ఉక్రెయిన్ను ఆక్రమించేందుకు రష్యా దాదాపు డిసైడ్ అయిపోయింది. ఉక్రెయిన్ పై సైన్యాన్ని మోహరించటం ద్వారా ఆక్రమించుకోవాలని రష్యా చాలా స్పీడుగా ముందుకెళుతోంది. ఉక్రెయిన్ కు మూడు వైపులా తూర్పు ఉక్రెయిన్, బెలారస్, క్రిమియా వైపుల నుండి సైన్యాలను మోహరింపచేసింది. పై మూడు వైపుల్లో రష్యా సైన్యం భారీ ఎత్తున మోహరించటం శాటిలైట్ ఫొటొల్లో స్పష్టంగా కనబడుతోంది. దీంతో అమెరికాతో పాటు ఇతర దేశాల్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నది.
తన అమ్ములపొదిలో ఉన్న యుద్ధ ట్యాంకులను, శతఘ్నులు, క్షిపణిదళాలతో పాటు భారీ సైన్యాన్ని ఉక్రెయిన్ సరిహద్దుల్లోని మూడు వైపులకు మోహరించేసింది. దీంతో ఏ క్షణంలో అయినా రష్యా దళాలు దాడులు మొదలుపెట్టేయటం ఖాయమని అర్ధమైపోతోంది. ఒకసారి ఉక్రెయిన్ పై రష్యా దాడులు మొదలుపెడితే రష్యాకు వ్యతిరేకంగా మోహరించటానికి చాలా దేశాలు రెడీగా కాచుకుని కూర్చున్నాయి. దాంతో రష్యా వ్యతిరేక, అనుకూల దేశాలు తమ సైన్యాలను రెడీ చేసుకుంటున్నాయి.
రష్యా-ఉక్రెయిన్ మధ్య చాల సంవత్సరాలుగా వివాదలు నడుస్తునే ఉన్నాయి. ఒకపుడు యూఎస్ఎస్ఆర్ అంటే యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్టు రిపబ్లిక్ కుప్పుకూలిపోయింది. దాంతో యూఎస్ఎస్ఆర్ లో భాగంగానే ఉండే చాలా ప్రాంతాలు తర్వాత ఇండిపెండెంట్ దేశాలుగా స్వతంత్రం ప్రకటించుకున్నాయి. అలాంటి వాటిలో ఉక్రెయిన్ కూడా ఒకటి. ఉక్రెయిన్లో అపారమైన ఖనిజ నిక్షేపాలున్నాయి. పైగా ఉక్రెయిన్ సరిహద్దుల్లో నుండి చైనా, అమెరికా సైన్యాలు కూడా రష్యావైపు పొంచి చూస్తున్నాయి.
2014లో క్రిమియాను రష్యా ఆక్రమించేసుకుంది. ఇక బెలారస్ కు రష్యాకు మధ్య మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. కాబట్టే రష్యా వ్యూహాత్మకంగా క్రిమియా, బెలారస్ సరిహద్దుల్లో తన సైన్యాలను మోహరించింది. నిజానికి రష్యాతో పోల్చుకుంటే ఉక్రెయిన్ చాలా చిన్నదేశమనే చెప్పాలి. సైన్యపరంగా రష్యాను ఢీకొనేంత సీన్ ఉక్రెయిన్ కు లేదు. రష్యాలో అత్యంత శక్తమంతమైన దళం ఫస్ట్ ఫోర్స్, బ్యాక్ ఆర్మీ మాస్కోను దాటిరావు. అలాంటిది తాజా పరిణామాల్లో పై రెండు ఫోర్సులు ఉక్రెయిన్ సరిహద్దుల్లో క్యాంపేశాయట. దాంతో ఆక్రమణ లేదా యుద్ధానికి రష్యా రెడీగా ఉందని అర్ధమైపోతోంది.
This post was last modified on February 14, 2022 4:44 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…