అరుదైన ఘటనగా దీన్ని చెప్పాలి. పుడుతూనే ఈ ఇద్దరు చిట్టి కవలలు రికార్డును క్రియేట్ చేశారు. వార్తల్లో వ్యక్తులయ్యారు. పుట్టింది కవలలుగానే అయినా.. వారిద్దరి బర్త్ డేట్ మాత్రమే కాదు.. బర్త్ ఇయర్ కూడా మారిపోయిన సిత్రం వీరి సొంతం. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. కలిసి పుట్టినప్పటికీ ఈ అన్నాచెల్లెళ్ల పుట్టిన ఏడాది మాత్రం మారిపోయిన వైనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఇంతకూ ఇదెలా సాధ్యమంటారా? వివరాల్లోకి వెళితే.. మీకే అర్థమవుతుంది.
కాలిఫోర్నియా రాష్ట్రంలోని గ్రీన్ ఫీల్డ్ సిటీకి చెందిన ఫాతిమా మాడ్రిగల్ కు డిసెంబరు 31న పురుటి నొప్పులు వచ్చాయి. దీంతో ఆమెను స్థానిక నతివిదాడ్ మెడికల్ సెంటర్ కు తరలించారు. అదే రోజు రాత్రి 11.45 గంటలలో తొలి కాన్పు అయ్యింది. పండంటి మగపిల్లాడు జన్మించాడు. కవలల్లో రెండో వారు లోకాన్ని చూసేసరికి అర్ధరాత్రి 12 గంటలైంది. దీంతో.. డేట్ మాత్రమే కాదు ఇయర్ కూడా మారిపోయింది.
కేవలం పదిహేను నిమిషాల తేడాతో పుట్టి నేపథ్యంలో వారిద్దరి పుట్టిన రోజు మాత్రమే కాదు.. సంవత్సరాలు కూడా మారిపోవటం ఆసక్తికరంగా మారింది. ఈ విషయాన్ని సదరు మెడికల్ సెంటర్ సోషల్ మీడియాలో షేర్ చేసుకొంది. వారి ఫోటోల్ని అప్ లోడ్ చేయటంతో పాటు.. ఇద్దరు శిశువులు.. వారి తల్లి ఆరోగ్యంగా.. క్షేమంగా ఉన్నట్లు తెలపటంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఇలాంటి ఉదంతాలు చాలా అరుదుగా చోటు చేసుకుంటాయని చెబుతున్నారు.
ఇక.. ఈ చిట్టి కవలల తల్లి చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. తన కవలలు వేర్వేరు డేట్ లో.. అది కూడా వేర్వేరు సంవత్సరాల్లో పుట్టిన వైనం తనకు చాలా క్రేజీగా అనిపిస్తోందని పేర్కొన్నారు. ముందుగా పుట్టిన మగపిల్లాడికి ఆల్ఫ్రెడో.. తర్వాత పుట్టిన పాపకు ఆలీన్ అన్న పేర్లను పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ కవలలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందరిని ఆకర్షిస్తున్నారు. మొత్తానికి పుడుతూనే అరుదైన రికార్డును క్రియేట్ చేశారని చెప్పాలి.
This post was last modified on January 4, 2022 1:17 pm
ఇండియాలో ఇప్పటిదాకా వచ్చిన బెస్ట్ వెబ్ సిరీస్ ఏది అంటే.. ఎక్కువమంది ‘ఫ్యామిలీ మ్యాన్’ పేరే చెబుతారు. దీన్ని మించిన…
ఖరీదైన వస్తువుల్ని కొనుగోలు చేసే విషయంలో భారత కుబేరుడు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఎప్పుడూ ముందుంటారు. ఆయన కొనుగోలు…
సిద్ధు జొన్నలగడ్డ కెరీర్ను గొప్ప మలుపు తిప్పిన సినిమా.. డీజే టిల్లు. చిన్న సినిమాగా రిలీజై పెద్ద విజయం సాధించిన…
రేపు విడుదల కాబోతున్న సికందర్ ప్రమోషన్లలో భాగంగా సల్మాన్ ఖాన్ ఇస్తున్న ఇంటర్వ్యూలో కొన్ని మాటలు భలే విచిత్రంగా అనిపిస్తున్నాయి.…
తెలంగాణ రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో శనివారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
ఏప్రిల్ 25 విడుదల కావాల్సిన కన్నప్ప వాయిదా పడింది. ఒక కీలక ఎపిసోడ్ కు సంబంధించిన విఎఫ్ఎక్స్ కు ఎక్కువ…