Trends

సెంటిమెంటును ప్రయోగిస్తున్న జెలెన్ స్కీ

రష్యా సైన్యం నుంచి దేశాన్ని రక్షించుకునేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాడు. అమెరికాలోని చట్టసభల సభ్యులతో దాదాపు గంటకుపైగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వీడియోకాల్లో  మాట్లాడాడు. ఈ సందర్భంగా జెలెన్ స్కీ మాట్లాడుతూ బహుశా తనను సజీవంగా చూడటం ఇదే చివరిసారి కావచ్చన్నారు. తమపై రష్యా అన్యాయంగా దురాక్రమణకు దిగిందని ఆరోపించారు.

రష్యాను ఎదుర్కొనేందుకు తమకు వెంటనే యుద్ధ విమానాలు, ఆయుధాలు కావాలని కోరారు. రష్యా మీద ఆంక్షలను మరింత కఠినతరం చేయాలన్నారు. అమెరికా చట్టసభ సభ్యులతో మాట్లాడటం ఇదే చివరిసారి కావచ్చన్నారు. దీంతో చట్టసభ సభ్యుల్లో ఉద్వేగం తొంగిచూసింది. జెలెన్ స్కీకి కావాల్సింది కూడా ఇదే. ఎందుకంటే రష్యాపై ఉక్రెయిన్ అధ్యక్షుడు తొడకొట్టింది అమెరికా నేతృత్వంలోని నాటో దేశాల మద్దతు చూసుకునే.

అయితే యుద్ధం మొదలైన తర్వాత అమెరికా, నాటో దేశాలు వెనక్కు తగ్గాయి. యుద్ధం మొదలైన నాలుగోరోజు అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ కొన్ని ఆయుధాలను, డబ్బును సర్దుబాటు చేసింది కానీ ఇంతవరకు తమ దేశాల నుండి సైనికులను మాత్రం పంపలేదు. ఇక్కడే ఉక్రెయిన్ బాగా ఇబ్బందులు పడిపోతోంది. రష్యా రక్షణ బలగం ముందు ఉక్రెయిన్ బలం దాదాపు నామమాత్రమనే చెప్పాలి. ఇపుడు ఉక్రెయిన్ పై రష్యా నామమాత్రపు సైన్యంతోనే 11 రోజులుగా యుద్ధం చేస్తోంది.

రష్యాయే గనుక పూర్తిస్ధాయి సైన్యంతో యుద్ధం చేసుంటే మూడు రోజుల్లోనే ముగిసిపోయుండేది. ఇదే సమయంలో ఉక్రెయిన్ నామరూపాలు లేకుండా పోయుండేదనటంలో సందేహమే లేదు. పరిమిత సైన్యంతో చేస్తున్న యుద్ధంలోనే ఉక్రెయిన్లోని కీలక నగరాలు దాదాపు ధ్వంసం అయిపోయాయి. ఈ నేపధ్యంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు నాటో దేశాల విషయంలో ఒకవైపు తీవ్రమైన అసంతృప్తితోను మరోవైపు నిస్సహాయతతో నలిగిపోతున్నారు. రష్యా దాడులను తట్టుకోలేక నాటో దేశాల బలగాలను తెప్పించుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. అందుకనే సెంటిమెంటు అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు.

This post was last modified on March 7, 2022 1:41 pm

Share

Recent Posts

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

1 hour ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

1 hour ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

3 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

5 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

6 hours ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

6 hours ago