Trends

రిషి సునాక్ ఎందుకు ఓడిపోయాడు?

అంచనాలు నిజమయ్యాయి. ఎన్నికలకు ముందే వెల్లడైన సర్వేలు అక్షర సత్యమయ్యాయి. బ్రిటన్ ప్రధానమంత్రి పదవి కోసం జరిగిన ఎన్నికల్లో భారత సంతతికి చెందిన రిషి సునాక్ చివరి వరకు గట్టి పోటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. చివరి రౌండ్ కు సంబంధించిన ప్రచారం మొదలైన కొద్ది రోజులకే అప్పటివరకు దూసుకెళుతున్న రిషి సునాక్.. ఆ తర్వాత నుంచి వెనకబడటం మొదలైంది.
అప్పటి నుంచి షురూ అయిన అతడి డౌన్ ఫాల్ కంటిన్యూ అవుతుందే తప్పించి.. తగ్గని పరిస్థితి. ఈ కారణం చేతనే.. తన రాజకీయ ప్రత్యర్థి లిజ్ ట్రస్ చేతిలో 21 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

తనకంటే ఐదేళ్ల పెద్దది అయిన లిజ్ చేతిలో రిషి ఓడటం ఓకే అయినా.. అసలు ఓటమి ఎందుకు వచ్చింది? దాని వెనుక ఏం జరిగింది? లాంటి ప్రశ్నలు వేసుకుంటే.. కొత్త విషయాలు బయటకు వస్తాయనే చెప్పాలి. నిజానికి చివరి రౌండ్ లో ప్రధాని పదవి కోసం జరిగిన ఎన్నికకు ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన రిషి సునాక్ బరిలోకి దిగితే.. ఆయనకు ప్రత్యర్థిగా రంగంలోకి దిగారు బ్రిటన్ విదేశాంగ మంత్రిగా వ్యవహరిస్తున్న లిజ్ ట్రస్. మొదట్లో రిషికి ఉన్న ఆదరణతో పోలిస్తే.. లిజ్ కు చాలా తక్కువగా ఉండేది. ప్రచార వేళలో బాగానే ఉన్నా.. ఆన్ లైన్ లో ఓట్లు వేసేందుకు వీలుగా ఎన్నికల ప్రక్రియ షురూ అయిన నాటి నుంచి లెక్క తేడా కొట్టినట్లుగా అనిపిస్తోందన్న వాదన అక్షర సత్యమైందన్నది తుది ఫలితాన్ని చూసినప్పుడు అర్థమవుతుందని చెప్పాలి.

నిజానికి ప్రధాని ఎన్నికలకు ముందు అతగాడి దూకుడు దెబ్బకు అతను ఖాయంగా ప్రధానమంత్రి అవుతారని కూడా చెప్పేశారు. అందుకు భిన్నంగా ఏం జరిగింది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. రిషి సునక్ ఓటమికి కారణాల్ని చూస్తే..

1.బరిలో నిలిచిన వేళ తనను తాను కమిట్ మెంట్ ఉండే అభ్యర్థిగా రిషి సునాక్ నిలబడినా.. ఆయనకు వెన్నుపోటు దారుడనే ముద్ర ఆయన్ను ముందుకు పోనివ్వలేదు. చివరి రౌండ్ లో ఓట్లు వేయాల్సిన టోరీ సభ్యుల్లో అత్యధికులు బోరిస్ జాన్సన్ విధేయులు కావటం పెద్ద దెబ్బ.
2.తన రాజకీయ ఎదుగుదలకు.. గురువు సమానుడైన సీనియర్ రాజకీయ నాయకుడిగా ఎదిగేందుకు కారణమైన బోరిస్ జాన్సన్  పదవి పోవటంలో రిషి కీరోల్ ప్లే చేశారని.. వెన్నుపోటు పొడిచారని ఓటర్లు భావించటం ఓటమికి కారణం.
3.దేశ ఆర్థిక విధానంపై తనకు..బోరీస్ జాన్సన్ కు మధ్య పెద్దగా అభిప్రాయ భేదాలు ఉన్నాయని స్పష్టమైన తర్వాతే రిషికి వేరే మార్గం  లేకుండా పోయింది.
4.రిషి సునాక్ మంచి సేల్స్ మ్యాన్. వెన్నుపోటుదారుడు. మోసగాడు.. లాంటి విమర్శల్ని అంతకంతకూ పెంచుకుంటూ పోయారు టోరీ సభ్యులు. ఇది కూడా ఓటమికి కారణం.
5. ప్రధాన పదవి నుంచి తప్పుకొని.. ఆపద్ధర్మ ప్రధానిగా తనను తాను ప్రకటించుకున్న బోరిస్ జాన్సన్.. ప్రధాని ఎన్నికల్లో ఎవరికైనా ఓటు వేయొచ్చు కానీ.. రిషికి మాత్రం వేయొద్దంటూ ప్రచారం చేశారు.
6. ప్రధానిగా బోరిస్ జాన్సన్ రాజీనామాలో రిషి కీలక పాత్ర పోషించటం..అతడు రాజీనామా చేసిన తర్వాత నుంచే ఎక్కువ రాజీనామాలు చేసుకోవటం.. దీంతో ఒత్తిడికి గురైన బోరీస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేశారు. రిషి రాజీనామా తర్వాత దాదాపు 50 మంది రాజీనామాలు చేశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆయన రిషి ఓటమే తన గెలుపు అన్నట్లుగా ప్రచారం చేయటం కూడా రిషిని దెబ్బేసింది.
7. బ్రెగ్జిట్‌ వేళ.. కరోనాను కంట్రోల్‌ చేయడం, ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంలో కీలక పాత్ర పోషించడం లాంటి చర్యలతో బోరిస్‌పై సానుభూతి వస్తే.. రిషి విషయంలో మాత్రం అది కాస్తా మైనస్ గా మారింది.
8. ప్రధాని పదవి రేసులోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే.. ‘రెడీ ఫర్ రిషి’ నినాదంతో బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసంపై అతగాడు ఉరుకులు పరుగులు తీయటం దెబ్బేసింది. ప్రధాని కావాలనే ఆశతోనే బోరిస్ జాన్సన్ ప్రభుత్వాన్ని కూలగొట్టారన్న ఆరోపణలు రిషికి మైనస్ గా మారాయి.
9. లిజ్ ట్రస్ విషయానికి  తనను తాను నిజాయితీపరురాలిగా ప్రచారం చేసుకోవటం.. బోరిస్ జాన్సన్ కు నమ్మిన బంటుగా చెప్పుకోవటం.. తాను ప్రధాని అయితే 2019 మేనిఫెస్టోను అమలు చేస్తానన్న హామీ లిజ్ కు సానుకూలంగా మారింది.
10. భార్య అక్షత మూర్తి ఆస్తులు.. వ్యాపార లావాదేవీలు..పన్నుల చెల్లింపు విషయాల్లో రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు గుప్పించటం.. ఇది సొంత పార్టీ వారికి సైతం విసుగు తెప్పించేలా చేసింది.

This post was last modified on September 6, 2022 4:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హైద‌రాబాద్‌లో భార్య‌ను చంపి.. కుక్క‌ర్‌లో ఉడికించాడు!

ఎక్క‌డో ఢిల్లీలో రెండేళ్ల కింద‌ట ప్రియురాలిని చంపి.. ముక్క‌లు చేసి ఫ్రిజ్‌లో పెట్టి.. విడ‌త‌ల వారీగా వాటిని అడ‌విలో విసిరేసిన…

8 minutes ago

మెనాలిసా వజ్రాన్ని వెలికి తీసిందెవరు?

యావత్ ప్రపంచం ఆసక్తిగా మాట్లాడుకుంటున్న మహా కుంభమేళాలో.. అతి సాదాసీదాగా పూసలు అమ్ముకునేందుకు వచ్చిన పదహారేళ్ల అమ్మాయి ఇప్పుడు ప్రపంచానికి…

10 minutes ago

లోకేశ్ ప్రస్థానంపై చంద్రబాబు మనసులోని మాట ఇదే!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కు నేటితో 41 ఏళ్లు నిండాయి.…

49 minutes ago

అభిమన్యుడు అనుకున్నారు!!… అర్జునుడు అయ్యాడు!!

నేడు… జనవరి 23… టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ జన్మదినం. మొన్నటి…

2 hours ago

దావోస్ లో ‘అరకు’ ఘుమఘుమలు!

స్విట్జర్లాండ్ నగరం దావోస్ గడచిన 4 రోజులుగా భారీ జన సందోహంతో కిటకిటలాడుతోంది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్…

3 hours ago

అమరావతికి హడ్కో నిధులు వచ్చేశాయి!

ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి…

5 hours ago