అత్యాచారానికి మించిన దారుణమైన నేరం మరొకటి ఉండదు. కొందరైతే హత్య కంటే తీవ్రమైన నేరంగా అభివర్ణిస్తారు. నిజమే.. ఒకరి అనుమతి లేకుండా.. ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా కేవలం కామవాంఛతో.. పశుబలంగాఇష్టారాజ్యంగా శారీరక హింసకు గురి చేయటానికి మించిన ఆరాచకం మరొకటి ఉంది. అందుకే.. అత్యాచార కేసుల విషయంలో చాలావరకూ బాధితురాలి పట్ల అందరూ సానుభూతిని ప్రదర్శిస్తుంటారు.అలాంటిది తాజాగా ఒక బాధితురాలిగా చెప్పే మహిళ చెప్పిన మాటల్ని విన్న కర్ణాటక హైకోర్టు అవాక్కు అయ్యింది.
ఆమె మాటలు ఇప్పుడు షాకింగ్ గానే కాదు.. ఇలా కూడా ఉంటుందా?అన్నట్లు మారింది. ఇంతకీ జరిగిందేమంటే.. కర్ణాటకకు చెందిన ఒక మహిళ.. తన సహోద్యోగి తనపై అత్యాచారానికి పాల్పడినట్లుగా కేసు పెట్టింది. ఈ నేపథ్యంలో అరెస్టు కాకుండా ఉండేందుకు వీలుగా నిందితుడు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశాడు. దీని విచారణ సందర్భంగా ఊహించని వ్యాఖ్య బాధితురాలి నోటి నుంచి రావటం షాకింగ్ గా మారింది.
తనపై అత్యాచారం జరిగిన తర్వాత అలిసిపోయి నిద్రపోయినట్లుగా సదరు బాధితురాలు పేర్కొన్నారు. ఈ తీరును కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఇది భారత మహిళ స్వభావం కాదన్న కోర్టు.. కీలక వ్యాఖ్యలు చేసింది. రాత్రి పదకొండు గంటల వేళలో ఆఫీసుకు వెళ్లటం.. నిందితుడితో కలిసి మద్యాన్ని సేవించటంతో పాటు.. రాత్రంతా అక్కడే గడపటం లాంటి వాటిని కోర్టుప్రస్తావించింది.
ఈ సందర్భంగా సదరు బాధితురాలిగా చెప్పుకుంటున్న మహిళ.. రేప్ జరిగిన తర్వాత ఆలసటతో తాను నిద్రపోయినట్లు పేర్కొన్నారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. సదరు మహిళ తీరును తప్పు పట్టింది. ఆమె చెప్పిన సమాధానాలు సరిగా లేవన్న భావనను వ్యక్తం చేసింది. ఇలాంటి వారి కారణంగా అమాయకులు పలువురు కొన్నిసార్లు ఇబ్బంది పడుతుంటారని న్యాయవర్గానికి చెందిన కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
This post was last modified on June 26, 2020 10:14 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…