“ఇంత దురదృష్టకరమైన అధ్యక్షుడిని మేం ఎప్పుడూ చూడలేదు. ఇంత తీవ్ర సమయంలో ఆయన ఏం చేస్తున్నారు?“ ఇదీ.. అమెరికా ప్రజల మాట. రష్యా దూకుడుతో చివురుటాకులా ఒణికి పోతున్న ఉక్రెయిన్‌ను రక్షించాలని.. అమెరికా ప్రజలు సైతం రోడ్లమీదకు వచ్చారు. ఎక్కువ మంది ప్రజలు సోషల్ మీడియాలో అధ్యక్షుడు బైడెన్‌పై నిప్పులు చెరుగుతున్నారు. `ఇది గుడ్డి పాలన.. అంధ నిర్ణయాలకు వేదికగా మారింది. బైడెన్ చెత్త అధ్యక్షుడు“ అంటూ.. కామెంట్లు కుమ్మరిస్తున్నారు. మరికొందరు ఈ సమయంలో గత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఉంటే బాగుండేదని వ్యాఖ్యానిస్తున్నారు. ట్రంప్‌ను వదులుకుని తప్పు చేశామని.. చాలా చోట్ల ప్లకార్డులు ప్రదర్శించడం గమనార్హం.
ఇంతకీ.. బైడెన్ ఏం చేశారు?
ఆది నుంచి ఉక్రెయిన్‌కు మద్దతు మాట్లాడుతూ.. వచ్చిన బైడెన్ చివరకు యుద్ధం జరుగుతున్న సమయంలో చేతులు ఎత్తేశారు. ఉక్రెయిన్ నాటో సభ్య దేశం కాదని.. అందుకే తాము రష్యాపై యుద్ధం చేయబోమని తేల్చి చెప్పారు.. ఇదే అమెరికన్లను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. ఒక్క అమెరికన్లకే కాదు.. ఉక్రెయిన్ మద్దతు దారు దేశాలుగా ఉన్న చోట్ల కూడా ప్రజలు బైడెన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. బైడెన్ తక్షణమే గద్దె దిగాలని.. కొన్ని దేశాల్లో డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్ చేసుకున్న పాపం ఏంటని.. ప్రశ్నించారు.
మాకు సంబంధం లేదు!
ఉక్రెయిన్పై దండయాత్ర చేస్తున్న రష్యా.. నాటో సభ్య దేశాలవైపు దూసుకొస్తే అమెరికా రంగంలోకి దిగుతుందని హెచ్చరించారు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్. పుతిన్ను ఇప్పుడు ఆపకపోతే మరింత రెచ్చిపోతాడని పేర్కొన్నారు. రష్యాపై ఆంక్షలు విధించిన అనంతరం ఈమేరకు శ్వేతసౌధంలో మాట్లాడారు.
పుతిన్‌తో మాట్లాడను!
“ఒకవేళ పుతిన్.. నాటో సభ్య దేశాల వైపు వెళ్తే మేం జోక్యం చేసుకుంటాం. నేను ఒప్పకునే ఏకైక విషయం ఏమిటంటే.. పుతిన్ను ఇప్పుడు ఆపకపోతే అతని ధైర్యం మరింత పెరుగుతుంది. అతనికి వ్యతిరేకంగా చర్యలు చేపట్టకపోతే మరింత రెచ్చిపోతాడు. అందుకే రష్యాపై అత్యంత కఠిన ఆంక్షలు విధిస్తున్నాం. తూర్పు ఐరోపా దేశాలకు అవసరమైన బలగాలను సమకూర్చడం ద్వారా ఇది పెద్ద ఘర్షణకు దారీతీయదని మేము భావిస్తున్నాం. నాటో దేశాలు గతంలో ఎన్నడులేనంత ఐక్యంగా ఉన్నాయి. పుతిన్తో మాట్లాడే ఆలోచన నాకు లేదు. ఆయన సోవియట్ యూనియన్ను తిరిగి స్థాపించాలనుకుంటున్నారు. అందుకే ఇలాంటి చర్యలకు దిగుతున్నారు. ప్రపంచంలోని ప్రస్తుత పరిస్థితులకు అతని ఆలోచనలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.“ అని బైడెన్ వ్యాఖ్యానించారు.
నాటో సభ్య దేశాల రక్షణ కోసం తూర్పు ఐరోపాకు అమెరికా అదనపు బలగాలను పంపిందని బైడెన్ వెల్లడించారు. ఉక్రెయిన్కు మాత్రం వెల్లడం లేదని స్పష్టం చేశారు. నాటో దేశాలను కాపాడేందుకే చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. శనివారం నాటో దేశాల సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. 30 దేశాలను సంఘటితం చేసి తదపరి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామన్నారు. నాటో కూటమిని మరింత శక్తమంతం చేస్తామన్నారు. నాటో దేశాల భూభాగాల్లోని ప్రతి అంగుళాన్ని కాపడతామని తేల్చి చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే బైడెన్పై తీవ్రస్థాయిలో వ్యతిరేకత పెల్లుబుకడం గమనార్హం.
This post was last modified on February 26, 2022 8:26 am
నిజమే. కేవలం రూ.500 లను పెట్టుబడిగా పెట్టిన ఆ ట్రక్కు డ్రైవర్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. ఇదేదో ఎక్కడో…
అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్.. ఇలా వరుసగా నందమూరి బాలకృష్ణ చిత్రాలకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమనే…
పెట్టుబడులను రాబట్టేందుకు ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్లిన తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి రెండో రోజే ఫలితం రాబట్టారు.…
ఏపీలో అధికార కూటమిలో కీలక పార్టీగా ఉన్న జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోని రాజకీయా…
2023 సంక్రాంతికి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన వీరసింహారెడ్డి దర్శకుడు గోపీచంద్ మలినేని మరోసారి బాలకృష్ణతో చేతులు కలపబోతున్నారు. త్వరలో…
గత ఏడాది రాజకీయాల కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రేక్ తీసుకున్న టైంలో ఆయన చేతిలో మూడు చిత్రాలున్నాయి.…