నిజంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చాలా ధైర్యం చేసిందనే చెప్పాలి. ముంబాయి ని ఏలుతున్న మాఫియా సామ్రాజ్యంలోని కీలక వ్యక్తుల ఇళ్ళు, కార్యాలయాలపై దాడులు జరిపింది. సంవత్సరాల తరబడి మాఫియా సామ్రాజ్యంలోకి కీలక వ్యక్తులు వందలు, వేల కోట్ల రూపాయల అక్రమార్జన చేస్తున్నారు. ఉన్నతాధికారులు, రాజకీయ నేతలు, సెలబ్రిటీలు, వ్యాపార, పారిశ్రామికవేత్తలను బెదిరించి, కిడ్నాప్ చేసి, హత్యలు చేసి తాము అనుకున్నంత డబ్బును యధేచ్చగా సంపాదించుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే.
పైకి నలుగురికి చెప్పుకోవాటనికి ఏదో వ్యాపారాలు చేస్తున్నట్లు షో చేస్తుంటారు. కానీ జరిగేదంతే చట్ట వ్యతిరేక కార్యకలాపాలే అని అందరికీ తెలుసు. అయినా ఎవరూ వాళ్ళ వైపు కనీసం కన్నెత్తి కూడా చూడరు. కేంద్రంలో, మహారాష్ట్రలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా జరుగుతున్నది మాత్రం దశాబ్దాలుగా ఇదే. ఇందుకనే దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్ లాంటి వాళ్ళు కొందరు యువత దృష్టిలో హీరోలైపోయారు. గతంలో వేర్వేరు కేసుల్లో దావూద్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది.
అలా స్వాధీనం చేసుకున్న భూములు, భవనాలను వేలానికి పెడితే కొనటానికి భయపడి ఎవరూ ముందుకు రాలేదు. తాజాగా దావూద్ పై జాతీయ దర్యాప్తు సంస్థ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దశాబ్దాలుగా దావూద్ అనేక రకాల నేరాలు చేస్తున్నా మొట్టమొదటిసారిగా ఎఫ్ఐఆర్ నమోదు కావడం గమనార్హం. దావూద్ కు చెందిన లేదా దావూద్ దగ్గరి బంధువులు, మద్దతుదారులవిగా గుర్తించిన ఇబ్రహీం కస్కర్, దివంగత హసీనా పార్కర్, చోటా షకీల్ లాంటి వాళ్ళకి చెందిన 10 చోట్ల ఈడీ ఉన్నతాధికారుల బృందాలు దాడులు చేశాయి.
దొరికిన ఆధారాల ప్రకారం మనీల్యాండరింగ్, హవాలా, ఎక్స్ టార్షన్ లాంటి అనేక కేసులు నమోదు చేశారు. ఇదే విషయమై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ దేశ భద్రత కోసం ఇలాంటి దాడులు చేయాల్సిందే అన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వాళ్ళపై దర్యాప్తు సంస్ధలు, విచారణ ఏజెన్సీలు కేసులు పెట్టాల్సిందే, కఠినంగా వ్యవహరించాల్సిందే అని స్పష్టంగా చెప్పారు. వీళ్ళ కార్యకలాపాలు అన్నీ తెలిసినా కేసులు పెట్టడానికే ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఇక యాక్షన్ తీసుకోవటానికి ఎంతకాలం పడుతుందో ?
This post was last modified on February 16, 2022 10:51 am
బీసీలంటే వెనక బడిన కులాలు కాదు బ్యాక్ బోన్ కులాలంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నానికి సుప్రీం కోర్టు తీర్పుతో ఆటంకం…
తమిళనాడు బై ఎలక్షన్లలో అధికార టీవీకే పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. శుక్రవారం ఉదయం కౌంటింగ్ మొదలైన తర్వాత తొలి…
ఇప్పుడు టాలీవుడ్లో చాలామంది యంగ్ హీరోలది ఒకటే మాట. తమ సినిమాలను ఎవరో పనిగట్టుకుని టార్గెట్ చేస్తున్నారని. తమ చుట్టూ…
థాయ్‌లాండ్ రాణి సుతిదా ఇప్పుడు యుద్ధ విమానం నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. 48 ఏళ్ల వయసులో గ్రిపెన్ ఫైటర్ జెట్‌ను…
కడుపున పుట్టిన బిడ్డకు వైద్యం చేయించేందుకు డబ్బులు లేక ఓ తల్లి చేసిన పని కలచివేస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆరేళ్ల…
యెమెన్ అంతర్గత యుద్ధం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ దళాలకు సౌదీ అరేబియా మద్దతునిస్తోంది. మరోవైపు, యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులు…