మన దేశంలో మహిళలకు ఎనలేని గౌరవిస్తున్నామని, స్త్రీ అంటే ఆదిశక్తి స్వరూపమని, అబల కాదు సబల అని పొలిటిషన్లు, సెలబ్రిటీలు ఉపన్యాసాలలో ఎమోషన్ గా అంటుంటారు. అమ్మతనం అంటే చాలా గొప్పదని, మరణ వేదనతో సమానమైన ప్రసవవేదనను అనుభవిస్తూ భూదేవంత సహనాన్ని మాతృమూర్తులు కలిగి ఉంటారని గొప్పగా చెబుతుంటారు. గర్భవతులుగా ఉన్న మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే మనసున్న ఆటోవాలాలు కూడా ఉన్నారు.
అయితే, మహిళలను…ప్రత్యేకించి గర్భిణులను ఇంతగా గౌరవించే ఇటువంటి దేశంలో తాజాగా ఎస్ బీఐ జారీ చేసిన ఉత్తర్వులు తీవ్రంగా అవమానించేలా ఉండడం చర్చనీయాంశమైంది. మహిళా ఉద్యోగుల నియామకానికి సంబంధించి ఇటీవల ఎస్‌బీఐ జారీ చేసిన ఉత్తర్వులు వివాదాస్పదమయ్యాయి. ఎస్ బీఐలో ఉద్యోగానికి ఎంపికైన వారు అప్పాయింట్ మెంట్ డేట్ నాటికి మూడు నెలల గర్భిణులుగా ఉంటే ఉద్యోగంలో చేరేందుకు తాత్కాలికంగా అనర్హులు అవుతారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం చర్చనీయాంశమైంది.
అయితే, ఇది తాత్కాలికంగా మాత్రమేనని, వారు బిడ్డకు జన్మనిచ్చిన నాలుగు నెలల తర్వాత ఉద్యోగంలో చేరేందుకు అనుమతిస్తామని ఎస్ బీఐ పేర్కొంది. గత నెల 31న ఈ ఉత్తర్వులు జారీ చేయగా…తాజాగా ఈ వ్యవహారంపై ఢిల్లీ మహిళా కమిషన్ మండిపడుతోంది. ఎస్‌బీఐ జారీ చేసిన ఈ వివాదాస్పద ఆదేశాలపై ఢిల్లీ మహిళా కమిషన్ ఫైర్ అయింది. ఈ ఆదేశాలు చట్టవిరుద్ధమని, వివక్షాపూరితంగా ఉన్నాయని పేర్కొంది.
ఈ మహిళా వ్యతిరేక ఉత్తర్వులను ఎస్ బీఐ తక్షణమే వెనక్కి తీసుకోవాల్సిందిగా ఎస్ బీఐను ఆదేశించామని డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ ట్వీట్ చేశారు. దీంతో, ఈ ఉత్తర్వులపై నెటిజన్లు మండిపడుతున్నారు. పక్క దేశాల్లో మెటర్నిటీ లీవ్ లు పెంచుతూ పోతుంటే..మన దేశంలో మాత్రం ఈ రకంగా వివక్షా పూరితంగా వ్యవహరిస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. మరి, ఈ వ్యవహారంపై ఎస్ బీఐ ఏ విధంగా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on January 29, 2022 8:21 pm
ఎంత మంచి సినిమా తీసినా అపోజిషన్ వల్ల ప్రతిసారి వసూళ్లు ప్రభావితం చెందుతున్నాయనే ఆందోళన నిర్మాత నాగవంశీలో పలు సందర్భాల్లో…
వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారం అందరికీ తెలిసిందే. ఆయనపై ఇప్పటికి మూడు కేసులు నమో దయ్యాయి.…
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కబోయే సినిమా ఓపెనింగ్ ఉగాది రోజు జరగనుంది. విక్టరీ వెంకటేష్ ముఖ్య…
తెలుగు దేశం పార్టీ... భారత రాజకీయాల్లో ఓ సంచలనం. తెలుగు నేల రాజకీయాల్లో ఓ మార్పు. దేశంలోని ఎన్నో రాష్ట్రాల్లో…
వ్యాపారం అందరూ చేస్తారు. కొందరు కష్టాన్ని నమ్ముకుంటే.. మరికొందరు తెలివిని నమ్ముకుంటారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మాత్రం ఈ…
భారీ అంచనాల మధ్య విడుదలైన ఎల్2 ఎంపురాన్ కు మలయాళంలో ఏమో కానీ ఇతర భాషల్లో డివైడ్ టాక్ వచ్చిన…