Trends

ఉక్రెయిన్ మెడికల్ విద్యర్ధులకు శుభవార్త

ఉక్రెయిన్లో మెడిసిన్ చదువుతున్న విద్యార్ధులకు కేంద్రప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉక్రెయిన్లో యుద్ధం కారణంగా వేలాదిమంది విద్యార్ధులు తిరిగి మనదేశానికి వచ్చేస్తున్నారు. మనదేశం నుండి ఉక్రెయిన్కు వెళుతున్న విద్యార్ధుల్లో అత్యధికులు మెడిసిన్ చదవటానికే వెళుతున్నారు. ఆదేశంలో మెడిసిన కోర్టు ఆరేళ్ళు. తర్వాత రెండేళ్ళు పీజీ చదవాలి. అంటే ఎనిమిదేళ్ళు చదవాల్సిందే. తర్వాత సదరు విద్యార్ధులు మనదేశంలో డాక్టర్ గా ప్రాక్టీసు చేయాలంటే ఇక్కడ నిర్వహించే స్క్రీనింగ్ టెస్టుకు అప్పియరై పాసవ్వాల్సుంటుంది.

ప్రస్తుతం యుద్ధం కారణంగా చదవులు వదిలేసిన వేలాదిమంది మెడిసిన్ విద్యార్ధులు అర్ధాంతరంగా దేశానికి వచ్చేశారు. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలీదు. యుద్ధం ముగిసినా పూర్వపరిస్ధితి ఎప్పటికి వస్తుందో తెలీదు. ఎందుకంటే రష్యా దాడుల కారణంగా చాలా నగరాలు నేలమట్టమైపోయాయి. ఈ దాడుల్లో కాలేజీలు కూడా ధ్వంసమైపోయుంటాయి. కాబట్టి యుద్ధం ఆగిపోయినా కాలేజీలు తెరిచే అవకాశాలు దాదాపు తక్కువే. మళ్ళీ కాలేజీలు తెరవాలంటే చాలాకాలం పడుతుంది.

సో ఇఫుడిపుడే విద్యార్ధులు ఉక్రెయిన్ కు వెళ్ళి చదువుకునే అవకాశాలు దాదాపు లేదు. అందుకనే వీళ్ళ చదవు దెబ్బతినకుండా కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది. ఎంబీబీఎస్, పీజీ చేస్తున్న విద్యార్ధులను దేశంలోని ప్రైవేటు కాలేజీల్లో సర్దుబాటు చేయాలని కేంద్రం డిసైడ్ అయ్యింది. ఈ విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు నేషనల్ మెడికల్ కమీషన్, నీతిఅయోగ్, విదేశీ వ్యవహారాలు, వైద్యఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో కమిటి వేసింది.

విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇపుడున్న నిబంధనలను సడలించాలని కూడా కేంద్రం ఆదేశించింది. అయితే ఇక్కడో సమస్య మొదలవుతుంది. ఉక్రెయిన్ బాధితు విద్యార్ధులందరినీ ప్రైవేటుకాలేజీల్లో చేర్పించాలన్నది కేంద్రం ఆలోచన. అదే నిజమైతే కాలేజీ యాజమాన్యాలు డొనేషన్లు లేకుండా వీళ్ళని చేర్చుకుంటాయా ? మరో నాలుగైదు నెలలైపోతే ఎంబీబీఎస్, పీజీ చదవు అయిపోయేదని ఉక్రెయిన్లోని చాలామంది విద్యార్ధులు చెప్పారు. మరిపుడు వీళ్ళని మధ్యలో చేర్చుకుంటే మళ్ళీ వీళ్ళు మొదటినుండి చదవాల్సిందేనా ? అనే విషయంలో క్లారిటిలేదు. చూద్దాం ఉన్నతస్ధాయి కమిటి ఏమి చెబుతుందో ?

This post was last modified on March 5, 2022 3:58 pm

Share

Recent Posts

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

2 hours ago

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

3 hours ago

పెద్ద గండం దాటేసిన రణబాలి

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…

4 hours ago

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

6 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

8 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

9 hours ago