ఒక దేశపు ఆర్థిక స్తోమతను రెండు రకాలుగా కొలుస్తారు. మొదటిదేమో ఆ దేశం దగ్గరున్న విదేశీ మారకపు నిల్వలు. ఇక రెండోదేమో ఆ దేశం దగ్గరున్న బంగారం నిల్వలు. విదేశీ మారకద్రవ్య నిల్వలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. అలాగే బంగారం నిల్వలు కూడా అటు ఇటు అవుతుంటాయి. కానీ ఎంత ఎక్కువగా ఉంటే ఆ దేశపు ఆర్థిక స్తోమత అంతగా ఉన్నట్లు ఆర్ధిక నిపుణులు చెబుతుంటారు.
ఇపుడిదంతా ఎందుకంటే మనదేశంలోని బంగారం నిల్వలు సుమారుగా 760 టన్నులున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా రిజర్వ్ బ్యాంకే ప్రకటించింది. విదేశీ మారకద్రవ్య నిల్వలను అయినా బంగారం నిల్వలను అయినా మన దేశంలో రిజర్వ్ బ్యాంకే నియంత్రిస్తుందన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ పరిణామాలు, ద్రవ్యోల్బణం సమస్యలను అధిగమించేందుకు మన ప్రభుత్వం బంగారం నిల్వలనే నమ్ముకుంది. 2020 జూన్-2021 మార్చి మధ్య ఆర్బీఐ 33.9 టన్నుల బంగారాన్ని కొన్నది.
అలాగే 2022 మార్చి నెలాఖరులోగా మరో 65 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. 2022 మార్చి నెలాఖరుకు తన దగ్గర 760. 42 టన్నుల బంగారం ఉన్నట్లు ప్రకటించింది. ఈ బంగారం నిల్వల ప్రస్తుత మార్కెట్ ధర రూ. 3.22 లక్షల కోట్లుగా లెక్క తేలింది. అమెరికా కరెన్సీ డాలర్ విలువను తట్టుకోవాలంటే బంగారం నిల్వలను పెంచుకోవడం ఒకటే మార్గమని ఆర్బీఐ గట్టిగా నమ్మింది. అందుకనే ఎప్పటికప్పుడు బంగారం నిల్వలను కొనుగోలు చేస్తోంది.
తన దగ్గరున్న నిల్వల్లో 453 టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ దగ్గర డిపాజిట్ చేసింది. 296 టన్నుల బంగారం నిల్వలను బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్ దగ్గరుంది. విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో బంగారం విలువ 2021 లెక్కల ప్రకారం 5.88 శాతం ఉంటే 2022 మార్చి చివరకు 7.01 శాతంకు చేరుకుంది. ఇపుడు శ్రీలంకలో ఇలాంటి పరిస్ధితులు తల్లకిందులైపోయిన కారణంగానే దేశం దివాలా తీసింది. దేశం దివాలా తీసిన విషయాన్ని స్వయంగా శ్రీలంక రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ నందకుమారే ప్రకటించటం ప్రపంచదేశాల్లో సంచలనంగా మారింది.
This post was last modified on May 28, 2022 11:00 am
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…