కరోనాకు ఆ మందు పని చేస్తోందట.. ఈ మందు మంచి ఫలితాలనిస్తోందట.. అని వార్తలు చాలా మామూలైపోయాయి ఈ మధ్య. ఐతే వ్యాధి తీవ్రతను బట్టి, అది సోకిన మనుషుల్ని బట్టి వివిధ స్థాయిల్లో పని చేసే మందులైతే వచ్చాయి కానీ.. నూటికి నూరు శాతం కరోనాను తగ్గించే మందు అయితే ఇంకా ఏదీ రాలేదు. ఐతే కరోనాను నియంత్రించాలంటే మందు కంటే ముందు వ్యాక్సిన్ రావడం ముఖ్యం అన్నది నిపుణుల మాట.
వ్యాక్సిన్ వేసుకుంటే కరోనా సోకే అవకాశమే ఉండదు. అప్పుడు ఆటోమేటిగ్గా వైరస్ అదుపులోకి వస్తుంది. అది జరిగినప్పుడే కరోనా అంతమవుతుందన్న ఉద్దేశంతో వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నారంతా. ఐతే ఏ కొత్త వ్యాధికైనా వ్యాక్సిన్ తయారు చేయడం అన్నది ఏళ్ల పాటు సాగే ప్రక్రియ. కాకపోతే కరోనా తీవ్రత, ప్రపంచవ్యాప్తంగా దాని ప్రభావం దృష్ట్యా వ్యాక్సిన్ తయారీ, దానికి అనుమతుల ప్రక్రియ శరవేగంగా నడుస్తోంది. ప్రభుత్వాలు కూడా వెసులుబాటు ఇచ్చాయి.
భారత్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ.. కరోనా వ్యాక్సిన్ తయారు చేసి మనుషులపై క్లినికల్ ట్రయల్స్ వేసే దశలో ఉంది. ఇంత తక్కువ సమయంలో ఇక్కడి దాకా రావడం విశేషమే అయినా.. అది అన్ని ప్రక్రియలూ దాటుకుని మార్కెట్లోకి రావడానికి ఇంకో ఏడాది అయినా పట్టొచ్చని అంటున్నారు. ఐతే దీని కంటే ముందు పిఫిజర్ అనే ఫార్మాసూటికల్ జెయింట్.. కరోనాకు వ్యాక్సిన్ తయారు చేసి మనుషుల మీద ట్రయల్స్ కూడా మొదలుపెట్టేయడం విశేషం.
ఈ ప్రయోగాత్మక వ్యాక్సిన్‌ను ఓ మోస్తరు స్థాయిలో ఉన్న కరోనా పేషెంట్ల మీద ప్రయోగించగా.. మంచి ఫలితాలే వచ్చాయట. కాకపోతే వ్యాక్సిన్ హైడోస్ ఇచ్చినపుడు జ్వరం సహా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయట. ఐతే ఓ జర్నల్ ప్రచురణ ప్రకారం ఈ వ్యాక్సిన్‌కు దాదాపుగా అనుమతులు వచ్చినట్లే అని.. అదే జరిగితే ఈ ఏడాది చివరికల్లా 10 కోట్ల డోస్‌లను తయారు చేయాలన్నది పిఫిజర్ లక్ష్యంగా ఉందని అంటున్నారు. మరి ఈ వ్యాక్సిన్‌కు అంతర్జాతీయంగా అనుమతులు లభిస్తాయేమో చూడాలి.
This post was last modified on July 2, 2020 9:30 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…