ఈ రోజు సమావేశమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమలలో మూడో ఘాట్ రోడ్డు నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. పదకవితా పితామహుడిగా ఖ్యాతి గడించిన అన్నమయ్య పేరును ఆ మార్గానికి పెట్టాలని నిర్ణయించింది. అన్నమయ్య నడిచి తిరుమలకు చేరుకున్న ఆ మార్గాన్ని అభివృద్ధి చేయాలని టీటీడీ సంకల్పించింది. అన్నమయ్య ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తే తిరుపతికి వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా తిరుమలలోని తుంబూరు కోనకు చేరుకోవచ్చు.
రేణిగుంట మండలంలోని కరకంబాడీ-బాలపల్లి నుంచి అన్నమయ్య ఘాట్ రోడ్డు మార్గం మొదలవుతుంది. ఆల్రెడీ ఈ మార్గం ద్వారా కడప జిల్లాకు చెందిన భక్తులు తిరుమల కొండకు వస్తుంటారు. ఈ మార్గంలో ఇప్పటికే శతాబ్దాల క్రితం యాత్రికుల కోసం ఏర్పాటైన సత్రాలు కనిపిస్తుంటాయి. కానీ, ఈ మార్గంలో ఒంటరిగా వెళ్లడం శ్రేయస్కరం కాకపోవడంతో దీనికి అంత గుర్తింపు రాలేదు. అయితే, టీటీడీ ఈ మార్గాన్ని అభివృద్ది చేయడం వల్ల భవిష్యత్తులో భక్తులు పెద్ద సంఖ్యలో ఈ మార్గాన్ని వినియోగించుకునే అవకామశముంది.
దీంతోపాటు, టీటీడీ పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 10 రోజులపాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. కోవిడ్ తీవ్రత తగ్గితే సంక్రాంతి తర్వాత సర్వదర్శనం పెంపు, ఆర్జిత సేవలకు భక్తులను అనుమతిస్తామన్నారు.
చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణానికి విరాళాలు అందించిన భక్తులుకు ఉదయాస్తమాన సేవకు అనుమతిస్తామన్నారు. నాదనీరాజనం మండపం దగ్గర శాశ్వత ప్రాతిపాదికన మండపాన్ని నిర్మిస్తామన్నారు. రూ. 3 కోట్ల రూపాయల వ్యయంతో వసతి గదుల్లో గీజర్లు ఏర్పాటు చేస్తామన్నారు. టీటీడీ ఐటీ వింగ్ కోసం అర్హత కలిగిన ఉద్యోగులతో ప్రత్యేక టీటీడీ ఐటీ వింగ్ ఏర్పాటు చేస్తామని వైవీ చెప్పారు.
This post was last modified on December 11, 2021 10:36 pm
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…