ఉక్రెయిన్ పై గడచిన 24 రోజులుగా జరుగుతున్న యుద్ధంలో నుండి ఎలా బయటపడాలో అర్ధంకాక రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యోచిస్తున్నారు. చిట్టెలుక లాంటి ఉక్రెయిన్ తో అసలు ఇన్ని రోజులు యుద్ధం జరగనేకూడదు. పైగా ఈ యుద్ధంలో ఉక్రెయిన్ నష్టపోవటం మాట పక్కన పెడితే రష్యాకు కూడా భారీ నష్టాలు ఎదురయ్యాయి. అంత పెద్ద దేశం రష్యాతో యుద్ధం జరిగినపుడు చిన్నదేశం ఉక్రెయిన్ కు నష్టాలు రావటం సహజమే.
ఇక్కడ గమనించాల్సిందేమంటే యుద్ధం మరి కొద్ది రోజులు కంటిన్యూ అయితే రష్యాకి పెద్ద ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో రష్యాకి వ్యతిరేకంగా పెద్ద దుమారం రేగుతోంది. అవసరం లేకపోయినా చాలా దేశాలు ఉక్రెయిన్ పై సానుభూతి చూపిస్తుండటమే కాకుండా నిధులు సమకూర్చటమో లేకపోతే ఆయుధాలు అందించటమో చేస్తున్నాయి. దీనివల్లే రష్యాను ఇన్ని రోజులుగా ఉక్రెయిన్ ప్రతిఘటించగలుగుతొంది.
యుద్ధం విషయంలో రష్యాలో జనాల నుండి కూడా పుతిన్ పై వ్యతిరేకత పెరిగిపోతోంది. అందుకనే యుద్ధం విరమణకు తన ముందున్న మార్గాలను పుతిన్ ఆలోచిస్తున్నారు. ఇపుడు గనుక యుద్ధాన్ని ముగించకపోతే రష్యాలో కూడా పుతిన్ ప్రతిష్ట మరింతగా మసకబారి పోవడం ఖాయం. అందుకనే గౌరవప్రదంగా యుద్ధం ముగింపుకు మార్గాలను పుతిన్ వెతుకుతున్నారట. ఇందులో భాగంగానే యుద్ధ విరమణకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ నుండి ప్రతిపాదన వచ్చేట్లుగా పుతిన్ ఒత్తిడి పెడుతున్నారు.
నాటో దేశాల్లో సభ్యత్వం తీసుకునేది లేదని ఇప్పటికే జెలెన్ స్కీ ప్రకటించున్నారు. ఇదే సమయంలో యురోపియన్ యూనియన్లో కూడా సభ్యత్వం తీసుకోమని జెలెన్ స్కీ చెప్పేశారు. నిజానికి ఇప్పటి యుద్ధానికి ఈ రెండు కూడా కారణాలే. అందుకనే జెలెన్ స్కీ వెనక్కి తగ్గాడు. అయితే యుద్ధ విరమణకు పుతిన్ ఆతురతను పసిగట్టిన జెలెన్ స్కీ మళ్ళీ సభ్యత్వాలు తీసుకోవటంపై మాట్లాడుతున్నారు. దాంతోనే సమస్య మళ్ళీ మొదటికొస్తోంది. మరి పుతిన్ అనుకుంటున్నట్లుగా యుద్ధ విరమణకు గౌరవప్రదమైన మార్గం ఎప్పుడు కనబడుతుందో ఏమో.
This post was last modified on March 19, 2022 2:07 pm
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…