మనదేశంలోని జనాలను చంపేందుకు పాకిస్తాన్ కొత్త తరహా బాంబులను ప్రయోగించిందా ? భద్రతా దళాలు చెప్పిన ప్రకారం అవుననే అనుకోవాలి. ఇంతకీ విషయం ఏమిటంటే పాకిస్ధాన్ భూభాగం నుండి వచ్చిన ఒక క్వాడ్ కాపర్ (డ్రోన్ లాంటిదే)ను భద్రతా దళాలు గుర్తించాయి. వెంటనే అప్రమత్తమైన సైన్యం ఉన్నతాధికారులకు తెలియజేయటం, వారి ఆదేశాలతో వెంటనే క్వాడ్ కాపర్ ను కాల్చేశారు.
కథువా జిల్లాలోని తాల్లీ హరియా చాక్ గ్రామంలో భద్రతా దళం క్వాడ్ కాపర్ ను కూల్చేశారు. తర్వాత దాన్ని స్వాధీనం చేసుకున్న సిబ్బంది పరిశీలించారు. అప్పుడు వారికి ఏడు మాగ్నెటిక్ బాంబులు, గ్రనేడ్లు కనిపించాయి. ఇలాంటి మాగ్నెటిక్ బాంబును 2012లోనే ఇరాన్ ఇండియాలో ఉపయోగించింది. ఇజ్రాయెల్ దౌత్య సిబ్బంది లో ఒకరి భార్యను చంపటమే టార్గెట్ గా మాగ్నెటిక్ బాంబును పేల్చింది. అయితే ఇండియన్లే టార్గెట్ గా పాకిస్ధాన్ మాగ్నెటిక్ బాంబును ప్రయోగించటం మాత్రం ఇదే మొదటిసారి.
అమర్నాథ్ యాత్రలోని భక్తులను చంపేందుకు పాకిస్తాన్ ఈ బాంబులను మన భూభాగంలోకి పంపినట్లు భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. చార్ దామ్ లో ప్రారంభమయ్యే అమరనాథ్ యాత్రికుల బస్సులకు అమర్చి పేల్చి చంపేందుకే పాకిస్ధాన్ వీటిని ఇండియాలోని తమ వాళ్ళకు పంపినట్లుంది. కాకపోతే భద్రతా దళాల కంటపడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. అసలు వీటిని మొదటిసారిగా ఉపయోగించింది తాలిబన్లు. ఆఫ్ఘనిస్థాన్లోని అమెరికా సైన్యాలను చంపేందుకు తాలిబన్లు అప్పట్లో బాగా ఉపయోగించేవారు.
మాగ్నెటిక్ బాంబులను కార్లకు అంటించేసి పదుల సంఖ్యలో అమెరికన్లు ప్రయాణించే కార్లను తాలిబన్లు పేల్చేసేవారు. 25 డాలర్లతో తయారయ్యే ఈ బాంబులను మామూలు కారు మెకానిక్ షెడ్లలో కూడా తయారుచేసేయచ్చు. చిన్నడబ్బాలో పేలుడు పదార్ధాలను ఉంచి దానికి సెల్ ఫోన్ తో అనుసంధానిస్తారు. దీన్ని ఒక అయస్కాంతాన్ని అమర్చి తాము పేల్చాలని అనుకున్న వాహనంలో పెట్రోల్ ట్యాంక్ దగ్గర అతికిస్తారు. అప్పటికే సెల్ ఫోన్ అమర్చి ఉండటంతో దాన్ని నెంబర్ ను డయల్ చేయగానే మాగ్నెటిక్ బాంబు పేలిపోతుంది. సో ఇదే పద్దతిని ఇండియాలో కూడా పాకిస్ధాన్ ప్రయోగించేందుకు రెడీ అయింది.
This post was last modified on May 30, 2022 3:58 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…