ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించింది. ఉక్రెయిన్ కతేంటో చూడాలని అనుకున్న రష్యా సైనిక చర్యకు రష్యా అధ్యక్షుడు పుతిన్ అనుమతించారు. దీనికి ప్రతిచర్యగా ఉక్రెయిన్ కూడా దాడికి సిద్ధమైపోయింది. తమ ఎయిర్ స్పేస్ ను ఉక్రెయిన్ మూసేసింది. ఒకవైపు ఉక్రెయిన్ కు మూడు వైపులా తన సైన్యాలను, యుద్ధ ట్యాంకులను, క్షిపణులను రష్యా అధ్యక్షుడు పుతిన్ మోహరిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 2 లక్షల సైన్యం ఉక్రెయిన్ను మూడువైపులా చుట్టుముట్టేశాయి. దీంతో ఉక్రెయిన్ పై రష్యా మిలిటరీ ఆపరేషన్ మొదలైందని స్వయంగా పుతినే ప్రకటించారు.
ఇదే సమయంలో ఉక్రెయిన్ కూడా తెగిస్తే తప్ప లాభం లేదని అనుకున్నట్లుంది. అందుకనే తనకున్న సైన్యాలకు ఎదురు దాడులు చేయమని ఆదేశించింది. నిజానికి సైనికపరంగా రష్యా ముందు ఏ విధంగా తీసుకున్నా ఉక్రెయిన్ సరిపడదని అందరికీ తెలుసు. కాకపోతే ఉక్రెయిన్ కు ధైర్యం ఏమిటంటే తనకు మద్దతుగా దిగిన నాటో దళాలే. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, పోలండ్ లాంటి దేశాల సైన్యాలు ఉక్రెయిన్ కు మద్దతుగా ఇప్పటికే ఉక్రెయిన్లోకి దిగేశాయి.
ఒక్క ఉక్రెయిన్లోనే కాకుండా రష్యా చుట్టుపక్కల దేశాల్లో కూడా నాటో దేశాల సైన్యం సర్వసిద్ధంగా దిగేశాయి. ఇదే సమయంలో దేశంలో నెల రోజుల పాటు ఉక్రెయిన్ ఎమర్జెన్సీ విధించింది. రష్యా సరిహద్దుల్లోని తన పౌరులను ఉక్రెయిన్ సురక్షిత ప్రాంతాలకు తీసుకెళిపోతోంది. దేశంలోని కీలక ప్రాంతాలన్నింటినీ సైన్యం తన చేతుల్లోకి తీసుకుంటోంది. సమస్యలను దౌత్యపరంగా పరిష్కరించుకోవటం ప్లాన్ ఏ అయితే తప్పనిసరిగా యుద్ధానికి దిగటం ప్లాన్ బీ. చివరకు ప్లాన్ బీ కే రష్యా మొగ్గుచూపింది.
ఉక్రెయిన్ సైన్యం సుమారుగా 2.5 లక్షలుంటుంది. రిజర్వ్ సైన్యం మరో 1.5 లక్షలుంది. ఇదే సమయంలో రష్యా సైన్యం సుమారు 16 లక్షలుంది. వైమానిక దళం, క్షిపణి వ్యవస్ధ, యుద్ధట్యాంకులు, ఇతరత్రా మిసైల్ గైడెడ్ క్షిపణి వ్యవస్ధ కూడా ఉక్రెయిన్ కు అందనంత ఎత్తులో రష్యా ఉంది. అయినా సరే రష్యాను చాలెంజ్ చేస్తోందంటే తనవెనకున్న నాటో దళాలను చూసుకునే అని అర్ధమవుతోంది. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.
యద్ధం నేపథ్యంలో కొన్ని రోజులుగా స్టాక్ మార్కెట్లు పతనంలో ఉన్నాయి. తాజాగా యుద్ధ ప్రకటన నేపథ్యంలో మరింత దారుణంగా కుప్పకూలాయి. ఈరోజు ఇండియన్ మార్కెట్లు అత్యంత ఎక్కువ ఫాల్ చూసింది. 3 శాతానికి పైగా నిఫ్టీ కుప్పకూలడం అసాధారణ విషయం అని చెప్పొచ్చు. చరిత్రలో అతి తక్కువ సార్లు మాత్రమే ఇలా జరిగింది.
This post was last modified on %s = human-readable time difference 11:05 am
ఏపీ సీఎం చంద్రబాబు అంటే రాష్ట్రంలోని మహిళలకు ప్రత్యేకమైన గౌరవం ఉన్న సంగతి తెలిసిందే. డ్వాక్రా సంఘాలను ఏపీ మహిళలకు…
విశాఖకు మణిహారంగా ఉన్న రుషికొండపై ప్రజాధనాన్ని వ్యర్థం చేస్తూ ప్యాలెస్ ను మాజీ సీఎం జగన్ నిర్మించుకున్న సంగతి తెలిసిందే.…
దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ వెలిగిపోతోంది. కన్నడ అనువాదం ‘బఘీర’ను మినహాయిస్తే మూడు సినిమాలూ బాక్సాఫీస్ దగ్గర బాగా సందడి చేస్తున్నాయి.…
ఆగస్టు 15 వీకెండ్లో ‘స్త్రీ-2’ అనే మిడ్ రేంజ్ సినిమా ఒకటి రిలీజైంది. దాంతో పాటు అక్షయ్ కుమార్ ముఖ్య…
తెలంగాణ రాజకీయాలు రసపట్టుగా మారుతున్నాయి. ఇప్పుడు రాజకీయం అంతా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల మధ్య జరుగుతుందనుకుంటున్న తరుణంలో…
పటాసుల పండగ అయిపోయింది. బాక్సాఫీస్ మతాబులు పెద్ద శబ్దం చేస్తూ భారీ ఎత్తున ట్రేడ్ కు సంబరాలు తెచ్చిపెట్టాయి. వందల…