ఉత్తర కొరియా అధ్యక్షుడు కమ్ నియంత కిమ్ కు ఏమైంది ? ఇపుడిదే అంశం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపడేట్లు చేస్తోంది. కిమ్ అంటే భారీ ఆకారంతో ఉంటారని అందరికీ తెలిసిందే. కానీ తాజాగా విడుదలైన ఆయన ఫొటోలు చూసిన తర్వాత బాగా సన్నబడిపోయి స్లిమ్ముగా తయారయ్యారంటే ఎవరు నమ్మలేకపోతున్నారు. కొందరేమో కిమ్ తీవ్ర అనారోగ్యంగా ఉన్నారని అంటున్నారు. మరికొందరేమో తన భారీ కాయాన్ని తగ్గించుకునేందుకు అద్యక్షుడు డైటింగ్ చేస్తున్నారని చెబుతున్నారు.
తాజాగా కొందరు అధికారులు మాత్రం తినటానికి తిండి దొరకని కారణంగానే కిమ్ బాగా సన్నబడిపోయినట్లు తెగ బాధపడిపోతున్నారు. అయితే తాజా కారణాన్ని ఎవరు నమ్మటం లేదులేండి. ఇక్కడ ఒక కారణమైతే అంగీకరించాల్సిందే. అదేమిటంటే ఉత్తరకొరియా తీవ్రమైన ఆర్ధిక, ఆహార సంక్షోభంలో ఉన్నదైతే వాస్తవం. కిమ్ ఒంటెత్తు పోకడల కారణంగా ఉత్తరకొరియాపై చాలా దేశాలు అనేక ఆంక్షలు విధించాయి. దీంతో అనేక రకాలుగా దేశంలో సంక్షోభం పెరిగిపోతోంది.
దీనికితోడు ఇటీవల సంభవించిన భారీ వరదలు, ప్రకృతి విపత్తులు దేశాన్ని అతలాకుతలం చేసేసింది. దీని వల్ల లక్షల ఎకరాల్లో పంటలు ఒక్కసారిగా దెబ్బతినేశాయి. దీని కారణంగా ప్రజలకు మూడుపూటలా కడుపునిండా తినడానికి తిండి దొరకటం లేదన్నది నిజం. ప్రజలు కడుపునిండా తిండి తినలేకపోతున్నారు కాబట్టి తమ అధ్యక్షుడు సరిగా తిండితినటం లేదని అధికారులు చెబుతున్నారు. అయితే విదేశాలు దీన్ని పెద్ద జోక్ గా కొట్టిపారేస్తున్నాయి.
కిమ్ మనస్తత్వం ప్రకారం ఎవరికి తిండున్నా లేకపోయినా తన తిండిని మాత్రం తగ్గించరు. కిమ్ వంశంలో ఇప్పటికే అనేకమంది గుండెపోటుతో చనిపోయారట. ఇపుడు కిమ్ కూడా తిండి తగ్గించని కారణంగానే అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఇప్పటికే డాక్టర్లు అధ్యక్షుడికి చెప్పారట. దాని కారణంగానే కిమ్ డైట్ ను పాటించటం వల్లే బాగా స్లిమ్ గా కనిపిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. కారణాలు ఏవైనా కానీండి కిమ్ కు ఏమైందనే ఆందోళనైతే ప్రపంచదేశాల్లో పెరిగిపోతోంది.
This post was last modified on January 3, 2022 5:21 pm
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…