Trends

క‌రోనా ప‌నిప‌ట్టే.. మొక్క‌

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని నివారించే ఫైటోకెమికల్స్ను  ఐఐటీ పరిశోధకులు ఓ మొక్కలో గుర్తించారు. శాస్త్రీయ పద్ధతుల్లో పరీక్షించి కరోనా వైరస్ను నిరోధిస్తున్నట్లు తేల్చారు. టీకాయేతర ఔషధాల కోసం జరుగుతున్న అన్వేషణలో ఈ మొక్కల్లో లభించే ఫైటోకెమికల్స్ కీలకంగా మారనున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, ఈ మొక్క‌లు హిమాల‌యాల్లో మాత్ర‌మే ఉన్నాయ‌ని తెలిపారు. హిమాలయాల్లో ఎన్నో అద్భుతాలు దాగున్నాయని, చాలా రోగాలను నయం చేసే ఆయుర్వేద మూలికలు దొరుకుతాయని అంటున్నారు. ఇప్పుడు ఆ మాట నిజమని నిరూపించారు కొందరు శాస్త్రవేత్తలు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కొవిడ్-19 వైరస్ను నిరోధించే ఫైటోకెమికల్స్ కలిగిన మొక్కను గుర్తించారు.

హిమాచల్ప్రదేశ్, మండిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ), ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనటిక్ ఇంజినీరింగ్ అండ్ బయోటెక్నాలజీ (ఐసీజీఈబీ) పరిశోధకులు.. కొవిడ్-19 చికిత్సలో కీలకమైన ఫైటోకెమికల్స్ను హిమాలయాల్లోని ‘రోడోడెండ్రాన్ అర్బోరియం’ అనే మొక్క పూరేకుల్లో గుర్తించారు. ఈ మొక్కను స్థానికంగా ‘బురాన్ష్’గా పిలుస్తారు. ఈ ఫైటోకెమికల్స్ వైరస్కు వ్యతిరేకంగా పోరాడతాయి. ఈ అధ్యయనం ఇటీవలే ‘బయోమాలిక్యులార్ స్ట్రక్చర్ అండ్ డైనమిక్స్’ జర్నల్లో ప్రచురితమైంది.

వైరస్పై పోరాడే శక్తిని ఇచ్చే వాటిల్లో వ్యాక్సిన్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా టీకాయేతర ఔషధాలను గుర్తించేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయా ఔషధాల్లో రసాయనాలు ఉంటాయి. ఇవి మన శరీర కణాలలోని గ్రాహకాలను బంధిస్తాయి, వైరస్ ప్రవేశించకుండా నిరోధిస్తాయి. అలాగే.. శరీరంలో వైరస్ ప్రవేశించినా వృద్ధి చెందకుండా అడ్డుకుంటాయి. వివిధ రకాల చికిత్సలపై అధ్యయనం చేశాక.. మొక్కల నుంచి తీసుకున్న రసాయనాలు- ఫైటోకెమికల్స్ వైరస్ను నిరోధించటంలో కీలకంగా మారుతున్నాయని తెలిసింది. అని ఐఐటీ ప్రొఫెస‌ర్ తెలిపారు.

హిమాలయాల్లో దొరికే బురాన్ష్ మొక్కల పూరేకులను స్థానికులు ఎన్నో ఏళ్ల నుంచి వివిధ రకాల చికత్సల్లో వినియోగిస్తున్నారు. ఈ పూరేకుల్లో వివిధ రకాల ఫైటోకెమికల్స్ ఉన్నట్లు శాస్త్రీయంగా పరీక్షించినట్లు చెప్పారు. ముఖ్యంగా యాంటీవైరల్ గుణాలపై దృష్టిపెట్టినట్లు తెలిపారు. త్వ‌ర‌లోనే వీటిపై ప‌రిశోధ‌న‌ను పూర్తి చేసి.. ప్ర‌భుత్వానికి నివేదిస్తామ‌ని వివ‌రించారు. మ‌రి ఏమేర‌కు స‌క్సెస్ అవుతారో చూడాలి.

This post was last modified on January 18, 2022 8:42 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అదానీ-జగన్ లింకుపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…

2 mins ago

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…

2 hours ago

రేవంత్ రెడ్డి.. అదానీ ఒప్పందాలు రద్దు చేస్తారా?

అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…

3 hours ago

మంచు విష్ణు అసలు ప్లానింగ్ ఇదా

మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…

4 hours ago

సాక్షి మీడియా నన్ను కవర్ చేయదు…షర్మిల సెటైర్లు

మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…

4 hours ago