో మందుబాబులు బీరు దొరకక ఇబ్బంది పడటం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా…
2025 తొలి ప్యాన్ ఇండియా మూవీగా గేమ్ ఛేంజర్ మీద మాములు అంచనాలు లేవు. అందులోనూ దర్శకుడు శంకర్ తొలి…