Trends

రష్యాలో తిరుగుబాటు తప్పదా ?

ఉక్రెయిన్ నేపథ్యంలో తొందరలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై తిరుగుబాటు తప్పదా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. గడిచిన 30 రోజులుగా ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేస్తోంది. ఉక్రెయిన్ లెక్కల ప్రకారం 15 వేల మంది సైనికులు చనిపోయారు. రష్యా సైన్యం దెబ్బకు ఉక్రెయిన్ దాదాపు సర్వ నాశనమైపోయింది. దేశంలోని ఆరు కీలక నగరాల్లో దాదాపు నేల మట్టమైపోయాయి.

ఇంకా ఎన్ని రోజులు ఈ యుద్ధం జరుగుతుందో ఎవరికీ తెలీదు. అందుకనే రష్యాలోనే పుతిన్ పై వ్యతిరేకత పెరిగిపోతోంది. అనాలోచితంగా ఉక్రెయిన్ పై యుద్ధం మొదలు పెట్టిన కారణంగానే రష్యా కూడా దారుణంగా నష్టపోతోంది. దీన్నే రష్యన్లు సహించలేకపోతున్నారు. పైగా రష్యా సైన్యంలోని ఉన్నతాధికారులకు+ సైన్యానికి కూడా ఉక్రెయిన్ పై యుద్ధం చేయటం ఏమాత్రం ఇష్టం లేదు. అయినా పుతిన్ నిర్ణయాన్ని వ్యతిరేకించలేక యుద్ధానికి దిగారు.

విచిత్రమేమిటంటే ఈ యుద్ధంలో చిట్టెలుక లాంటి ఉక్రెయిన్ నష్టపోవటం చాలా సహజం. కానీ రష్యా తరఫున ఇద్దరు మేజర్ జనరళ్ళతో పాటు ఐదుగురు జనరల్ స్ధాయి సైనిక అత్యున్నత అధికారులు మరణించారు. ఈ కారణంగానే అత్యున్నత సైనికాధికారులు పుతిన్ పై మండిపోతున్నారట. యుద్ధం ఇలాగే మరికొద్ది రోజులు కంటిన్యూ అయితే ప్రజలే తిరుగుబాటు లేవదీసినా ఆశ్చర్యంలేదని పాశ్యాత్య మీడియా కథనాలిచ్చింది.

అసలు అంతంత మాత్రంగా ఉన్న రష్యా ఆర్థిక పరిస్థితి యుద్ధం కారణంగా పాతాళానికి దిగజారిపోయింది. దీని ప్రభావం పుతిన్ ప్రతిష్టను బాగా దెబ్బతీసింది. ప్రపంచదేశాలన్నీ రష్యా నుండి తమ వ్యాపారాలను తరలించుకుపోవటం, పరిశ్రమలను మూసేశాయి. అలాగే ప్రపంచ దేశాలు రష్యాపై విధించిన ఆర్థిక ఆంక్షలు దేశాన్ని దారుణంగా దెబ్బతీశాయి. రష్యాను ప్రపంచ దేశాలు దాదాపుగా వెలేసినట్లయ్యింది. దీన్ని రష్యన్లు ఏ మాత్రం తట్టుకోలేకపోతున్నారు. ఇదంతా చూసిన తర్వాత రష్యాలోని వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, సైన్యంలోని ఉన్నతాధికారులు, మామూలు జనాలు ఏకమైతే పుతిన్ పై తిరుగుబాటు తప్పదనే సంకేతాలు కనబడుతున్నాయి. మరి చివరకు ఏమవుతుందో ?

This post was last modified on March 27, 2022 2:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రభాస్ ఇమేజ్ సరిపోవట్లేదా రాజా?

మాములుగా ప్రభాస్ కొత్త సినిమా వస్తోందంటే ఆ యుఫోరియా వేరే లెవెల్ లో ఉంటుంది. సలార్ కు పెద్దగా ప్రమోషన్లు…

5 minutes ago

జగన్ కోటి సంతకాల కృషి ఫలించేనా?

రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించేందుకు వ్యతిరేకంగా వైసీపీ నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కోటి…

19 minutes ago

మారిపోయిన దేవర విలన్

బాలీవుడ్ స్టార్లు ప్రైవేటు పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేయడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. అందుకోసం భారీగా పారితోషకాలు అందుకుంటూ ఉంటారు. షారుఖ్…

2 hours ago

‘ఫ్యామిలీ స్టార్’ను మరిచావా మృణాల్?

సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…

4 hours ago

లోక్‌స‌భ‌లో రచ్చ‌ జరిగినా ఆగని బిల్లు

పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాలు శుక్ర‌వారం(రేపు)తో ముగియ‌నున్నాయి. ఈ స‌మావేశాల్లో చివ‌రి రెండో రోజైన గురువారం రాజ‌కీయ వేడి లోక్‌స‌భ‌ను కుదిపేసింది.…

4 hours ago

శేష్ గోల్డ్ ఫిష్… ఈసారి ఎదురీదగలదా ?

రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…

4 hours ago