ఫస్ట్ వేవ్‌లో కరోనా మహమ్మారి కొన్ని నెలల పాటు జనాలను జనాలను ఎలా ఉక్కిరి బిక్కిరి చేసిందో తెలిసిందే. ఆ టైంలో అత్యంత ప్రతికూల ప్రభావం చూసిన రంగం అంటే సినీ పరిశ్రమే. లాక్ డౌన్ ప్రభావం మిగతా రంగాలపై రెండు మూడు నెలలే ఉంది. కానీ సినిమా పరిశ్రమలో మాత్రం దాదాపు ఆరు నెలలు కార్యకలాపాలన్నీ ఆగిపోయాయి. సినిమా థియేటర్లయితే ఇంకా ఎక్కువ రోజులు మూత పడి ఉన్నాయి.
2020 చివరికి పరిస్థితులు చక్కబడి మళ్లీ కార్యకలాపాలు కొనసాగాయి. ఆపై కరోనా ప్రభావం బాగా తగ్గిపోవడం.. పూర్వపు పరిస్థితులు రావడంతో హమ్మయ్య అనుకున్నారు సినీ జనాలు. మళ్లీ థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీ వచ్చింది. షూటింగ్స్ యధావిధిగా సాగాయి. ఏ రకమైన ఇబ్బందీ కనిపించలేదు. కానీ జనాలంతా లైట్ తీసుకున్న సమయానికి మళ్లీ కరోనా మహమ్మారి విజృంభించడం మొదలైంది.
సెకండ్ వేవ్ విధ్వంసం ఏ స్థాయిలో సాగిందో తెలిసిందే. దాన్నుంచి కూడా సినీ పరిశ్రమ కోలుకుని ఎలాగోలా నిలబడింది.సెకండ్ వేవ్ తర్వాత ఇక ఎప్పటికీ కరోనా మహమ్మారి మునుపటి స్థాయిలో ప్రభావం చూపదని, సంక్షోభం ముగిసినట్లే అని, ఇక కష్టాలన్నీ తీరిపోయినట్లే అనుకున్నారు సినీ జనాలు.
థర్డ్ వేవ్ ఉంటందనుకున్న సెప్టెంబరు, మార్చి నెలల్లో ఆ ప్రభావం పెద్దగా కనిపించకపోవడంతో సంక్షోభాన్ని దాటేసినట్లే అంతా భావించారు. కానీ ఇప్పుడు ఊహించని విధంగా మళ్లీ వైరస్ విజృంభిస్తోంది. సినీ పరిశ్రమ ఇబ్బందుల్లో పడుతోంది అనడానికి సినీ ప్రముఖులు కరోనా మహమ్మారి బారిన పడటమే సంకేతం. మహేష్ బాబు సహా కొందరు కరోనా సోకి ఇంటికి పరిమితం అయ్యారు. ఇండస్ట్రీలో కరోనా కేసుల సంఖ్య ఉన్నట్లుండి పెరిగిపోయి సినీ కార్యకలాపాలన్నీ ఆపేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఒకదాని తర్వాత ఒక సినిమా షూటింగ్ ఆగిపోతోంది.
ప్రభుత్వం బ్రేకులేయకున్నా స్వచ్ఛందంగా షూటింగ్స్ ఆపుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. మరోవైపు థియేటర్ల మీద ఆంక్షల దిశగా అడుగులు పడుతున్నాయి. ఏపీలో ఆల్రెడీ ఆక్యుపెన్సీ సగానికి పడిపోయింది. నైట్ కర్ఫ్యూ వల్ల సెకండ్ షోలు రద్దయ్యే పరిస్థితి నెలకొంది. తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో ఆంక్షలు తప్పేలా లేవు. మొత్తానికి ఇండస్ట్రీలో ఇంకెప్పటికీ ఆ చెడ్డ రోజులు తిరిగి రావని, సంక్షోభం ముగిసినట్లే అనుకుంటే.. మూడో వేవ్ వణికించడం మొదలుపెట్టింది. చూస్తుంటే ఏటా ఇలాంటి ఒక దశను ఎదుర్కోక తప్పేలా లేదు. మిగతా ఇండస్ట్రీలతో పోలిస్తే సినీ పరిశ్రమపై దీని ప్రతికూల ప్రభావం ఎక్కువే ఉంటోంది.
This post was last modified on January 8, 2022 3:59 pm
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…
ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణలోని సైబరాబాద్‌కు ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…