ఈమధ్య వచ్చే సినిమాల్లో తరచూ వాడికి చిప్పు దొబ్బిందని, వీడికి చిప్పు దొబ్బిందనే డైలాగులు వింటునే ఉంటాము. ఇపుడు వాడికీ వీడికి కాదు మొత్తం ప్రపంచానికే చిప్పు దొబ్బే రోజులు దగ్గరలోనే ఉన్నాయట. ప్రపంచానికి చిప్పు దొబ్బటం ఏమిటా ? అని అనుకుంటున్నారు. పొరుగునే ఉన్న తైవాన్ పైన డ్రాగన్ కన్నేసిన విషయం తెలిసిందే. ఎప్పుడెప్పుడు తైవాన్ దేశాన్ని కబళించేద్దామా ? అని చైనా చాలా ఆతృతగా ఉంది.
ఇదే విషయమై అమెరికా పర్యటనలో తైవాన్ ఆర్ధికమంత్రి వాంగ్ మెయి-హువా మాట్లాడుతు చైనా గనుక తైవాన్ మీద దాడిచేస్తే యావత్ ప్రపంచం ఒక్కసారిగా సమస్యల్లో ఇరుక్కోవటం ఖాయమని హెచ్చరించారు. తమ దేశంమీద చైనా దాడిచేసి ఆక్రమించుకోవాలని చూస్తే అది తమకు మాత్రమే నష్టంకాదని మొత్తం ప్రపంచమే కష్టాల్లో ఇరుక్కుంటుందన్నారు. తైవాన్ పైన చైనా దాడిచేస్తే ప్రపంచానికి వచ్చే సమస్యేమిటి ?
ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల కోట్ల కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాపులతో పాటు అనేక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల వాడుతున్న విషయం తెలిసిందే. ఇవన్నీ సక్రమంగా పనిచేయాలంటే సెమీ కండక్టర్లు, మదర్ బోర్డులు చాలా కీలకమైనవి. ఇవన్నీ కూడా ప్రత్యేకంగా తయారుచేసిన చిప్పుల ఆధారంగా మాత్రమే పనిచేస్తాయి. అలాంటి చిప్పుల ఉత్పత్తిలో తైవాన్ వాట 90 శాతముంది. చిప్పులే కాకుండా సెమీకండక్టర్లు, మదర్ బోర్డులను కూడా తైవాన్ ఉత్పత్తిచేస్తోంది.
గడచిన 40 ఏళ్ళుగా తైవాన్ వాటి ఉత్పత్తిలో ఆరితేరిపోయింది. వీటి ఉత్పత్తిలో మరేదేశం కూడా తైవాన్ కు సమీపంలో కూడా లేదు. చైనా గనుక తన సైనికశక్తితో తైవాన్ పై దాడిచేస్తే వెంటనే సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్షరింగ్ కంపెనీ వెంటనే షట్టడౌన్ అయిపోతుందని మంత్రి చెప్పారు. ఒకసారి అది మూతపడితే సెమీకండక్టర్లు, మదర్ బోర్డులు, చిప్పులు ఉత్పత్తి ఆగిపోతాయి. ఇదే జరిగితే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లపైన ప్రభావం పడుతుంది. రిపేర్లకు వచ్చిన గ్యాడ్జెట్లను మరమ్మతులు చేయటం సాధ్యంకాదు. అప్పుడు యావత్ ప్రపంచం మొత్తానికి చిప్పుదొబ్బటం ఖాయం.
This post was last modified on October 13, 2022 11:02 am
2025 సంక్రాంతికి ప్లాన్ చేసుకున్న అజిత్ గుడ్ బ్యాడ్ ఆగ్లీ పండగ రేసు నుంచి దాదాపు తప్పుకున్నట్టే. నిన్న చెన్నైలో…
ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 164 సీట్లతో కూటమి ప్రభుత్వం…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను హీరోగా తెలుగు తెరకు పరిచయం చేసిన చిరుత మూవీతో తెలుగు సినీ…
ఈ హైటెక్ జమానాలో 24 గంటల పాటు పలు కంపెనీలు సేవలందిస్తున్నాయి. దీంతో, సాఫ్ట్ వేర్ కంపెనీలు, బీపీవోలలో నైట్…
లావణ్య త్రిపాఠి.. 2012లో విడుదలైన అందాల రాక్షసి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత ఎందరో…
నిన్న చెన్నైలో జరిగిన పుష్ప 2 సాంగ్ లాంచ్ వేడుకలో దేవిశ్రీ ప్రసాద్ ప్రసంగం ఇండస్ట్రీ మొత్తం హాట్ టాపిక్…