విన్నంతనే విచిత్రంగా అనిపించినా ఇది నిజం. ఒక చిట్టి వీడియోకు యూట్యూబ్ లో వచ్చిన వ్యూస్ ఎన్నో తెలుసా? అక్షరాల.. 10,010,233,499. ఇంత పెద్ద అంకెను చదవటానికి ఇబ్బంది పడుతున్నారా? సింఫుల్ గా చెప్పేయాలంటే ‘వెయ్యి కోట్లు’. ప్రపంచ జనాభా కంటే ఎక్కువగా ఉన్న ఈ వ్యూస్ ఆ వీడియోకు ఎందుకు వచ్చాయి? ఆ వీడియో ప్రత్యేకత ఏమిటి? అన్న విషయంలోకి వెళితే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.
దక్షిణ కొరియా ఎడ్యుకేషన్ అండ్ రైమ్స్ క్రియేట్ కంపెనీ.. ‘‘పింక్ ఫాంగ్’’ ఈ బుజ్జి వీడియోను రూపొందించింది. బేబీ షార్క్ సాంగ్.. యూ ట్యూబ్ లోనే అత్యధికమంది వీక్షించిన వీడియోగా పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకుంది. ప్రపంచ జనాభా 7.8 బిలియన్లు అంటే.. ఈ వీడియోకు ఏకంగా 10 బిలియన్ వ్యూస్ రావటం విశేషం.
ఇద్దరు చిన్నపిల్లలు ‘బేబీ షార్క్ డు డు డు’ అంటూ లయబద్ధంగా వేసే స్టెప్పులు.. బ్యాక్ గ్రౌండ్ లో బేబీ షార్క్ తో పాటు.. వరుసగా వచ్చే మమ్మీ.. డాడీ.. గ్రాండ్ పా.. గ్రాండ్ మాలు వస్తూ.. సరదాగా సాగిపోతుంది. విన్నంతనే రోటీన్ కు విచిత్రంగా.. ఏ భాషకు చెందినవారైనా సరే.. ఈజీగా హమ్ చేసుకునేలా ఈ పాట సాగుతుంది. 2020 నవంబరులో ఈ వీడియో సాంగ్ 7 బిలియన్ వ్యూస్ దాటి గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించింది. ఇక.. ఈ కొరియన్ పాటను కొరియాన్ – అమెరికన్ గాయని హోప్ సెగోయిన్ పాడారు. ఆమె తన పదేళ్ల వయసులో ఈ పాటను పాడారు. 2016లో ఈ పాటను యూట్యూబ్ లో పింక్ ఫాంగ్ సంస్థ రిలీజ్ చేసింది.
పెను సంచలనంగా మారటమే కాదు.. అన్ని రికార్డుల్ని బద్ధలు కొట్టేసిన ఈ బుజ్జి వీడియో నిడివి కేవలం 2.16 నిమిషాలు మాత్రమే. మరింత ఆసక్తికరమైన విషయం కేవలం నిమిషం మాత్రమే లిరిక్స్ ఉంటాయి. 2018లో టిక్ టాక్ ద్వారా #BabySharkChallenge వైరల్ కావడంతో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యింది. సెలబ్రిటీలు సైతం ఈ పాటకు ఫ్యాన్స్ కావటం. ఇంత సూపర్ డూపర్ హిట్ అయిన ఈ పాటను ఎవరు రాశారు అనే విషయం మీద మాత్రం ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోవటం. ప్రపంచ ప్రసిద్ది చెందిన ఒక పాటను రాసింది ఎవరో తెలీకుండా ఉండటం. అందునా ఈ డిజిటల్ కాలంలో. విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఇక.. ఈ పాట హక్కులన్నీ పింక్ ఫోంగ్ పేరెంట్ కంపెనీ అయిన స్మార్ట్ స్టడీ వద్ద ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. ఒకసారి వినేయండి.
This post was last modified on January 15, 2022 10:51 am
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…