అత్యంత వివాదాస్పద రచయిగా.. భారత సంతతికిచెందిన ప్రముఖ బ్రిటిష్ నవలా రచయిత.. బుక్ ప్రైజ్ విజేతగా సుపరిచితుడు సల్మాన్ రష్దీపై హత్యాయత్నం జరిగింది. న్యూయార్కులోని ఒక సంస్థలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఆయన ప్రసంగించాల్సి ఉంది. వేదిక మీద సల్మాన్ రష్దీ ఉన్న వేళలో స్టేజ్ మీదకు దూసుకు వచ్చిన ఆగంతకుడు.. 75 ఏళ్ల సల్మాన్ రష్దీ మెడపై కత్తితో దాడికి పాల్పడ్డాడు.
కత్తి పోట్లకు గురైన సల్మాన్ రష్దీ వేదిక మీదనే కుప్పకూలిపోయారు. ఆ వెంటనే ఆయన్ను హెలికాఫ్టర్ లో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్న దానిపై మాత్రం పోలీసులు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. న్యూయార్క్ లోని చౌతాక్వా ప్రాంతంలో జరిగిన కార్యక్రమంలో ఈ దారుణ ఉదంతం చోటు చేసుకుంది.
ఇదిలా ఉండగా.. సల్మాన్ రష్దీపై దాడికి పాల్పడిన ఆగంతకుడ్ని నూయార్క్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని పోలీసులు విచారిస్తున్నారు. ఈ దాడి వెనుక అసలేం జరిగిందన్న వివరాల్నిసేకరించే ప్రయత్నంలో వారు ఉన్నారు. ఇక సల్మాన్ రస్దీ విషయానికి వస్తే.. 1947లో ముంబయిలో జన్మించిన ఆయన.. స్వల్ప వ్యవధిలోనే ఆయన బ్రిటన్ కు వలస వెళ్లిపోయారు. ఇదిలాఉంటే సల్మాన్ రచించిన శటానిక్ వర్సెస్.. మిడ్ నైట్ చిల్డ్రన్ నవలకు 1981లో ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజు బహుమతిని సొంతం చేసుకుంది.
ఆయనకు ఎప్పుడైతే బుక్ ప్రైజ్ వచ్చిందో దాంతో ఆయన మంచి పాపులర్ అయ్యారు. అయితే.. ఈ పుస్తకానికి ముందు ఆయన రచించిన ది సాతానిక్ వరెస్సె నవల వివాదాకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఆయనపై ఫత్వా జారీ అయ్యింది. ఇదిలా ఉండే ప్రపంచ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనల నేపథ్యంలో ఆ పుస్తకం మీద పలు దేశాలు నిషేధాన్ని విదించాయి. అయినప్పటికీ ఆయన తాను రాసిన పుస్తకాన్ని బ్యాన్ చేయటంపై పోరాడుతున్నారు. పలు దేశాల్లో ఈ పుస్తకంపై పెద్ద ఎత్తున నిసననలు రేగటంతో పాటు నిషేధాన్ని విధించారు.
This post was last modified on August 13, 2022 10:34 am
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…