ప్రపంచంలో అమెరికాతోపాటు పలుదేశాలలో దక్షిణాది వంటకాలను వండి వార్చే ప్రముఖ రెస్టారెంట్ లలో ఒకటిగా ‘గోదావరి’ పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంది. వినూత్న ఆలోచనలతో, విభిన్నమైన కాన్సెప్ట్‌లకు కేరాఫ్ అడ్రస్ గా మారి భోజనప్రియులను ఎన్నోఏళ్లుగా ఆకట్టుంటోన్న “గోదావరి” ఇప్పుడు హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో “ప్యూర్ వెజ్” రెస్టారెంట్ ను ప్రారంభించింది (Ishtaa Pure Veg Restaurant).
Ikea కు అతి సమీపంలో, హైటెక్ సిటీలోని పలు దిగ్గజ ఐటీ కంపెనీల కార్పొరేట్ కార్యాలయాలకు దగ్గరలో ఈ రెస్టారెంట్ ఉంది. ఈ ప్రాంతాలలో పనిచేసే వారు 10 నిమిషాలు నడిస్తే పసందైన వెజ్ వంటకాలను ఆరగించవచ్చు.
10000 చదరపు అడుగుల విస్తీర్ణంతో 2 అంతస్థుల సువిశాల స్థలంలో ‘ఇష్టా’ను ఏర్పాటు చేశారు. అన్ని వయసులవారికి నచ్చే చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రారంభం కాబోతోన్న ‘ఇష్టా’లో పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టపడి విందు ఆరగించవచ్చు. ఆకట్టుకునే వాతావరణం, ప్రత్యేకమైన ఏర్పాట్లు సాధారణ వెజ్ వెజ్ రెస్టారెంట్‌ల నుంచి ‘ఇష్టా’ను ప్రత్యేకంగా నిలుపుతాయి.
ఎల్లపుడూ ఐటీ ఉద్యోగులు, ప్రజలతో రద్దీగా ఉండే హైటెక్ సిటీ వంటి ప్రాంతంలో “ప్యూర్ వెజ్” ప్లేస్ ను ఏర్పాటు చేసినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. భారీ మెనూతో పాటు ప్రామాణికమైన, ప్రత్యేకమైన, రుచికరమైన థాలీలను ‘ఇష్టా’ అందిస్తోంది. 4 నెలల క్రితం ‘ఇష్టా’ రెస్టారెంట్ ఓపెన్ అయిందని, అప్పటి నుండి తాము వారానికి ఒక్కసారైనా ఈ రెస్టారెంట్ కు వస్తున్నామని కొందరు ఐటీ ఉద్యోగులు చెబుతున్నారు (Pure Veg Restaurant Near Hitech City).
వెజ్ కాన్సెప్ట్ లో అపార అనుభవం, నైపుణ్యంతో కూడిన బృందం ‘ఇష్టా’కు ఉన్నాయని, తమ టీమ్‌తో ప్రపంచంలోని ఏ ప్రాంతంలో అయినా ‘ఇష్టా’ ఫ్రాంచైజ్ ను ఓపెన్ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ‘ఇష్టా’ వెజ్ కాన్సెప్ట్ టీంలో కీలక సభ్యుడైన ముక్కా జస్వంత్ రెడ్డి చెప్పారు.
చట్నీల నుండి బిర్యానీల వరకు వెజ్ కాన్సెప్ట్ ను తయారు చేయడంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, అన్ని రకాల వెజ్ కాన్సెప్ట్ లను రుచికరంగా కస్టమర్లకు అందించడం జోక్ కాదని ఆయన అన్నారు. అందుకే, పసందైన వెజ్ కాన్సెప్ట్ లు తయారు చేసేందుకు ఎన్నో ఫుడ్ ట్రయల్స్ చేశామని, అందుకు తమకు 5 నెలలు పట్టిందని బోస్టన్‌లో ‘గోదావరి’ని నడిపిన జస్వంత్ రెడ్డి చెప్పారు.
విజయవాడలోని యునైటెడ్ తెలుగు కిచెన్స్ (UTK), హైదరాబాద్‌లోని ఇష్టాతో భారతీయ మార్కెట్లోకి తాము ప్రవేశించాని ఇష్టా నిర్వాహకులు చెబుతున్నారు. ఈ రెండు కాన్సెప్ట్‌లు వేటికవే ప్రత్యేకమైనవని, ప్రపంచవ్యాప్తంగా తమకు చెఫ్‌లు, ఫ్రంట్ స్టాఫ్ మరియు మేనేజర్‌లతో కూడిన బలమైన బృందం ఉందని, అందుకే, ఇప్పుడు ఈ రెండు కాన్సెప్ట్‌లను ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంఛైజింగ్ చేయడంలో తాము దూకుడుగా వ్యవహరించేందుకు సిద్ధంగా ఉన్నామని అంటున్నారు.
గతంలో ‘గోదావరి’ విషయంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకోవడానికి కోవిడ్, లాక్ డౌన్ ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాయని, అందుకే, ఇప్పుడు తమ ఫ్రాంచైజీలను చాలా జాగ్రత్తగా ఎంచుకుంటున్నామని ‘గోదావరి’ వ్యవస్థాపకులు కౌశిక్ కోగంటి, తేజ చేకూరి అన్నారు.
“తోటకూర లివర్ ఫ్రై”, “అన్-మటన్ బిర్యానీ”, 30 రకాల దోసెలు, మరెన్నో ప్రత్యేకమైన వంటకాలతో భారీ మెనూని ‘ఇష్ట’పడే వారికి ‘ఇష్టా’ అందిస్తుంది. పండుగ సీజన్ లో ప్రత్యేకంగా అరిటాకుపై “పండగ భోజనం” పేరుతో అందించిన ప్రత్యేకమైన థాలీ…హైదరాబాద్ లోని భోజన ప్రియుల మధ్య టాక్ ఆఫ్ ది టౌన్ గా మారడం విశేషం.
హైదరాబాద్ లో ఉన్న, హైదరాబాద్ లో పర్యటించే శాకాహార ప్రియులంతా తప్పక సందర్శించవలసిన రెస్టారెంట్ ‘ఇష్టా’. శాకాహారాన్ని ఇష్టంగా తినేవారు ‘ఇష్టా’వంటి ఆహ్లాదకరమైన ప్రదేశాన్ని కూడా తప్పకుండా ‘ఇష్ట’పడతారు.
మరిన్ని వివరాల కోసం సంప్రదించండి:
ఇష్టా హైటెక్ సిటీ
హైటెక్ సిటీ మెయిన్ రోడ్, లుంబిని ఏవ్
హైదరాబాద్, తెలంగాణ
Google లింక్: https://g.co/kgs/oP4KvY
సందర్శించండి: https://www.ishtaa.in
మీకోసం మా ‘ఇష్టా’ లో కష్టపడి చేసే నోరూరించే వంటకాలను మీరంతా ‘ఇష్ట’ పడి ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాము…మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు.
Content Produced by: Indian Clicks, LLC
This post was last modified on October 14, 2022 11:24 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…