ప్రఖ్యాత టాటీ గ్రూప్ డిజిటల్ రంగంలోకి అడుగులు వేసింది. కొత్తగా `టాటా న్యూ` పేరుతో ఒకసూపర్ యాప్‌ను తీసుకువచ్చింది. ఇప్పటి వరకు ఉన్న ఫోన్ పే, గూగుల్‌లకు మించి.. ఇది సేవలను అందించేందుకు సిద్ధమైంది. వాస్తవానికి టాటా గ్రూప్ దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యం. టాటా కంపెనీలు ఉప్పు నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు చాలా రకాల ఉత్పత్తుల విక్రయంతోపాటు సాఫ్ట్‌వేర్ నుంచి విమానయానం వరకు పలు రకాల సేవలంది స్తున్నాయి. ఇక, ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఒకే వేదిక ద్వారా గ్రూప్ సంస్థల అన్ని ఉత్పత్తులు, సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ‘టాటా న్యూ’ పేరుతో సూపర్ యాప్‌ను ఈ గ్రూప్ డిజైన్ చేసింది.
ఈ యాప్ ద్వారా యూపీఐ ఆధారిత చెల్లింపులు, బిల్లుల చెల్లింపులు, రుణ, బీమా సేవలతోపాటు ఫుడ్ డెలివరీ సర్వీసులను సైతం అందిస్తారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లతోపాటు కంపెనీ వెబ్‌సైట్ ‘టాటాడిజిటల్.కామ్’లోనూ ఈ యాప్ అందుబాటులో ఉంటుందని టాటా డిజిటల్ వెల్లడించింది. గ్రూప్‌నకు చెందిన ఎయిర్ ఏషియా, బిగ్‌బాస్కెట్, క్రోమా, ఐహెచ్‌సీఎల్, క్యూమిన్, స్టార్‌బక్స్, టాటా 1ఎంజీ, టాటా క్లిక్, టాటా ప్లే, వెస్ట్‌సైడ్ ఈ యాప్ ద్వారా అందుబాటులోకి తెచ్చారు. విస్తారా ఎయిర్‌లైన్స్, ఎయిరిండియా, టైటాన్, తనిష్క్, టాటా మోటార్స్ సేవలు, ఉత్పత్తులు సైతం త్వరలోనే అందుబాటు లోకి రానున్నాయి.
అయితే, టాటా న్యూ యాప్ సేవలు వినియోగించుకునేవారు ఇప్పటికే తమ మొబైల్లో ఉన్న బిగ్‌బాస్కెట్, 1ఎంజీ, ఎయిరిండియా యాప్‌లను అన్ఇస్టాల్ చేయాల్సి ఉంటుందా లేక టాటా న్యూ యాప్‌తో ఈ యాప్‌లన్నీ ఆటోమెటిక్‌గా అనుసంధానం అవుతాయా..? అన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు. టాటా గ్రూప్ గత ఏడాది కాలంగా ఈ సూపర్ యాప్‌పై పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ యాప్ న్యూకాయిన్స్ పేరుతో రివార్డులను కూడా ఆఫర్ చేస్తుంది. ఒక న్యూకాయిన్ ఒక రూపాయితో సమానం.
పలు ఈ-కామర్స్ కంపెనీల కొనుగోలు..సూపర్ యాప్ అభివృద్ధి వ్యూహంలో భాగంగా టాటా డిజిటల్ ఈమధ్యకాలంలో పలు ఈ-కామర్స్ కంపెనీలను కొనుగోలు చేసింది. గత ఏడాది మే నెలలో బిగ్‌బాస్కెట్‌ను, ఆ తర్వాత నెలలో క్యూర్‌ఫిట్ హెల్త్‌కేర్, ఆన్‌లైన్ ఫార్మసీ పోర్టల్ 1ఎంజీలో మెజారిటీ వాటాలు దక్కించుకుంది. కరోనా సంక్షోభంతో దేశంలో ఆన్‌లైన్ షాపింగ్‌కు డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. 2020లో 4,620 కోట్ల డాలర్ల స్థాయిలో ఉన్న భారత ఈ-కామర్స్ మార్కెట్.. 2025 నాటికి 11,140 కోట్ల డాలర్ల స్థాయికి, 2030 నాటికి 35,000 కోట్ల డాలర్లకు చేరుకోవచ్చని బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ అంచనా వేసింది.
This post was last modified on April 9, 2022 2:42 pm
టాలీవుడ్ లో సంగీత దర్శకుల కొరత గురించి చెప్పనక్కర్లేదు. తమన్, దేవిశ్రీ ప్రసాద్ ని అందరూ తీసుకోలేరు. పైగా వాళ్ళు…
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన ఆటతో మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంతో కూడా నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు.…
2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో స్కామ్ జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న…
ఈ టెక్ జమానాలో ఆడియో, వీడియో ఎడిటింగ్ లు పీక్ స్టేజికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక, ఏఐ, డీప్…