ప్రపంచంలోని చాలా దేశాల్లో ఉద్యోగాలకు ఎసరొచ్చేస్తుంటే కెనడాలో మాత్రం ఉద్యోగులకు కొరత వచ్చేసింది. వివిధ రంగాల్లో అన్ని రకాల ఉద్యోగాలు కలిపి సుమారు 10 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు కెనడా లేబర్ ఫోర్స్ డిపార్టమెంట్ ప్రకటించింది. ఎప్పటినుండో 7 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వీటికి మొన్నటి మే నెలలో 3 లక్షల ఉద్యోగాలు యాడ్ అయ్యాయి. దాంతో 10 లక్షల ఉద్యోగాలు ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్నాయి.
ఇన్ని లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉండటానికి రెండు కారణాలున్నాయి. మొదటిది ఖాళీ అయిన ఉద్యోగాల్లో భర్తీ చేసేందుకు సూటబుల్ క్యాండిడేట్లు దొరక్కట్లేదు. రెండో కారణం ఉద్యోగులు తమ రిటైర్మెంట్ వయసు వచ్చేవరకు వెయిట్ చేయకుండా ముందే వాలంటరీ రిటైర్మెంట్ తీసేసుకుంటున్నారు. ఈ కారణాలతో ఉద్యోగాలు భర్తీ కాకపోవటంతో ప్రభుత్వానికి కూడా ఇబ్బందిగానే ఉంది. రవాణా, గోదాములు, ఫైనాన్స్, ఇన్య్సూరెన్స్, వినోదరంగం, రియల్ ఎస్టేట్ రంగాల్లో లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
తమ దేశానికి వచ్చి చదువుకొమ్మని, ఉద్యోగాలు చేయమని కెనడా ప్రభుత్వం విదేశీయులను ఆహ్వానిస్తోంది. ఈ ఏడాదిలోపు 4.3 లక్షల మందికి కెనడా పౌరసత్వం ఇచ్చే అవకాశముంది. 2024 నాటికి మరో 4.5 లక్షల మంది యాడ్ అయ్యే అవకాశముంది. పైన చెప్పిన ఖాళీలు కాకుండా నిర్మాణరంగంలోనే 90 వేల ఖాళీలున్నాయి. రాబోయే 10 ఏళ్ళల్లో సుమారు 90 లక్షలమంది రిటైర్ అవుతున్నారట. అంటే ఏడాదికి 9 లక్షల ఉద్యోగాలు ఖాళీ అవబోతున్నాయి.
ఇక్కడ విచిత్రం ఏమిటంటే ప్రతి 10 మంది ఉద్యోగుల్లో ముగ్గురు వాలంటరీ రిటైర్మెంట్ తీసేసుకుంటారు కెనడాలో. కాబట్టి ఉద్యోగాలు లక్షల సంఖ్యలో ఉండిపోతున్నాయి. ఒకవైపేమో మనదేశంలో కేవలం కేంద్ర ప్రభుత్వంలో మాత్రమే కోట్లాది ఉద్యోగాలు భర్తీ కాకుండా ఉండిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లక్షల సంఖ్యలో ఖాళీగా ఉంచేస్తున్నాయి. ఇక్కడ ఉద్యోగాలు భర్తీ చేయకపోవటంతో ఖాళీగా ఉండిపోతుంటే కెనడాలో భర్తీ చేయాలన్నా ఉద్యోగులు దొరక్క ఖాళీగా ఉండిపోవటమంటే ఎంత విచిత్రమో కదా.
This post was last modified on August 8, 2022 2:01 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…