Trends

మద్యం మారింత తాగేలా ఐడియాలు ఇస్తే ప్రైజ్

అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రధాన ఆదాయ వనరుగా నిలిచేది లిక్కర్ అమ్మకాలతో వచ్చే ఆదాయమే. మన దేశంలోని చాలా రాష్ట్రాల్ని చూసినప్పుడు.. ప్రధాన ఆదాయ వనరుగా లిక్కర్ మీద వచ్చే పన్ను ఆదాయం నిలుస్తుంది. అలాంటిది డెవలప్ మెంట్ లో తిరుగులేని రీతిలో దూసుకెళ్లిన దేశాల్లోనూ మద్యం అమ్మకాలతో వచ్చే ఆదాయాన్ని పెంచుకోవడం కోసం చేసే ప్రయత్నాలు ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. అందరిని ఆకర్షిస్తున్నాయి. డెవలప్ మెంట్ లో తిరుగులేని అధిక్యతను ప్రదర్శిస్తూ.. ప్రపంచంలోనే అత్యుత్తమ సంపన్న దేశాల్లో ఒకటిగా నిలిచే జపాన్ ప్రభుత్వం తాజాగా చేసిన ప్రకటన ఆసక్తికరంగా మారింది.

తమ దేశంలో యూత్ మద్యాన్ని మరింత తాగేందుకు వీలుగా ఐడియాలు ఇవ్వాలని కోరుతోంది. ఇందుకోసం జాతీయ స్థాయిలో పోటీల్ని నిర్వహిస్తోంది. గడిచిన 31 ఏళ్లలో ఎప్పుడూ లేని రీతిలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగేలా ఐడియాలు ఇవ్వాలని కోరుతున్నారు. దీనికి సంబంధించి.. ‘సేక్ వైవల్’ పేరుతో ప్రచారాన్నిషురూ చేశారు. దేశంలోని 20 -38 ఏళ్ల మధ్యలో ఉన్న యూత్ ను మద్యం వైపు ఆకర్షించేందుకు వీలుగా తగిన ఆలోచనలతో రావాలని కోరుతోంది నేషనల్ ట్యాక్స్ ఏజెన్సీ (ఎన్ టీఏ).

ఇంట్లోనూ మద్యాన్ని సేవించేందుకు వీలుగా ఐడియాలు ఇవ్వాలని కోరుతోంది. దీనికి సంబంధించిన ఎంట్రీ ఫీజు లేదని.. తమకు వచ్చిన ఐడియాల్లో అత్యుత్తమమైన వాటికి ఫ్రైజులు ఇస్తామని చెబుతున్నారు. దీనికి సంబంధించిన విజేతను నవంబరు 10న టోక్యోలో ప్రకటిస్తామని చెప్పారు. ఎందుకిలా? అంటే.. ప్రభుత్వానికి వచ్చే మద్యం ఆదాయం భారీగా పడిపోవటమేనని చెబుతున్నారు.

ఉదాహరణకు 1995లో జపాన్ లో సగటున ఒక వ్యక్తి ఏడాదికి 100 లీటర్ల మద్యాన్ని తీసుకుంటే.. 2020 నాటికి అది కాస్తా 75 లీటర్లకు తగ్గింది.ఈ కారణంగా ప్రభుత్వం ఆదాయం 1980 నాటికి 5 శాతం ఉంటే.. 2011 నాటికి మూడు శాతానికి పడిపోయింది. 2020 నాటికి ఇది కాస్తా 1.7 శాతానికి తగ్గిపోయింది. దీంతో.. మద్యం అమ్మకాల మీద జపాన్ ప్రభుత్వం ఫోకస్ చేసింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. జపాన్ యువత.. తమ తల్లిదండ్రుల కంటే తక్కువ మద్యాన్ని సేవించటం కూడా ఆదాయం పడిపోవటానికి కారణంగా చెబుతున్నారు. అయితే.. మద్యం వినియోగం విషయంలో యూత్ ఎందుకలా తయారైంది? అన్న విషయాన్ని చూస్తే..అందరూ కరోనాగా చెప్పినా.. అందులోకొంత మేర మాత్రమే నిజం ఉందంటున్నారు.

ఒకవేళ కరోనానే కారణమైతే.. అంతకు ముందు సంవత్సరాల్లోనూ అమ్మకాలు ఎందుకు తగ్గినట్లు? అన్నది ప్రశ్న. ఇదే విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే.. జపాన్ యూత్ కు ఆరోగ్యంమీద శ్రద్ద పెరగటం.. తమ ఆరోగ్యాన్ని దెబ్బ తీసే వాటికి దూరంగా ఉండటం ఎప్పుడో మొదలైతే.. కరోనా కారణంగా ఆ అవగాహన మరింత పెరిగింది. అదే ఇప్పటి పరిస్థితి కారణమైందంటున్నారు. ఏమైనా.. జపాన్ యూత్ ఆలోచనలు మన దేశంలోని యూత్ కు ఎప్పుడు వస్తాయో?

This post was last modified on August 21, 2022 9:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నెగిటివిటీ ప్రభావానికి సినీ బాధితులు ఎందరో

సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…

10 minutes ago

విశాల్ ప్రభావం – 30 సినిమాల బూజు దులపాలి

పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…

58 minutes ago

అఖండ 2 ఇంటర్వల్ కే మీకు పైసా వసూల్ : తమన్

ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…

2 hours ago

మాకు సలహాలు ఇవ్వండి బిల్ గేట్స్‌కు చంద్ర‌బాబు ఆహ్వానం

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఐటీ దిగ్గ‌జ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు,…

3 hours ago

శార‌దా ‘స్వామి’ తిరుమల లో చేసింది తప్పే

విశాఖ‌ప‌ట్నంలోని శార‌దాపీఠం అధిప‌తి స్వ‌రూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్ర‌చారంలో ఉన్న విష‌యం తెలిసిందే. వైసీపీ హ‌యాంలో ఆయ‌న చుట్టూ…

3 hours ago

రిలయన్స్ న్యూ కరెన్సీ.. జియో కాయిన్

ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…

3 hours ago