మహమ్మారి వైరస్ బారినపడిన దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమైన సంగతి తెలిసిందే. అమెరికా వంటి అగ్రరాజ్యం కూడా కరోనా బారిన పడి విలవిలలాడుతోంది. దీంతో,అమెరికాలో నిరుద్యోగ స్థాయి పెరిగిపోయింది. మరోవైపు, ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి లోకల్ సెంటిమెంట్ ను అమెరికన్లలో బలంగా రాజేశారు.
దీంతో, భారత్ సహా విదేశాల నుంచి వచ్చి అమెరికాలో పనిచేసేవారిపై కొంత వివక్ష ఉంది. అందుకే, ట్రంప్…వీలు చిక్కినప్పుడల్లా హెచ్ 1 బీ వీసాల సంఖ్య తగ్గించడం…నిబంధనలు కఠినతరం చేయడం…వీలైతే ఆ వీసాలతోపాటు విదేశీయులకు అమెరికాలో ఉద్యోగాలిచ్చే అన్ని రకాల వీసాలు రద్దు చేయాలని కాచుకు కూర్చున్నాడు. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు….తాజాగా కరోనా విపత్తు ట్రంప్ లోకల్ పైత్యానికి బలం చేకూర్చింది.
ఈ నేపథ్యంలోనే ట్రంప్ …హెచ్ 1 బీ వీసాలతోపాటు, అమెరికాలో విదేశీయులకు లభించే పలురకాల వీసాలను రద్దు చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ పత్రిక ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ కథనం ప్రకారం…ఆ వీసాల రద్దుకు ట్రంప్ మొగ్గుచూపుతున్నారని, అక్టోబర్ నాటికి తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.
మహమ్మారి వైరస్ కారణంగా అమెరికాలో లక్షలాది మంది ఉపాధిని కోల్పోయారు. ఈ దశలో విదేశీయులకు ఉద్యోగాలకు అనుమతిస్తే అమెరికన్లలో తీవ్ర వ్యతిరేకత పెరుగుతుందని ట్రంప్ భావిస్తున్నారట. అందులోనూ త్వరలోనే జరగనున్న అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో మరోసారి ట్రంప్ లోకల్ సెంటిమెంట్ నే నమ్ముకున్నారట. దీనికి తోడు కరోనాను ట్రంప్ లైట్ తీసుకున్నారని అమెరికన్లలో ట్రంప్ పై కోపం ఉంది.
దీనికి తోడు నల్లజాతీయులపై జాత్యాహంకార దాడుల వ్యవహారం అమెరికాను కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ వీసాల రద్దు ప్రతిపాదనను ట్రంప్ తెరపైకి తెచ్చినట్టు తెలుస్తోంది. వాటి రద్దుతో అమెరికన్లలో సానుభూతి పొందవచ్చని ట్రంప్ యోచిస్తున్నారట. అందుకే, సస్పెన్షన్ ను ఎత్తివేసేంత వరకూ హెచ్-1బీ వీసాలను జారీ చేయరాదని ప్రభుత్వం భావిస్తోందని ఓ అధికారి అనధికారికంగా వెల్లడించారట.
అయితే, ఇప్పటికే వీసాలను పొంది, అమెరికాలో ఉద్యోగం చేస్తున్న విదేశీయులపై ఎటువంటి ప్రభావమూ ఉండబోదని తెలుస్తోంది. వీసాల రద్దు నిర్ణయం అత్యధికంగా భారత సాఫ్ట్ వేర్ నిపుణులపైనే పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వీసాలు రద్దయితే… అమెరికాలో ఉన్న భారతీయ ఉద్యోగులు, తమ ఉద్యోగాలను వదిలేసి స్వదేశానికి రావాల్సి వుంటుందని హెచ్చరిస్తున్నారు.
This post was last modified on %s = human-readable time difference 10:51 am
ఏపీ సీఎం చంద్రబాబు అంటే రాష్ట్రంలోని మహిళలకు ప్రత్యేకమైన గౌరవం ఉన్న సంగతి తెలిసిందే. డ్వాక్రా సంఘాలను ఏపీ మహిళలకు…
విశాఖకు మణిహారంగా ఉన్న రుషికొండపై ప్రజాధనాన్ని వ్యర్థం చేస్తూ ప్యాలెస్ ను మాజీ సీఎం జగన్ నిర్మించుకున్న సంగతి తెలిసిందే.…
దీపావళికి టాలీవుడ్ బాక్సాఫీస్ వెలిగిపోతోంది. కన్నడ అనువాదం ‘బఘీర’ను మినహాయిస్తే మూడు సినిమాలూ బాక్సాఫీస్ దగ్గర బాగా సందడి చేస్తున్నాయి.…
ఆగస్టు 15 వీకెండ్లో ‘స్త్రీ-2’ అనే మిడ్ రేంజ్ సినిమా ఒకటి రిలీజైంది. దాంతో పాటు అక్షయ్ కుమార్ ముఖ్య…
తెలంగాణ రాజకీయాలు రసపట్టుగా మారుతున్నాయి. ఇప్పుడు రాజకీయం అంతా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల మధ్య జరుగుతుందనుకుంటున్న తరుణంలో…
పటాసుల పండగ అయిపోయింది. బాక్సాఫీస్ మతాబులు పెద్ద శబ్దం చేస్తూ భారీ ఎత్తున ట్రేడ్ కు సంబరాలు తెచ్చిపెట్టాయి. వందల…