ప్రపంచం వినాశపు అంచుల్లో ఉందని ఇప్పటికే హాలీవుడ్ లో చాలా సినిమాలు వచ్చాయి. రెండు దేశాల మధ్య అణు యుద్ధం జరిగితే దాని పర్యవసానం ఎలాగుంటుందో చాలా సినిమాల్లో చూపించారు. ఇదే విషయమై అమెరికాలోని వ్యవసాయరంగంలోని శాస్త్రజ్ఞులు కూడా అంచనా వేశారు. అమెరికా-రష్యా మధ్య గనుక అణు యుద్ధం జరిగితే ప్రపంచంలోని సుమారు 500 కోట్ల మంది జనాలు చనిపోతారంటు తమ నివేదికలో స్పష్టంగా ప్రకటించారు.
ఒక అంచనా ప్రకారం ప్రస్తుత ప్రపంచ జనాభా 750 కోట్లు. అణుయుద్ధం జరిగితే ఇందులో సుమారు 500 కోట్లమంది చనిపోతారంటే అణ్వాయుధాల తీవ్రత ఏ స్ధాయిలో ఉంటుందో అందరికీ అర్ధమవుతోంది. ఇంతకీ ఇన్నివందల కోట్ల మంది జనాలు ఎలా చనిపోతారు ? అణ్వాయుధాల తీవ్రత వల్లనా లేకపోతే ఇంకేదైనా కారణమా ? అంటే రెండూ అని శాస్త్రజ్ఞులు చెప్పారు.
మొదటి కారణం ఏమిటంటే అణ్వాయుధాల ప్రయోగం వల్ల ముఖ్యంగా వాతావరణంలో ఎవరు ఊహించని పరిణామాలు జరుగుతాయట. దీనివల్ల పంటలు పూర్తగా నాశనమైపోతాయట. అంటే భూసారం దెబ్బతినేస్తుంది. నీళ్ళంతా కాలుష్యమైపోయి విషపూరితమైపోతుంది. అలాగే వాతావరణంలో కార్బన్ ఉద్గారాలు బాగా పెరిగిపోతాయట. దీనివల్ల జనాలకు అనేక రకాల శ్వాస సంబంధిత రోగాలు ఒక్కసారిగా పెరిగిపోతాయట. అంటే ఇటు అనారోగ్యాలు పెరిగిపోయి అటు పంటలూ పండకపోతే జనాలంతా ఏమై పోతారు ? దీనికి ఉదాహరణగా భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే ఐదేళ్లలోపు పంటలన్నీ దెబ్బ తినేస్తాయని అంచనా వేశారు. దీనివల్ల 7 శాతం వ్యవసాయోత్పత్తులు తగ్గిపోతాయట.
అంటే మామూలు పద్దతుల్లో జరిగే యుద్ధం వల్లే 7 శాతం పంటలు దెబ్బతినేస్తే ఇక అణ్వాయుధాల కారణంగా ఇంకెత నష్టం జరగుతుంది ? అమెరికా-రష్యా మధ్య అణ్వాయుధాలతో యుద్ధం జరిగితే ప్రపంచంలో 90 శాతం పంటలు దెబ్బతినేస్తాయట. అప్పుడు ఆహారాన్ని వృధా చేయడం తగ్గించేస్తే, జంతువుల నుండి లభించే ఆహారంమాత్రమే తాత్కాలికంగా ఆహార ఉత్పత్తి కొరతను తీరుస్తుందట. కొంతకాలమైన తర్వాత ఇవికూడా దొరకవన్నది వాస్తవం.
This post was last modified on %s = human-readable time difference 5:14 pm
నవంబర్ నెల తొలి శుక్రవారం బోలెడు సినిమాలు మోసుకొస్తోంది కానీ మూవీ లవర్స్ లో ఏమంత ఆసక్తి కనిపించకపోవడం బాక్సాఫీస్…
2024 ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైర్లు రెండూ ఒకేసారి ఊడిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన…
ఏపీలో శాంతి భద్రతలపై, హోం మంత్రి వంగలపూడి అనితపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి…
కెరీర్ ఆరంభం నుంచి పెద్ద బడ్జెట్లలో స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తూ.. పెద్ద పెద్ద హీరోయిన్లతో జట్టు కడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూనే…
పిఠాపురంలో జరిగిన సభలో ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, ఏపీ హోం శాఖా మంత్రి అనిత రివ్యూ…
2024 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. నిర్మాణ…